Prathinidhi2 Movie Review : ప్రతినిథి మూవీ 2 రివ్యూ

Prathinidhi2 Movie Review: 2018 తర్వాత హీరో నారా రోహిత్ నుండి ఒక్క సినిమా కూడా రాలేదు. అంటే 2019 ఎన్నికల టైం నుండి అతను ఒక్క సినిమా కూడా చేయలేదు. ఇప్పుడు 2024 ఎన్నికలకి ‘ప్రతినిథి 2 ‘ అంటూ ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. మరి ఈ సినిమా ఎలా ఉందో.. అతని పెదనాన్న నారా చంద్రబాబు నాయుడు పార్టీకి ఎంత మైలేజీ చేకూర్చిందో తెలుసుకుందాం రండి :

కథ :

చేతన్ (నారా రోహిత్) ఓ జర్నలిస్ట్. అతనికి నిజాయతీ ఎక్కువ. తన పీకల మీదికి ఎన్ని సమస్యలు వచ్చినా జనాలకి నిజాలు తెలియజేయడానికి వెనుకాడడు. ఇలాంటి టైంలో సీనియర్ జర్నలిస్ట్ (ఉదయభాను) అమెరికా నుండి వచ్చి ఓ ఛానల్ పెడుతుంది. తన ఛానల్ కి చేతన్ ని సీఈవోని చేస్తుంది. మరోపక్క చే.. పొలిటీషియన్ గజేంద్ర (అజయ్ ఘోష్)ను ఇంటర్వ్యూ చేసి అతని అక్రమాలు బయటపెడతాడు. దీంతో అతన్ని సస్పెండ్ చేస్తుంది పార్టీ. అంతేకాదు మరో పొలిటీషియన్ నరసింహ (పృథ్వీ) అక్రమాలు సైతం చేతన్ బయటపెట్టేస్తాడు. దీంతో ముఖ్యమంత్రి ప్రజాపతి (సచిన్ ఖేడేకర్) చేతన్ ని పిలిచి అభినందిస్తాడు. అయితే ఆ తర్వాత అనుకోకుండా బాంబ్ బ్లాస్ట్ జరుగుతుంది. దీంతో చేతన్ ని అరెస్ట్ చేస్తారు పోలీసులు. ఆ బాంబ్ బ్లాస్ట్ జరిగేలా చేసింది ఎవరు? చేతన్ ఈ సమస్యల నుండి ఎలా బయటపడ్డాడు. వంటి ప్రశ్నలకి సమాధానాలు కావాలంటే ‘ప్రతినిథి 2 ‘ చూడాల్సిందే.

విశ్లేషణ :

సీనియర్ జర్నలిస్ట్ అయినటువంటి మూర్తి ఈ కథని రాసుకుని నిర్మాతకి, హీరోకి ఇవ్వాలి అనుకున్నారు. కానీ వాళ్ళు మూర్తిని డైరెక్ట్ చేయమని కోరడంతో.. ఆయన డైరెక్షన్ కూడా చేయడం జరిగింది. ‘ప్రతినిథి 2 ‘ సినిమా తీసింది టీడీపీ ప్రచారం కోసమే అనే అభిప్రాయం చాలా మందిలో ఉంది. కానీ దర్శకుడు మూర్తి చాలా తెలివిగా దీనిని జర్నలిస్ట్ కోణంలో తీర్చిదిద్దే ప్రయత్నం చేశాడు.అయినప్పటికీ ప్రత్యర్థి పార్టీపై సెటైర్లు లేవా అంటే..? ఎందుకులేవు పుష్కలంగా ఉన్నాయి. ‘మహాత్మా గాంధీ వంటి గొప్ప నేత చనిపోయినప్పుడు జనాలకి హార్ట్ అటాక్ లు వంటివి ఎందుకు రాలేదు.. వాళ్ళు సూసైడ్ ఎందుకు చేసుకోలేదు.. ముఖ్యమంత్రి పోతే ఎందుకు ఇంత జరుగుతుంది’ అంటూ వైసిపి ఓదార్పు యాత్ర పై సెటైర్లు ఉన్నాయి. అలాగే టీడీపీ అనుకూలమైన సన్నివేశాలు కూడా అక్కడక్కడా ఉన్నాయి. అలా అని ఇరికించేలా అయితే లేవు అని చెప్పొచ్చు. ఫస్ట్ హాఫ్ బాగానే ఉంది. సెకండ్ హాఫ్ మాత్రం ఫస్ట్ హాఫ్ అంత క్లీన్ గా లేదు. హడావిడి హడావిడిగా కొన్ని సన్నివేశాలు వచ్చి పోవడం.. ప్రేక్షకులను గందరగోళానికి గురిచేస్తాయి. క్లైమాక్స్ కూడా సదా సీదాగానే ఉంది. దర్శకుడిగా మూర్తి ఈ సినిమాతో పాస్ మార్కులు మాత్రమే వేయించుకుంటారు.అంతేకానీ 2014 లో వచ్చిన ‘ప్రతినిథి’ ని మ్యాచ్ చేసే రేంజ్లో అయితే ఆయన ఈ చిత్రాన్ని తీర్చిదిద్దలేకపోయారు. సినిమాటోగ్రఫీ ఎందుకో వీక్ గా ఉంది. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కూడా దానికి తీసిపోలేదు. నిర్మాణ విలువలు కూడా గొప్పగా చెప్పుకునే రేంజ్లో ఏమీ లేవు.

- Advertisement -

హీరో నారా రోహిత్ 5 ఏళ్ళు గ్యాప్ తీసుకోవడం వలనో ఏమో కానీ.. యాక్టింగ్ మర్చిపోయాడేమో అనే ఫీలింగ్ కలుగుతుంది. అయితే అతనికి ఉన్న బిగ్ ప్లస్ పాయింట్ అతని వాయిస్. అందుకే డైలాగులతో మేనేజ్ చేసేశాడేమో అనిపిస్తుంది. ఫిజిక్ పై మాత్రం అతను శ్రద్ద పెట్టడం లేదు అని ప్రతి ఫ్రేమ్ చెబుతుంది. హీరోయిన్ సిరి లీలా లుక్స్ అయితే బాగున్నాయి. అంతకు మించి ఆమె గురించి చెప్పుకోడానికి ఏమీ లేదు. అజయ్ ఘోష్ తన మార్క్ నటనతో ఆకట్టుకున్నాడు. జిస్సు సేన్ గుప్తా కి మంచి పాత్ర దొరికింది. సచిన్ కేడెకార్ బాగానే చేశాడు. ఉదయ భాను పాత్ర అంతంత మాత్రమే ఉంది. దినేష్ తేజ్ పాత్ర గురించి ఎక్కువ చెప్పకూడదు కానీ స్పెషల్ గానే ఉంది అనాలి. మిగతా నటీనటులు ఓకే.

ప్లస్ పాయింట్స్ :

ఫస్ట్ హాఫ్

సంభాషణలు

మైనస్ పాయింట్స్ :

సెకండాఫ్
క్లైమాక్స్

మొత్తంగా…

ఇంతకు ముందు చెప్పుకున్నట్టు ‘ప్రతినిధి’ ని మ్యాచ్ చేసేలా అయితే ‘ప్రతినిధి 2 ‘ లేదు. విమర్శలకి.. వివాదాలకు కూడా స్కోప్ ఇవ్వకుండా సేఫ్ గా తీసిన సినిమా ఇది. ఒకసారి ట్రై చేయొచ్చు.

Rating : 2.25/5

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు