Ram Charan : ఫైనల్ గా రామ్ చరణ్ కూడా తన తల్లితో కలిసి బాధ్యత పూర్తి చేస్తున్నాడు..!

Ram Charan : టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇప్పుడు జనసేనాని గా ఎన్నికల ప్రచారం లో ఉన్న సంగతి తెలిసిందే. ముందుగా ఒక్కడై కూటమిలో ఒకడిగా ప్రచారం మొదలెట్టిన పవన్ కి టాలీవుడ్ ఫిలిం ఇండస్ట్రీ నుండి ఒక్కొక్కరిగా భారీ మద్దతు ఇవ్వడం స్టార్ట్ చేసారు. జబర్దస్త్ ఆర్టిస్ట్ ల దగ్గరి నుండి సీనియర్ ఆర్టిస్ట్ ల దాకా,చిన్న హీరోల దగ్గరి నుండి, స్టార్ హీరోలు, పాన్ ఇండియా హీరోల వరకు కూడా ఇప్పుడు పవన్ కళ్యాణ్ కి ఫుల్ సపోర్ట్ వచ్చింది. అయితే పవన్ కళ్యాణ్ కి సపోర్ట్ గా, మెగా ఫ్యామిలీ కూడా ముందు నుండి జనసేన తరపున ప్రచారం చేస్తున్న సంగతి తెలిసిందే. చిరంజీవి ప్రత్యక్షంగా కాకపోయినా, పరోక్షంగా జనసేన కి సపోర్ట్ చేస్తున్నారు. ఇక మెగా ఫ్యామిలీ లో వరుణ్ తేజ్, సాయి ధరమ్ తేజ్ , వైష్ణవ్ తేజ్ నేరుగా కొన్ని రోజుల ముందునుండే ఆంధ్రప్రదేశ్ లో ఊరూరా తిరిగి జనసేన తరపున ప్రచారం చేస్తున్నారు. ఇక ఇప్పుడు ఫైనల్ టచ్ గా ఎన్నికలకి ఒక్కరోజు ముందు గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ బాబాయ్ కి సపోర్ట్ గా పిఠాపురం కి రానున్నాడు.

తల్లితో కలిసి పిఠాపురం కి రామ్ చరణ్..!

ఇక రామ్ చరణ్ ప్రస్తుతం గేమ్ ఛేంజర్ సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఆ సినిమాలో రాజకీయ నాయకుడుతో పాటు ఐఏఎస్ పాత్రలో చరణ్ కనిపించనున్నాడు. ఇదిలా ఉండగా నిన్న చిరంజీవి పద్మవిభూషణ్ వేడుకకి వెళ్లిన చరణ్ ఢిల్లీ నుంచి హైదరాబాద్ వచ్చేసారు. అయితే తాజాగా రామ్ చరణ్, తన తల్లి సురేఖతో కలిసి ఉదయం రాజమండ్రి వెళ్లనున్నారు. అక్కడి నుంచి పిఠాపురంలో ఉన్న ప్రముఖ పుణ్యక్షేత్రమైన కుక్కుటేశ్వర స్వామి ఆలయాన్ని సందర్శించనున్నారు. ప్రత్యేక పూజలు చేసి స్వామివారిని దర్శించుకోనున్నారు. మొక్కులు కూడా చెల్లించుకోనున్నారు. ఇప్పుడు సురేఖ, రామ్ చరణ్ పిఠాపురం పర్యటన గురించి అంతా మాట్లాడుకుంటున్నారు. ఎందుకంటే.. పిఠాపురం నుంచి ఎమ్మెల్యేగా మెగా ఫ్యామిలీ మెంబర్ పవన్ కళ్యాణ్ పోటీ చేసున్నారు. టీడీపీ- జనసేన- బీజేపీ కూటమి తరపున పవన్ బరిలో దిగారు. ప్రత్యర్థులపై భారీ మెజార్టీతో గెలవాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. అందుకు గాను పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నారు. పిఠాపురంలో ఓ ఇంటిని అద్దెకు కూడా తీసుకున్నారు. తాను గెలిచిన తర్వాత అక్కడే ఉండి ప్రజా సమస్యలను తీర్చుతానని హామీ ఇస్తున్నారు.

చరణ్ పిలుపుతో ఊపేయొచ్చు?

ఇక పవన్ కళ్యాణ్ కు మద్దతుగా మెగా ఫ్యామిలీ నుంచి వరుణ్ తేజ్, వైష్ణవ్ తేజ్, సాయి దుర్గ తేజ్ ప్రచారం చేశారు. మెగాస్టార్ చిరంజీవి.. సోషల్ మీడియాలో స్పెషల్ వీడియో పోస్ట్ చేశారు. రామ్ చరణ్ (Ram Charan) కూడా చిరు వీడియోను షేర్ చేసి మీ భవిష్యత్తు కోసం పాటుపడే నాయకుడు పవన్ కళ్యాణ్ గారిని గెలిపించాలని పిలుపునిచ్చారు. ఇప్పుడు మరికొద్ది గంటల్లో ప్రచార పర్వం ముగియనున్న వేళ చరణ్, సురేఖ పిఠాపురంలోని ఆలయానికి వెళ్లడం ప్రాధాన్యత సంతరించుకుంది. మరి ఆలయ దర్శనం అయ్యాక సురేఖ, రామ్ చరణ్ ఏమైనా పవన్ కు మద్దతుగా మాట్లాడుతారని అందరూ ఎదురు చుస్తున్నారు. ఇక మరో రెండు రోజుల్లో ఎన్నికల హడావిడి అంతా అయిపోతుంది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు