Baak Twitter Review: తమన్నా – రాశి కన్నా కాంబో హిట్ అయిందా..?

Baak Twitter Review : అరుణ్మనై-4 బాక్.. ప్రముఖ కోలీవుడ్ డైరెక్టర్ సుందర్ సి రూపొందించిన విజయవంతమైన తమిళ హార్రర్ కామెడీ ఫ్రాంచైజీ అరుణ్మనై యొక్క నాల్గవ భాగం.. సుందర్ సి తో పాటు ప్రముఖ స్టార్ హీరోయిన్ మిల్కీ బ్యూటీ తమన్నా భాటియా, రాశి ఖన్నా ప్రధాన పాత్రలో నటించిన ఈ చిత్రం తాజాగా విడుదలయ్యింది. తెలుగులో మంచి హిట్ టాక్ తో నడుస్తోంది.. బాక్ నిర్మాతలు ఈ చిత్రంలో తెలుగు నటీనటులను నటింపజేసి స్థానికంగా కనెక్ట్ అయ్యేలాగా చేశారు. అందులో భాగంగానే సినిమాను మరింత ప్రాంతీయంగా మార్చడానికి ప్రయత్నాలు చేయగా.. అది సక్సెస్ అయినట్టు తెలుస్తోంది.. హైదరాబాదులో జరిగిన ఈ చిత్ర ప్రీ రిలీజ్ ఈవెంట్ కి తమన్నా – రాశి కన్నా తో పాటు ఈ సినిమాలో నటించిన ముఖ్య తారాగణం కూడా పాల్గొన్నారు.. ఒకే తెరపై కనిపించి హారర్ కామెడీ ఫిలిం ఫ్రాంచైజీ సినిమా ఇది.. ఇకపోతే ఈ సినిమాను ప్రీమియర్స్ లో చూసిన నెటిజెన్లు ట్విట్టర్ ద్వారా తమ అభిప్రాయాలను వెల్లడిస్తున్నారు. మరి నెటిజన్ల నుంచి ఈ సినిమాకు ఎటువంటి స్పందన లభిస్తుందో చూద్దాం.

Baak Twitter Review: Has Tamannaah - Rashi Kanna combo hit..?
Baak Twitter Review: Has Tamannaah – Rashi Kanna combo hit..?

బాక్ తారాగణం..

ఈ కామెడీ – హార్రర్ చిత్రంలో సుందర్ సింగ్, తమన్నా,, రాశి కన్నా, కోవై సరళ, సంతోష్ ప్రతాప్ , రామచంద్రరాజు , యోగి బాబు, విటివి గణేష్, శ్రీనివాసరెడ్డి, వెన్నెల కిషోర్, కే. ఎస్ .రవికుమార్, జయప్రకాష్, ఢిల్లీ గణేష్ , రాజేంద్రన్ , సింగం పులి, విచ్చు విశ్వనాథ్ , దేవానంద వంటి నటీనటులతో పాటు అలనాటి హీరోయిన్స్ అయినా కుష్బూ , సుందర్, సిమ్రాన్ వంటి వారు కీలక పాత్రలో కనిపించారు..

ఇక ఈ చిత్రాన్ని అవ్నీ సినిమా మరియు బెంజ్ మీడియా ప్రైవేట్ లిమిటెడ్ బ్యానర్ లపై కుష్బూ సుందర్ మరియు ఏసీఎస్ అరుణ్ కుమార్ సంయుక్తంగా ఈ సినిమాని నిర్మించారు .. ఇక ఈ సినిమా కి సుందర్ సి కథ రాయగా. వెంకట రాఘవన్ సినిమాకి స్క్రీన్ ప్లే గా పనిచేశారు.. ఇకపోతే సినిమా చూసిన నెటిజెన్లు తమ అభిప్రాయాలను ట్విట్టర్ ద్వారా పంచుకోగా .. వారి అభిప్రాయాలు ఎలా ఉన్నాయి.. సినిమా గురించి ఏం చెప్పారు అనేది ఇప్పుడు చూద్దాం..

- Advertisement -

అరుణ్మనై ఫ్రాంచైజీలో ఈ చిత్రం చాలా బాగుంది.. పోస్ట్ రేట్స్ వద్ద అచాచో పాట చాలా బాగుంది.. ముఖ్యంగా మిగిలిన ఫ్రాంచైజీలతో పోల్చుకుంటే ఈ సినిమా ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటుంది.. అంటూ ఒక నెటిజన్ ట్వీట్ చేశారు.

గత అరుణ్మనై సినిమాలతో పోల్చుకుంటే సంగీతం విజువల్స్ సీసీ వంటి సాంకేతిక అంశాలు చాలా బాగున్నాయి. హారర్ మరియు సెంటిమెంట్ బాగా పనిచేశాయి. ఇంటర్వెల్ కి ముందు హారర్ చివరి 40 నిమిషాలకు ఫ్రీ క్లైమాక్స్ కామెడీ సీక్వెన్స్, అమ్మన్ పాట అన్నీ కూడా అద్భుతంగా ఉన్నాయి అంటూ ట్వీట్ చేశారు.. ముఖ్యంగా ఫ్యామిలీ కోసం పక్కా సమ్మర్ ఎంటర్టైనర్ మూవీ అని మరొక నెటిజన్ ట్వీట్ చేశాడు..

మొత్తానికి అయితే రాశి కన్నా, తమన్నాల హారర్ కామెడీ మూవీ ప్రేక్షకులను బాగా మెప్పించింది అని చెప్పవచ్చు.. మరి కలెక్షన్స్ ఏ విధంగా రాబడుతుందో చూడాలి.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు