South Star Hero: ఒకప్పుడు సేల్స్ మెన్.. ఇప్పుడు రూ.వందల కోట్ల ఆస్తి..ఎవరంటే..?

South Star Hero: సాధారణంగా ఏ సినీ ఇండస్ట్రీలో అయినా సరే ప్రస్తుతం స్టార్ హీరోలుగా, హీరోయిన్ లుగా కొనసాగుతున్నారు అంటే వారు ఆ స్థానానికి రావడం కోసం ఎంత కష్టపడ్డారో వారి మాటల్లోనే అప్పుడప్పుడు అభిమానులకు తెలుస్తూ ఉంటాయి. ఈ క్రమంలోనే ఒకానొక సమయంలో సేల్స్ మేన్ గా పనిచేసి .. ఆ తర్వాత కోలీవుడ్ సూపర్ స్టార్ హీరోగా పేరు సొంతం చేసుకుంటున్నారు.. ఇక వారెవరో కాదు.. కోలీవుడ్ స్టార్ హీరో అజిత్.. ప్రస్తుతం కోలీవుడ్ సినీ ఇండస్ట్రీలోనే కాదు టాలీవుడ్ లో కూడా తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ సొంతం చేసుకున్న అజిత్ ప్రస్తుతం ఒక్కో సినిమాకు కోట్లల్లో పారితోషకం తీసుకుంటూ దూసుకుపోతున్నారు.. వివేకం, తెగింపు, వలిమై వంటి సినిమాలతో తెలుగు ప్రేక్షకులను కూడా అలరించిన ఈయన స్కూల్ డ్రాప్ అవుట్ నుంచి సూపర్ స్టార్ వరకు అజిత్ ఇప్పుడు ఒక పాపులర్ కోలీవుడ్ హీరో అని చెప్పవచ్చు ..

South Star Hero: Once a salesman..now hundreds of crores of property..Who is..?
South Star Hero: Once a salesman..now hundreds of crores of property..Who is..?

సేల్స్ మాన్ గా..

ఇప్పటికే 60 కి పైగా చిత్రాలలో నటించిన ఈయన ఎన్నో హిట్స్, సూపర్ హిట్ చిత్రాలతో ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు..పదవ తరగతి చదువుతున్నప్పుడే కొన్ని కారణాల వల్ల స్కూల్ మానేసి ఒక ఫ్యామిలీ ఫ్రెండ్ సహాయంతో రాయల్ ఎన్ఫీల్డ్ కంపెనీలో మెకానిక్ గా పనిచేశారు.. ఆ తర్వాత సేల్స్ మాన్ గా కూడా పనిచేసి నేడు రూ .100 కోట్లకు అధిపతి అయ్యారు . ఇకపోతే ఈయన చదువుకుంది పదవ తరగతే కానీ విమానాన్ని కూడా నడపగలరు.. మరి అజిత్ గురించి మరికొన్ని తెలియని ఇంట్రెస్టింగ్ విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం..

ప్రొఫెషనల్ షూటర్ , రేసర్ కూడా..

1971 మే 1న సికింద్రాబాద్లో జన్మించారు అజిత్ కుమార్.. ఈయన తండ్రి పి.సుబ్రహ్మణ్యం కేరళకు చెందినవారు.. అజిత్ కి అనిల్ కుమార్, అనూప్ కుమార్ అనే ఇద్దరు సోదరులు కూడా ఉన్నారు..అజిత్ కి చదువు పై పెద్దగా ఆసక్తి లేదు.. అందుకే పదవ తరగతి వరకు చదువుకొని ఆ తర్వాత మెకానిక్ గా పనిచేశారు. చదువులో ప్రావీణ్యం లేకపోయినా తెలుగు, తమిళ్, మలయాళం, కన్నడ , హిందీ ,ఇంగ్లీష్ భాషల్లోఅనర్గళంగా మాట్లాడగలరు.. అంతేకాదు ప్రొఫెషనల్ రేసర్ కూడా.. 2004లో బ్రిటిష్ ఫార్ములా 3, ఫార్ములా 2 రేసుల్లో పాల్గొన్నారు.. అంతేకాదండోయ్ .. ప్రొఫెషనల్ షూటర్ కూడా.. తమిళనాడులో జరిగిన ఒక ఛాంపియన్షిప్ లో నాలుగు బంగారు పథకాలను కూడా దక్కించుకున్నారు ఇవే కాకుండా ఈయనకు బైక్ రైడింగ్ అంటే ఎంతో ఇష్టం షూటింగ్ నుంచి కాస్త విరామం దొరికితే చాలు బైక్ రేసింగ్ కి వెళ్తాడు.

- Advertisement -

విమానం కూడా నడపగలరు..

ఇప్పటికే విమానం నడపడం కోసం ట్రైనింగ్ కూడా తీసుకున్నారు.. విమానం కలిగి ఉన్న హీరోలు చాలామంది ఉన్నారు కానీ విమానాన్ని కూడా నడపగలిగిన హీరో అజిత్ మాత్రమే.. 2000వ సంవత్సరంలో తన సహనటి బేబీ షాలిని ను ప్రేమ వివాహం చేసుకున్నారు .. నాలుగు పదుల వయసు దాటిన జుట్టు పూర్తిగా తెల్ల రంగులోకి మారిపోయినా కలర్ మాత్రం వేసుకోడు. ప్రస్తుతం సోషల్ మీడియా ప్రపంచం అద్భుతమైన టెక్నాలజీతో దూసుకుపోతున్నా.. ఇప్పటికీ తనకంటూ ఒక ఫోన్ కూడా ఉపయోగించరు.. అజిత్ సోషల్ మీడియాకి దూరంగా ఉంటారు.. ప్రస్తుతం ఈయన రూ .150 కోట్లకు పైగా ఆస్తిని కలిగి ఉన్నారని తెలుస్తోంది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు