Avesham : ఓటిటి తో క్లారిటీ! రీమేక్ ఎవరితో?

Avesham : రీసెంట్ గా మలయాళ ఇండస్ట్రీ నుండి వరుస బెట్టి బ్లాక్ బస్టర్ సినిమాలు వచ్చిన సంగతి తెలిసిందే. ఒక్కో సినిమా వంద కోట్లని మించి వసూలు చేసి ఇండస్ట్రీ రేంజ్ ని పెంచాయి. ఇక అలా మలయాళ సూపర్ హిట్ సినిమాల లిస్ట్ లో చేరింది ఫాహద్ ఫాజిల్ నటించిన “ఆవేశం”. జితు మాధవన్ డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ సినిమా లాస్ట్ మంత్ మలయాళంలో రిలీజై సూపర్ సక్సెస్ అందుకుంది. చాలా తక్కువ బడ్జెట్ తోనే తెరకెక్కిన ఈ సినిమా ఏకంగా 150 కోట్ల మార్క్ దాటి ఇంకా థియేటర్లో ఆడుతూనే ఉంది. ఫాహద్ ఫాజిల్ తన వర్సటైల్ యాక్టింగ్ తో అలరించాడు. ఒక గ్యాంగ్ స్టర్ కథతో ఇలాంటి ఎంటర్టైన్మెంట్ అందించవచ్చని ప్రూవ్ చేశారు. ఐతే ఆవేశం సినిమా థియేట్రికల్ చూసిన వారు.. థియేట్రికల్ వెర్షన్ మిస్ అయిన వారు ఇలా అందరు కూడా సినిమా ఓటీటీ రిలీజ్ కోసం ఎంతగానో ఎదురు చూశారు. ఇక రీసెంట్ గా ఆవేశం సినిమా ప్రైమ్ వీడియోలో రిలీజైంది. అక్కడ కూడా పాజిటివ్ రెస్పాన్స్ తో దూసుకుపోతుంది. అయితే ఈ సినిమాకు వచ్చిన పాజిటివ్ టాక్ తో మలయాళంతో పాటుగా తెలుగు, తమిళ భాషల్లో కూడా సూపర్ హిట్ అవుతుందని అనుకున్నారు. కానీ ఓటిటి లో తెలుగు ఆడియన్స్ కి చుక్కెదురైంది.

ఓటిటి తో క్లారిటీ వచ్చేసింది!

అయితే నిజం చెప్పాలంటే ఆవేశం తెలుగు వెర్షన్ కోసం ప్రేక్షకులు ఎంతో ఎదురు చూసారు. కానీ ప్రైమ్ వీడియోలో కేవలం మలయాళ వెర్షన్ ని మాత్రమే అందుబాటులో ఉంచారు మేకర్స్. దీని వెనుక రీజన్ ఏంటన్నది తెలియాల్సి ఉంది. మలయాళంలో హిట్ అయిన ప్రతి సినిమా తెలుగు వెర్షన్ లో రిలీజ్ చేస్తున్నారు. ఈ మధ్యనే అక్కడ హిట్ అయిన ప్రేమలు, మంజుమ్మేల్ బాయ్స్ సినిమాలు అలానే డబ్ చేసి రిలీజ్ చేయగా ఇక్కడ కూడా మంచి సక్సెస్ అందుకున్నాయి. అదే దారిలో ఆవేశం సినిమా కూడా డబ్ చేసి తెలుగులో రిలీజ్ చేసే ప్లాన్ ఏదైనా ఉందా అన్న అనుమానం వ్యక్తం అవుతుంది. కానీ ట్రేడ్ విశ్లేషకుల అంచనా ప్రకారం ఈ సినిమాని తెలుగులో రీమేక్ చేయొచ్చనే వార్తలు వస్తున్నాయి.

రీమేక్ ఎవరితో?

అయితే ఆవేశం(Avesham) సినిమాని తెలుగు వెర్షన్ ఓటిటి లో రిలీజ్ చేయకపోవడానికి రీసన్స్ ఏవైనా, ఈ సినిమా తెలుగులో రీమేక్ చేయొచ్చనే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని సమాచారం. ఆ మధ్య తెలుగులో బాలకృష్ణ, లేదా వెంకటేష్ రీమేక్ చేస్తారని వార్తలు వచ్చాయి. అందుకే తెలుగు వెర్షన్ ఆవేశం ని రిలీజ్ చేయలేదని తెలుస్తుంది. అయితే ఆవేశం ఓటీటీ రిలీజ్ అనగానే సినిమాను తెలుగులో చూడొచ్చని అనుకున్న తెలుగు ఆడియన్స్ కు మాత్రం షాక్ తగిలినట్టు అయ్యింది. ఫాహద్ ఫాజిల్ కు తెలుగులో కూడా మంచి ఫ్యాన్స్ ఉన్నారు. మరి ఆవేశం రీమేక్ చేస్తారా లేదా డబ్బింగ్ వెర్షన్ రిలీజ్ చేస్తారా అన్నది చూడాలి. ప్రస్తుతం ఫాహద్ ఫాజిల్ అల్లు అర్జున్ పుష్ప 2 లో కూడా నటిస్తున్నాడని తెలిసిందే. అయితే ఆవేశం రీమేక్ చేస్తే మాత్రం వెంకటేష్ కి సూట్ అయ్యేలా ఉంది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు