Jyothika: 27 యేళ్ళలో ఒక్క అవకాశం కూడా రాలేదా..కారణం..?

Jyothika.. ప్రముఖ కోలీవుడ్ హీరోయిన్ గా ఒకప్పుడు తెలుగు, తమిళ్ చిత్రాలతో భారీ పాపులారిటీ దక్కించుకున్న జ్యోతిక.. ఆ తర్వాత తాను ఇష్టపడిన కోలీవుడ్ హీరో సూర్యను వివాహం చేసుకుంది.. వివాహం అనంతరం సినిమాలకు దూరంగా ఉన్న ఈమె మళ్లీ ఈ మధ్యనే సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే.. ఇక అందులో భాగంగానే ఇప్పుడు ఎక్కువగా బాలీవుడ్ వైపు అడుగులు వేస్తోంది.. శ్రీకాంత్ సినిమాతో 2024 మే 5 న ప్రేక్షకుల ముందుకు వచ్చి ఆకట్టుకుంది జ్యోతిక. తెలుగు, తమిళ్ భాషల్లో వరుస చిత్రాలలో నటించిన ఈమె బాలీవుడ్ లో మాత్రం సుమారుగా 27 ఏళ్ల తర్వాత నటిస్తూ ఉండడం గమనార్హం. 1997లో జ్యోతిక నటించిన హిందీ చిత్రం విడుదలైంది. మళ్లీ తర్వాత ఇప్పుడు అజయ్ దేవగన్ తో కలిసి సైతాన్ అనే సినిమాతో ఈ ఏడాది బీ టౌన్ ప్రేక్షకులను పలకరించింది. ఇకపోతే దాదాపు 27 సంవత్సరాలలో ఒక్క అవకాశం కూడా తనకు హిందీ పరిశ్రమ నుంచి రాలేదు. అసలు ఇందుకు గల కారణం ఏమిటి అన్న విషయాలపై క్లారిటీ ఇచ్చింది జ్యోతిక..

Jyothika: In 27 years not a single opportunity came..why..?
Jyothika: In 27 years not a single opportunity came..why..?

27 ఏళ్లుగా అవకాశం రాకపోవడానికి కారణం అదే..

జ్యోతిక మాట్లాడుతూ..సాధారణంగా నేను మొదటి చిత్రం యొక్క ఫలితం పైన మన కెరియర్ ఆధారపడి ఉంటుందని బలంగా నమ్ముతాను.. అందుకే నేను నటించిన మొదటి సినిమా పెద్దగా హిందీ సినీ ప్రేక్షకులను మెప్పించలేదు.. ఈ కారణంగానే నాకు బాలీవుడ్ లో అవకాశాలు రాలేదనుకుంటున్నాను.. ఇక దక్షిణాదిలో నేను నటించిన ఎన్నో సినిమాలు సూపర్ హిట్ అయ్యాయి. అక్కడ స్టార్ హీరోయిన్ గా గుర్తింపు కూడా వచ్చింది.. కానీ బాలీవుడ్ నుంచి ఒక్క ఆఫర్ కూడా రాలేదు.. అయితే ప్రేక్షకులు నన్ను దక్షిణాది నటిగానే గుర్తుపెట్టుకున్నారు కాబట్టి నాకు కూడా బాలీవుడ్ సినిమాలలో నటించాలన్న ఆసక్తి లేదు అంటూ చెప్పుకొచ్చింది జ్యోతిక..

భర్తతో కలిసి సినిమా మొదలు..

ఇకపోతే ప్రముఖ పారిశ్రామికవేత్త , బొల్లాంట్ ఇండస్ట్రీస్ వ్యవస్థాపకుడు శ్రీకాంత్ బొల్ల జీవితం ఆధారంగా తెరకెక్కిన శ్రీకాంత్ చిత్రంలో జ్యోతిక టీచర్ పాత్రలో కనిపించింది.. ఇక తాజాగా ఈమె సూర్య హీరోగా వస్తున్న ఒక సినిమాలో నటిస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.. బెంగళూరు డేస్ ఫేమ్ అంజలి మేనన్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు.. ఇకపోతే ఇటీవలే జ్యోతిక దీని గురించి మాట్లాడుతూ.. సరైన స్క్రిప్ట్ కోసం చర్చలు జరుపుతున్నాము.. మంచి కథ ఉంటే కచ్చితంగా సూర్యతో కలిసి నటిస్తానని స్పష్టం చేసింది.. ఇక అందులో భాగంగానే ఇప్పుడు ఈ సినిమాలో నటించబోతున్నట్లు సమాచారం.

- Advertisement -

సినీ ఇండస్ట్రీలోకి జ్యోతిక కూతురు దియా..

ఇదిలా ఉండగా ఇటీవలే జ్యోతిక, సూర్య దంపతులు పుత్రికోత్సాహంతో సంతోషం వ్యక్తం చేస్తున్న విషయం తెలిసింది. ఎందుకంటే వీరి కూతురు దియా ఇంటర్ సెకండియర్ లో 600కు 581 మార్కులు సాధించి రికార్డు సృష్టించింది. ఇక కూతురు సాధించిన ఈ మార్కులు చూసి తల్లిదండ్రులు ఇద్దరు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.. అంతేకాదు ఈ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా పంచుకోవడంతో పలు సెలబ్రిటీలు, అభిమానులు కూడా ఈ జంటకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ఇక జ్యోతిక కూతురు దియా కూడా చాలా అందంగా ఉంది.. అమ్మాయి చదువు పూర్తి చేసుకొని హీరోయిన్గా ఎంట్రీ ఇస్తే ఖచ్చితంగా సక్సెస్ అవుతుందని సినీ విశ్లేషకులు కూడా చెబుతున్నారు.. మరి దియా తల్లిలాగే ఇండస్ట్రీలోకి వస్తుందా? లేక తనకు ఇష్టమైన రంగంలో దూసుకుపోతుందా ..? అన్నది చూడాలి.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు