31st May Release Movies: వేసవి వేస్ట్ చేసి, ఒక డేట్ కోసం కొట్టుకుంటున్నారు

31st May Release Movies: తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో కొన్ని సినిమాలు రిలీజ్ అవుతున్నప్పుడు వాటి మధ్య పోటీ ఉండటం అనేది సహజంగానే జరుగుతూ ఉంటుంది. అయితే కొన్ని సినిమాలు కావాలని ఆ రిలీజ్ డేట్ అనౌన్స్ చేస్తున్నాయా లేదా ఇంకా ఏమైనా ప్లాన్ ఉందా ఇప్పటికే అర్థం కాదు. ఎప్పుడు సంక్రాంతి సీజన్ వచ్చినా కూడా కొన్ని సినిమాలు అనౌన్స్ చేయడం థియేటర్లో సరిపోక మరికొన్ని సినిమాలు వాయిదా పడటం జరుగుతూ ఉంటుంది. అయితే ఈ వాయిదా పడటం అనేది పెద్ద సినిమాలకు పెద్దగా జరగదు. చిన్న సినిమాలు మాత్రమే జరుగుతుంది. అయితే కొన్ని పెద్ద సినిమాలు వాయిదా పడిన కూడా వాటికంటూ సోలో రిలీజ్ వంటి బెనిఫిట్స్ అడుగుతూ వెనక్కి తగ్గుతాయి.

ఇక ప్రస్తుతం సమ్మర్ సీజన్ నడుస్తుంది. సమ్మర్లో కూడా సినిమాలకు ఆడియన్స్ వస్తారని చెప్పొచ్చు చాలామంది. సమ్మర్ వీకెండ్స్ లో పిల్లల్ని సినిమాకు తీసుకెళ్లడానికి ఇష్టపడుతూ ఉంటారు. అయితే ఈ సమ్మర్లో చెప్పుకోదగ్గ సినిమా ఒకటి కూడా రిలీజ్ కాలేదు. కానీ ఈ మంత్ ఎండింగ్ లో ఒకేరోజు ఐదు సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద రిలీజ్ కావడానికి సిద్ధమవుతున్నాయి. అయితే అందరికీ మొదలైన సందేహం ఏంటి అంటే రెండు నెలలు సమ్మర్ టైమును వేస్ట్ చేసి ఒకే డౌట్ కోసం ఇన్ని సినిమాలు ఎందుకు కొట్టుకుంటున్నాయని అందరూ అనుకుంటున్నారు.

ఆ సినిమాలు ఏంటంటే….
రౌడీ ఫెలో సినిమాతో దర్శకుడుగా ఎంట్రీ ఇచ్చాడు కృష్ణ చైతన్య అయితే మొదటి సినిమాతోనే మంచి హిట్టు కొట్టి తెలుగు ఫిలిం ఇండస్ట్రీకి మంచి దర్శకుడు దొరికాడు అనిపించుకున్నాడు. అయితే ఆ తర్వాత ఇంకో సినిమా దర్శకత్వం చేయడానికి కొంచెం టైం తీసుకున్నాడు. అయితే ఆ తర్వాత నితిన్ తో చేసిన ఛల్ మోహన్ రంగ. ఈ సినిమా ఊహించిన విజయాన్ని సాధించలేకపోయింది. మళ్లీ చాలా ఏళ్ళు తర్వాత విశ్వక్సేన్ హీరోగా గ్యాంగ్ ఆఫ్ గోదావరి అనే సినిమాను తెరకెక్కించాడు. ఈ సినిమా 2023లోని రిలీజ్ కావలసి ఉంది కానీ కొన్ని అనివార్య కారణాల వలన పోస్ట్ పోన్ అవుతూ వచ్చింది. ఈ సినిమాను మొదట మే 17న రిలీజ్ చేస్తారు అని అనౌన్స్ చేశారు. కానీ రీసెంట్ గా ఈ సినిమా మే 31న రిలీజ్ చేయబోతున్నట్లు చేశారు.

- Advertisement -

అలానే సుదీర్ బాబు హీరోగా చేసిన పరోం హర సినిమా కూడా మే 31న రిలీజ్ కానుంది. దీంతోపాటు కార్తికేయ గుమ్మకొండ నటిస్తున్న మరో సినిమా మే 31న రిలీజ్ కానుంది. అలానే విజయ్ దేవరకొండ తమ్ముడు ఆనంద్ దేవరకొండ చేస్తున్న గం గం గణేశ సినిమా కూడా మేము 31న రిలీజ్ కానుంది. అయితే వీటితోపాటు ఇంకో రెండు మూడు సినిమాలు కూడా రిలీజ్ సిద్ధంగా ఉన్నాయి. అయితే ఈ అన్ని సినిమాలు కూడా రిలీజ్ అవుతాయని నమ్మకాలు అయితే లేవు. ఖచ్చితంగా వీటిలో రెండు మూడు సినిమాలు వెనక్కి తగ్గుతాయని చెప్పొచ్చు.

ఇకపోతే ఆడియన్స్ అంతా క్యూరియాసిటీతో వెయిట్ చేస్తున్న సినిమా గ్యాంగ్ అఫ్ గోదావరి. ఎందుకంటే దీనికి డైరెక్టర్ కృష్ణ చైతన్య కావడం ఒకటి, ఇంకోటి ఏంటంటే తన డ్రీమ్ రోల్ ను ఈ సినిమాల్లో పోషించానంటే విశ్వక్సేన్ చెప్పుకొచ్చాడు అన్ని సినిమాల్లో కంటే కూడా ఎక్కువ బజ్ ఈ సినిమాకి ఉందని చెప్పొచ్చు. ఈ సినిమాకి యువని శంకర్ రాజ సంగీతం అందించాడు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు