Amitabh Bachchan : కల్కి సినిమాపై ఆసక్తికర విషయాలను పంచుకున్న బిగ్ బి

Amitabh Bachchan: ప్రస్తుతం తెలుగు సినిమా సత్తా ఏంటో ప్రపంచ వ్యాప్తంగా తెలియనిది కాదు. తెలుగు ఫిలిం ఇండస్ట్రీ నుంచి ఒక సినిమా వస్తుంది అంటేనే చాలామంది ఎంతో క్యూరియాసిటీతో ఎదురుచూస్తున్నారు అని చెప్పొచ్చు. దీనికి కారణం ఎస్ ఎస్ రాజమౌళి. ఇన్ని రోజులు వరకు తెలుగు సినిమాకి ఎంత మార్కెట్ ఉందో కూడా తెలియని తరుణంలో చాలా రిస్క్ చేసి ఒక ప్రాజెక్టు కోసం దాదాపు కొన్ని కోట్లు ఖర్చు పెట్టారు. అయితే ఆ టైంలో రికవరీ అవుతుందో లేదో కూడా తెలియని పరిస్థితి. కానీ ఆ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద అద్భుతమైన ఘన విజయాన్ని సాధించి తెలుగు సినిమా సత్తా ఏంటో చూపించింది అదే బాహుబలి. బాహుబలి సాధించిన విజయం గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. అక్కడితోనే తెలుగు సినిమా అంటే ఏంటో చాలామందికి తెలిసి వచ్చింది.

ప్రభాస్ ఈ సినిమా కోసం దాదాపు ఐదేళ్లపాటు సమయాన్ని కేటాయించారు. అయితే ఆ సమయాన్ని కేటాయించడం వల్ల నేడు ప్రభాస్ కి పాన్ ఇండియా లెవెల్లో గుర్తింపు దక్కిందని చెప్పొచ్చు. బాహుబలి సినిమా తర్వాత ప్రభాస్ మార్కెట్ కంప్లీట్ గా మారిపోయింది. కరెక్ట్ కంటెంట్ పడితే అద్భుతమైన కలెక్షన్స్ రాబట్టొచ్చు అని చెప్పొచ్చు. అయితే బాహుబలి సినిమా తర్వాత ప్రభాస్ చేసిన సినిమాలన్నీ కూడా బాక్స్ బోల్తా ఆఫీస్ వద్ద కొట్టాయి. రీసెంట్ గా వచ్చిన సలార్ సినిమా పరవాలేదు అనిపించుకుంది. అయితే ఇప్పటివరకు బాహుబలి తర్వాత ఆ రేంజ్ సినిమా అనేది ప్రభాస్ కెరియర్ లో పడలేదు.

ఇక ప్రస్తుతం ప్రభాస్ చేస్తున్న సినిమా కల్కి. నాగ్ అశ్విన్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాపై అందరికీ మంచి అంచనాలు ఉన్నాయి. దీని కారణం నాగ్ అశ్విన్ చేసిన రెండు సినిమాలు ఏ స్థాయిలో ఆడాయో మన ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అతను దర్శకత్వం వహించిన మహానటి సినిమా అద్భుతమైన కలెక్షన్స్ రాబట్టడంతో పాటు విమర్శకులు ప్రశంసలను కూడా అందుకుంది. అందుకే ఇప్పుడు ఆయన చేస్తున్న కల్కి మూవీ పై అందరికీ మంచి అంచనాలు ఉన్నాయి. ఈ సినిమా కోసం కేవలం తెలుగు ఆడియన్స్ మాత్రమే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా ఎదురుచూస్తున్నారు.

- Advertisement -

ఈ సినిమాలో ప్రభాస్ సరసన దీపిక పదుకొనే నటిస్తున్నారు. అమితాబ్ బచ్చన్ కమల్ హాసన్ వంటి పెద్ద పెద్ద నటులు ఈ సినిమాలో కనిపించనున్నారు. కమల్ హాసన్ ఈ సినిమాలో విలన్ రోల్ పోషిస్తున్నట్లు సమాచారం వినిపిస్తోంది. ఈ సినిమాకి సంతోష్ నారాయణ సంగీతం అందిస్తున్నారు. సంతోష్ నారాయణ సంగీతం గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. ఒక సీన్ ని ఎలివేట్ చేయడంలోను అద్భుతమైన బ్యాగ్రౌండ్ స్కోర్ ఇవ్వడంలో సంతోష్ నారాయణ తోపు పని చెప్పచ్చు.

ఇకపోతే కల్కి సినిమాలో కీలక పాత్రలో కనిపించనున్నారు బిగ్బి అమితాబచ్చన్. రీసెంట్ గా అమితాబచ్చన్ కి సంబంధించిన కల్కి సినిమా షూటింగ్ పార్ట్ పూర్తయింది అని తెలుస్తుంది. అయితే ముంబైలోని ఒక మీడియాకి ఇచ్చిన ఇంటర్వ్యూలో అమితాబచ్చన్ ఈ సినిమా గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అయితే కల్కి సినిమా లో తన పాత్ర చాలా బాగా వచ్చిందని తన కంప్లీట్ గా సంతృప్తిగా ఉన్నట్టు చెప్పుకొచ్చారు. నాగ్ అశ్విన్ దర్శకత్వానికి బిబ్బి అమితాబచ్చన్ ఇంప్రెస్ అయినట్లు చెప్పుకొచ్చారు. ఈ సినిమా కోసం ఎంతగానో ఎదురు చూస్తున్నాను అంటూ చెప్పుకొచ్చారు అమితాబచ్చన్. ఇక ఈ సినిమా జూన్ 27న రిలీజ్ కి సిద్ధంగా ఉంది. ప్రపంచవ్యాప్తంగా ఆడియన్స్ అంతా ఈ సినిమా కోసం ఎదురుచూస్తున్నారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు