Suhas : సుహాస్ ని అలాంటి సీన్లో చూసి భార్య ఇచ్చిన రియాక్షన్..!

Suhas : టాలీవుడ్ లో ప్రస్తుతం ఉన్న టాలెంటెడ్ హీరోల్లో ఒకడు సుహాస్. చిన్న చిన్న షార్ట్ ఫిలిమ్స్ చేసి సినిమాల్లో ఎంట్రీ ఇచ్చిన ఈ నటుడు హీరో ఫ్రెండ్ క్యారెక్టర్లు చేస్తూ, ఇప్పుడు ఏకంగా హీరో అయ్యాడు. ఇక ఎంట్రీ ఇచ్చిన ఫస్ట్ సినిమాతోనే మంచి విజయాన్ని సొంతం చేసుకుని విమర్శల ప్రశంసలు సైతం అందుకున్నాడు ఈ హీరో. కెరీర్ బిగినింగ్ లో మంచి మంచి కాన్సెప్ట్ లతో సినిమాలు చేస్తూ వస్తోన్న సుహాస్, మెల్లి మెల్లిగా కమర్షియల్ వైపు అడుగులు వేస్తున్నాడు. టాలీవుడ్ లో నేచురల్ స్టార్ అంటే వెంటనే గుర్తుకు వచ్చేది నాని, ఇప్పుడు సుహాస్ కూడా డిఫరెంట్ కథలు సెలెక్ట్ చేసుకుని వరుస సినిమాలు చేస్తూ న్యాచురల్ హీరో అనిపించుకోవాలని చూస్తున్నాడు. ఇక ఈ ఇయర్ ఆల్రెడీ అంబాజీ పేట మ్యారేజ్ బ్యాండ్ సినిమాతో ఆడియన్స్ ని పలకరించిన సుహాస్ ఆ సినిమాతో డీసెంట్ హిట్టు కొట్టాడు. మొన్నామధ్య శ్రీరంగ నీతులు అనే సినిమాలో ప్రత్యేక పాత్రలో నటించాడు. ఇక ఇప్పుడు ప్రసన్నవదనం సినిమాతో ప్రేక్షకుల్ని పలకరించడానికి రెడీ అయ్యాడు. అయితే రాబోయే ప్రసన్న వదనం సినిమాలో కాస్త మసాలా డోస్ ను పెంచాడు సుహాస్.

కమర్షియల్ గా మసాలా డోస్ పెంచిన సుహాస్..

తాజాగా సుహాస్(Suhas) నటించిన ప్రసన్న వదనం సినిమాలో కాస్త మసాలా డోస్ పెంచాడని తెలుస్తుంది. ఇక సుహాస్ ఈ సినిమాలో ఓ లిప్ లాక్ సీన్స్ తో రెచ్చిపోయాడు. ఫేస్ బ్లైండ్ అనే సరికొత్త కాన్సెప్ట్ తో ఈ సినిమా తెరకెక్కగా, హీరోయిన్ పాయల్ రాధాకృష్ణతో సుహాస్ లిప్ కిస్ సీన్ చేయడం ట్రైలర్ లో కూడా చిన్న షాట్ లా కనిపించింది. ఇక తాజాగా ఈరోజే సినిమా రిలీజ్ కాగా, ఈ సినిమా రిలీజ్ కి రెండు వారాల ముందు నుంచే చిత్ర యూనిట్ ప్రమోషన్లు చేస్తున్నారు. అయితే తాజాగా ఈ సినిమా ప్రమోషన్స్ లో సుహాస్ కు ఓ ప్రశ్న ఎదురయ్యింది. ఈ సినిమాలో సుహాస్ చేసిన లిప్ లాక్ సీన్ విషయంలో మీ భార్య అనుమతి తీసుకున్నారా అని యాంకర్ ప్రశ్నించారు. దానికి సుహాస్ స్పందిస్తూ చెప్పిన సమాధానం అందరిని ఆశ్చర్యపరిచింది.

ఆ సీన్ చూసి ఒక్కసారిగా రియాక్షన్ ఇచ్చింది – సుహాస్

ఇక ఇంటర్వ్యూ లో సుహాస్ లిప్ లాక్ సీన్ గురించి మాట్లాడుతూ ఇలా అన్నాడు. నా భార్య ఇప్పటికే సినిమా చూసింది.. ఆ లిప్ కిస్ సీన్ చూసి.. ఊమ్ ..ఎంజాయ్ చేస్తున్నావ్ గా అనే అర్థం వచ్చేలా ఎక్స్ ప్రెషన్ ఇచ్చిందని సుహాస్ అన్నాడు. ఇక నా యాక్టింగ్ విషయంలో నా భార్య బెస్ట్ క్రిటిక్ అన్నాడు సుహాస్. ఈ విషయంలో అలా చేయల్సి ఉండాల్సింది.. ఇలా చేసి ఉండాల్సింది అని ఎప్పుడూ తిడుతుందని సుహాస్ అన్నాడు. అంతే కాదు లిప్ లాక్ సీన్ విషయంలో తన భార్య ఎలాంటి ఎక్స్ ప్రెషన్ ఇచ్చిందో ఫన్నీగా చేసి చూపించారు సుహాస్. ఇక ఈ ప్రసన్న వదనం సినిమా హిట్ అయితే, టాలీవుడ్ లో సుహాస్ కు తిరుగుండదని చెప్పవచ్చు. ముఖ్యంగా మార్కెట్ పరంగా ఓ అంచనా కే వచ్చేయొచ్చు. ఇక ఈయంగ్ హీరో సినిమాలకు ఓటీటీలో సైతం మంచి రెస్పాన్స్ వస్తోంది. ఇప్పటికే అరడజను సినిమాలతో బిజీ బిజీగా ఉన్న సుహాస్ ఈ సినిమా హిట్ అయితే పారితోషకం పెంచే ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తుంది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు