Ram Pothineni: ఎనర్జిటిక్ స్టార్ ఓటిటి ఎంట్రీ

ఇన్నేళ్లు సిల్వర్ స్క్రీన్ పై తన ఎనర్జీతో ప్రేక్షకులను కృషి చేసిన టాలీవుడ్ హీరో రామ్ పోతినేని ఇప్పుడు డిజిటల్ ఎంట్రీ కి రెడీ అవుతున్నాడు. చాలాకాలంగా హిట్ కోసం ఎదురు చూస్తున్న రామ్ ప్రస్తుతం తన రూట్ మార్చే పనిలో పడ్డట్టుగా తెలుస్తోంది. నిజానికి ఆయన హిట్ అనే మాట విని చాలా కాలమే అవుతుంది.

2019లో పూరి జగన్నాథ్ దర్శకత్వంలో ఇస్మార్ట్ శంకర్ అనే మూవీ చేసి బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాడు రామ్. ఆ తర్వాత రెడ్, ది వారియర్, స్కంద అనే సినిమాల్లో నటించినా ఫలితం లేకుండా పోయింది. భారీ అంచనాలతో వచ్చిన ఈ మూడు సినిమాలు కూడా బాక్స్ ఆఫీస్ వద్ద డిజాస్టర్ గా నిలిచాయి. కథ, కథనం పరంగా ప్రేక్షకులను ఏమాత్రం ఆకట్టుకోకపోవడంతో ఈ మూడు సినిమాలు కూడా ప్లాఫ్ అయ్యాయి. ముఖ్యంగా డైరెక్టర్ బోయపాటి శ్రీను తో చేసిన స్కంద సినిమాపై రామ్ చాలా ఆశలు పెట్టుకున్నాడు. హై వోల్టేజ్ యాక్షన్ సీక్వెన్స్ లతో తెరకెక్కిన ఈ సినిమా కూడా రామ్ ను నిరాశ పరచడంతో ప్రస్తుతం తన ఆశలన్నీ పూరి జగన్నాథ్ పైనే పెట్టుకున్నాడు.

ప్రస్తుతం రామ్ పూరి జగన్నాథ్ దర్శకత్వంలో తనకు గతంలో బ్లాక్ బస్టర్ హిట్ ఇచ్చిన ఇస్మార్ట్ శంకర్ మూవీకి సీక్వెల్ గా డబల్ ఇస్మార్ట్ అనే సినిమాను చేస్తున్నాడు. ఇప్పుడు ఈ మూవీ షూటింగ్ లోనే రామ్ బిజీగా ఉన్నాడు. అయితే నిన్న మొన్నటి వరకు ఈ మూవీ బడ్జెట్ సమస్యల కారణంగా ఆగిపోయింది అనే టాక్ నడిచింది. కానీ ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ చాలా వేగంగా జరుగుతున్నట్టుగా తెలుస్తోంది. ఇందులో బాలీవుడ్ స్టార్ సంజయ్ దత్ కూడా కీలకపాత్రను పోషిస్తూ ఉండడంతో అంచనాలు పెరిగాయి. ఈ నేపథ్యంలోనే రామ్ పోతినేని నెక్స్ట్ వెబ్ సిరీస్ చేయబోతున్నాడు అనే వార్త వైరల్ అవుతుంది.

- Advertisement -

బాక్స్ ఆఫీస్ వద్ద రామ్ సినిమాలు పెద్దగా ఆడకపోయినా ఆయన నాన్ థియేట్రికల్ మార్కెట్ మాత్రం స్ట్రాంగ్ గానే ఉంది. దీంతో ఆయన డిజిటల్ జైంట్ అయిన నెట్ ఫ్లిక్స్ తో ఓ వెబ్ సిరీస్ కోసం చర్చలు జరుపుతున్నట్టుగా టాక్ నడుస్తోంది. అంతా అనుకున్నట్టుగా జరిగితే రామ్ ఫస్ట్ వెబ్ సిరీస్ త్వరలోనే పట్టాలక్కే అవకాశం ఉంది. మరోవైపు రామ్ నెక్స్ట్ సినిమాకు సంబంధించిన చర్చలు ఇప్పటికే మొదలయ్యాయని సమాచారం. డైరెక్టర్ హరీష్ శంకర్ దర్శకత్వంలో రామ్ నెక్స్ట్ మూవీ ఉండబోతుందని తెలుస్తోంది. ఇప్పటికే స్క్రిప్ట్ కూడా విన్న రామ్ హరీష్ శంకర్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని టాక్ నడుస్తోంది. త్వరలోనే రాంచరణ్ నెక్స్ట్ ప్రాజెక్ట్ లపై అఫీషియల్ గా అనౌన్స్మెంట్ వచ్చే అవకాశం ఉంది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు