Krishnamma Movie Review : ‘కృష్ణమ్మ’ మూవీ రివ్యూ

సత్యదేవ్ విలక్షణ నటుడిగా మంచి పేరు తెచ్చుకున్నాడు, ఓటీటీ హీరోగా బెటర్ అనిపించుకున్నాడు. కానీ కమర్షియల్ హీరో కాలేకపోయాడు. మరి ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చిన ‘కృష్ణమ్మ’ అయినా అతని ఫేట్ మార్చిందేమో తెలుసుకుందాం రండి:

కథ :

భద్ర (సత్యదేవ్), శివ (కృష్ణ తేజ రెడ్డి), కోటి (మీసాల లక్ష్మణ్)… ముగ్గురూ ప్రాణ స్నేహితులు. అలాగే ఆనాధలు కూడా..! బెజవాడలోని వించిపేటలో వీరు నివసిస్తూ ఉంటారు. శివ నిజాయితీ కలిగిన వ్యక్తి. భద్రకి కోపం ఎక్కువ. కోటి అయితే తన స్నేహితులు ఏం చెబితే అది చేసే రకం. భద్ర, కోటి .. శివకి ఇష్టం లేకుండా గంజాయి స్మగ్లింగ్ చేస్తుంటారు. శివ మాత్రం ప్రింటింగ్ ప్రెస్ రన్ చేస్తూ నిజాయితీగా సంపాదించుకుంటాడు. అతని జీవితంలోకి మీనా (అతిరా రాజ్) అనే అమ్మాయి వస్తుంది. తెలీకుండానే ఇద్దరూ ప్రేమలో పడతారు. భద్రకు .. మీనా రాఖీ కట్టి చెల్లెలు అవుతుంది. ఆమె వల్ల గంజాయి స్మగ్లింగ్ మానేసి ఆటో నడిపి సంపాదిస్తుంటాడు భద్ర. అయితే మీనా తల్లి అనారోగ్యంతో బాధపడుతూ ఉంటుంది. ఆమె ఆపరేషన్‌కు 2 లక్షల వరకు అవసరం పడుతుంది. దీని కోసం చివరిసరిగా పెద్ద ఎత్తున గంజాయి స్మగ్లింగ్ చేసి ఆ డబ్బు సంపాదించాలి అనుకుంటాడు భద్ర. ఈసారి కోటితో పాటు శివ కూడా జాయిన్ అవుతాడు. అనుకోకుండా వీరు పోలీసులకి దొరికేస్తారు? ఆ తర్వాత ఏమైంది? మీనా తల్లికి ఆపరేషన్ జరిగిందా లేదా? ముగ్గురు స్నేహితులు ఈ సమస్యని ఎలా ఎదుర్కొన్నారు? చివరికి ఏమయ్యారు? అనేది మిగిలిన కథ.

విశ్లేషణ :

విజయవాడలో జరిగిన ఓ యదార్ధ సంఘటనని ఆధారం చేసుకుని తీసిన సినిమా ఇది. కానీ కథ పరంగా కొత్తగా ఏమీ అనిపించదు. ఒకరు చేసిన నేరాన్ని అమాయకులపై తోసేసి వారిని ఇబ్బందులకు గురి చేయడం అనే పాయింట్ ఎన్నో ఏళ్లుగా చూస్తూనే ఉన్నాం. కానీ ‘రా అండ్ రస్టిక్’ పేరుతో ఇవే కథల్ని మార్చి మార్చి తీస్తున్నారు. ‘రంగస్థలం’ అలా వచ్చిన రివేంజ్ డ్రామానే..! కానీ అది సక్సెస్ అయ్యింది కదా అని.. ఇలాంటివి ఏడాదికి పదేసి సినిమాలు వస్తున్నాయి. దాని తర్వాత వచ్చిన ‘పలాసా’ ‘దసరా’ వంటి సినిమాలు కూడా ఇవే లైన్ తో తీసినవే..! కానీ స్క్రీన్ ప్లే పరంగా అవి డిఫరెంట్ గా అనిపిస్తాయి. కానీ మిగిలిన అన్ని సినిమాల్లో ఒక్కటే కామన్ పాయింట్ ఉంటుంది. అయితే హీరోకి సంబంధించిన వారి కుటుంబాన్ని అన్యాయంగా చంపేయడం, లేదు అంటే రేప్ చేసి చంపేసి ఆ నేరాన్ని అమాయకుల పై వేసేయడం. చాలా మంది డైరెక్టర్లు ఈ ఒక్క లైన్ తోనే సినిమాలు చేస్తున్నారు.

- Advertisement -

అందుకే పోలీస్ డ్రామాలు, హార్రర్ సినిమాలు ఎలా అయితే రొటీన్ అయిపోయాయో.. ఈ రా అండ్ రస్టిక్ సినిమాలు కూడా అలా రొటీన్ అయిపోయాయి. పోనీ దర్శకుడు వి.వి.గోపాల కృష్ణ.. స్క్రీన్ ప్లే అయినా కొత్తగా రాసుకున్నాడా? అంటే అస్సలు లేదు. సినిమా స్టార్ట్ అయిన 20 నిమిషాలకే క్లైమాక్స్ కూడా గెస్ చేసేయొచ్చు. అలా ఉంటుంది ‘కృష్ణమ్మ’. ఫస్ట్ హాఫ్ కొంత ఓకే అనిపించినా.. సెకండ్ మాత్రం ప్రేక్షకుల సహనానికి పరీక్ష పెడుతూ చాలా ప్రెడిక్టబుల్ గా ఉంటుంది. క్లైమాక్స్ ఫైట్ బాగా తీసే స్కోప్ ఉన్నా.. దర్శకుడు ఆ ఛాన్స్ కూడా తీసుకోలేదు. సినిమాటోగ్రఫీ, మ్యూజిక్, ప్రొడక్షన్ వాల్యూస్.. ఇలా ఎందులోనూ కొత్తదనం ఉండదు. పాత సినిమా చూస్తున్న ఫీలింగ్ నే కలిగిస్తాయి. స్టార్ డైరెక్టర్ కొరటాల శివ ఈ సినిమాకి ఎందుకు సమర్పకుడిగా వ్యవహరించాడో ఆయనకే తెలియాలి.

సత్యదేవ్ టాలెంటెడ్ యాక్టర్ అని, చాలా సహజంగా నటిస్తాడు అని అంతా అంటుంటారు. కానీ అతనిలో అంత సహజ నటుడు ఎక్కడున్నాడు అదంతా సోషల్ మీడియా మేనియానే అనుకునేవారు కూడా లేకపోలేదు. సింగిల్ ఎక్స్ప్రెషన్ తోనే అతను నటించేస్తూ ఉంటాడు. కాకపోతే అతనికి ఉన్న ప్లస్ పాయింట్ వాయిస్. కానీ ఈ సినిమాలో అతని డైలాగ్ డెలివరీ కూడా వీక్ గా అనిపిస్తుంది. హీరోయిన్లలో అతిరా రాజ్ బాగా చేసింది. కానీ సత్యదేవ్ కి జోడీగా చేసిన అర్చనా అయ్యర్ ఎందుకు ఉందో ప్రేక్షకులకి అర్ధం కాదు. సెకండాఫ్ లో ఆమె పాత్రని పూర్తిగా సైడ్ చేసేశారు. ఫ్రెండ్స్ గా చేసిన మీసాల లక్ష్మణ్, కృష్ణ తేజా రెడ్డి పర్వాలేదు అనిపించేలా చేశారు. మిగిలిన నటీనటులు పెద్దగా ఆకట్టుకుంది అంటూ ఏమీ ఉండదు.

ప్లస్ పాయింట్స్ :

కొరటాల శివ సమర్పణ వల్ల వచ్చిన హైప్ తప్ప ఏమీ లేవు

మైనస్ పాయింట్స్ :

మిగిలినవన్నీ

చివరిగా ‘కృష్ణమ్మ’ ఏ దశలోనూ ఆకట్టుకోని రా అండ్ రస్టిక్ మూవీ. ఎమోషనల్ గా ఈ సినిమాకి అందరూ కనెక్ట్ అవుతారు అని ప్రమోషన్స్ లో సత్యదేవ్ చెప్పాడు కానీ..! అతను చెప్పినట్టు ఎంత మాత్రం సినిమా ఉండదు. ఓపిక ఉంటే తప్ప సింపుల్ గా స్కిప్ కొట్టవలసిన సినిమా ఇది.

Rating : 1/5

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు