Most Viewed Teaser in 24 Hours : 24 గంటల్లో రికార్డులు క్రియేట్ చేసిన టాప్ 10 టీజర్లు… టాప్ లో ఏ హీరో అంటే?

Most Viewed Teaser in 24 Hours : సినిమాలు అసలు హిట్ అవుతాయా లేదా అనే విషయం టీజర్ ద్వారానే తేలిపోతుంది. అలాంటి కీలకమైన టీజర్ పెద్ద హీరోల సినిమాల నుంచి రిలీజ్ అవుతుందంటే ఆ సందడే వేరుగా ఉంటుంది. తమ హీరో సినిమా టీజర్ రాబోతోంది అంటే వారం ముందు నుంచే ప్లాన్లు వేస్తూ ఉంటారు అభిమానులు. రాబోయే టీజర్ తో అప్పటి దాకా ఉన్న రికార్డులను బ్రేక్ చేయాలని ఉవ్విళ్లూరుతూ ఉంటారు. కానీ ఎంత ట్రై చేసినా కంటెంట్ బాగుంటేనే టీజర్ ఊహించని రేంజ్ లో వ్యూస్ ను దక్కించుకుంటుంది. లేదంటే ఎంతటి స్టార్ హీరో సినిమాకు సంబంధించిన టీజర్ అయినా ఆ రికార్డులను బ్రేక్ చేయడం కాదు కదా కనీసం దరిదాపుల్లోకి కూడా రాదు. కానీ కొన్ని సినిమాలకు మాత్రం కంటెంట్ బాగున్నా టైమ్ కలిసి రాదు అన్న విషయాన్ని తాజాగా హరిహర వీరమల్లు టీజర్ ప్రూవ్ చేసింది. తాజాగా రిలీజ్ అయిన హరిహర వీరమల్లు టీజర్ కు పూర్ రెస్పాన్స్ వచ్చింది.

నిజానికి ఈ మూవీ నుంచి అప్డేట్ వస్తుందని ఎవ్వరూ ఊహించలేదు. సడన్ గా టీజర్ ను రిలీజ్ చేయబోతున్నామంటూ అప్డేట్ ఇచ్చి సర్ప్రైజ్ చేశారు హరిహర వీరమల్లు మేకర్స్. అయితే టీజర్ లో క్వాలిటీ బాగున్నప్పటికీ, పవన్ కళ్యాణ్ లుక్స్ అండ్ స్క్రీన్ ప్రజెన్స్ కూడా అద్భుతంగా ఉన్నప్పటికీ ఆశించిన విధంగా ఈ మూవీకి వ్యూస్ రాలేదు. ఈ సినిమా వాయిదాలు పడుతూ రావడం, మూవీ ఆగిపోయిందని రూమర్లు, డైరెక్టర్ మారిపోవడం, మరోవైపు ఎలెక్షన్ హీట్… వంటివి జరుగుతున్న నేపథ్యంలోనే ఎలాంటి అప్డేట్ లేకుండా టీజర్ ను రిలీజ్ చేయడంతో ఇంపాక్ట్ గట్టిగానే పడింది. హరిహర వీరమల్లు టీజర్ రిలీజ్ 24 గంటలు పూర్తయినప్పటికీ కేవలం టీజర్ 3.14 మిలియన్స్ వ్యూస్ తో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. టాప్ 10 కాదు కదా టాప్ 20లో కూడా హరిహర వీరమల్లు టీజర్ స్థానాన్ని దక్కించుకోలేకపోయింది. ఈ నేపథ్యంలోనే మరి ఇప్పటి దాకా వ్యూస్ పరంగా 24 గంటల్లోనే రికార్డులు బ్రేక్ చేసిన టాప్ టెన్ సినిమాలు ఏంటి అనే విషయంపై లుక్కేద్దాం.

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన రాధేశ్యామ్ మూవీ ఇందులో ఇంకా ఫస్ట్ ప్లేస్ లో ఉండడం విశేషం. ఈ మూవీ 2021లో రిలీజ్ కాగా, ఇప్పటిదాకా రాధేశ్యామ్ టిజర్ రికార్డును ఎవ్వరూ బ్రేక్ చేయలేకపోయారు. 24 గంటల్లో వ్యూస్ పరంగా హిస్టరీని క్రియేట్ చేసిన సినిమాల టాప్ 10 లిస్ట్ లో మహేష్ బాబు సినిమాలే 3 ఉండడం విశేషం.

టాలీవుడ్‌లో 24 గంటల్లో టాప్ టీజర్ రికార్డ్స్ ఇవే

  1. రాధేశ్యామ్ టీజర్ – 42.67M
  2. సర్కారు వారి పాట బ్లాస్టర్ టీజర్ – 23.06M
  3. ఇంట్రడ్యూసింగ్ పుష్ప రాజ్ టీజర్ – 22.52M
  4. బ్రో టీజర్ – 20.50M
  5. సరిలేరు నీకెవ్వరు టీజర్ – 14.64 M
  6. రామరాజు ఫర్ భీమ్ టీజర్ – 14.14M
  7. సాహో టీజర్ – 12.94 M
  8. భోళా శంకర్ టీజర్ – 12.37M
  9. భగవంత్ కేసరి టీజర్ – 11.45 M
  10. మహర్షి టీజర్ – 11.14M

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు