Amala Paul : ఘనంగా అమలాపాల్ సీమంతం వేడుక..!

Amala Paul : ప్రముఖ కోలీవుడ్ హీరోయిన్ అమలాపాల్ ఒకప్పుడు తెలుగులో సినిమాలు చేసింది. అల్లు అర్జున్ తో చేసిన ఇద్దరమ్మాయిలతో సినిమా సూపర్ హిట్ అయ్యి.. ఆ తర్వాత తెలుగులో అవకాశాలను అందించింది.. కానీ తర్వాత చేసిన సినిమాలు ఏవీ పెద్దగా హిట్ అందుకోకపోవడంతో కోలీవుడ్ వైపే మొగ్గు చూపిన ఈమె.. సినిమా కెరియర్ లో బిజీగా ఉన్నప్పుడే వివాహం చేసుకొని సినిమాలకు దూరం అయింది.. అయితే భర్తతో మనస్పర్ధలు రావడంతో విడాకులు తీసుకొని ఇటీవల రెండో వివాహం కూడా చేసుకున్న అమలాపాల్.. ప్రస్తుతం గర్భవతి అన్న విషయం కూడా తెలిసిందే. గత కొద్ది రోజులుగా బేబీ బంప్ ఫోటోలు , వీడియోలు నెట్టింట షేర్ చేస్తూ అభిమానులకు తన హెల్త్ అప్డేట్ ని తెలియజేస్తోంది..

ఘనంగా సీమంతం వేడుక..

అయితే తాజాగా అమలాపాల్ సీమంతం వేడుకలు జరిగాయి.. ఈ సీమంతం వేడుకను కుటుంబ సభ్యులు, సన్నిహితులు చాలా ఘనంగా నిర్వహించినట్లు తెలుస్తోంది.. ఈ వేడుకకు సంబంధించిన ఫోటోలను అమలాపాల్ తన సోషల్ మీడియా ఖాతా ద్వారా షేర్ చేసుకుంది.. ప్రస్తుతం ఈ ఫోటోలు కాస్త సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.. ఇక ఆ ఫోటోలలో అమలా పాల్ చాలా అందంగా కనిపిస్తోంది.. తన భర్తతో కలిసి సంతోషంగా వేడుకను చేసుకుందని ఫోటోలు చూస్తే అర్థమవుతుంది. ఇకపోతే ఇటీవలే ఈమెకు కవల పిల్లలు పుడతారు అనే వార్తలు కూడా వచ్చాయి.. అయితే ఇందులో ఎంత నిజం ఉందో తెలియదు కానీ ప్రస్తుతం అమలాపాల్ సీమంతం వేడుకలైతే చాలా ఘనంగా జరిగినట్లు తెలుస్తోంది. ఇక ఈ ఫోటోలు చూసిన అభిమానులు సెలబ్రిటీలు కూడా అమలాపాల్ దంపతులకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.

అమలాపాల్ కెరియర్..

1991 అక్టోబర్ 26న కేరళలోని ఎర్నాకులంలో జన్మించిన అమలాపాల్ క్రైస్తవ కుటుంబానికి చెందినవారు.. సెయింట్ థెరిసా కళాశాలలో ఆంగ్లంలో డిగ్రీ ని పూర్తి చేసిన ఈమె ఆ తర్వాత నటనపై ఆసక్తి పెంచుకుంది.. అయితే నటనా వృత్తిని కొనసాగించడాన్ని అమలా తండ్రి తీవ్రంగా వ్యతిరేకించారు.. కానీ ఆమె ఆశయం బలంగా ఉండడంతో ఆమె సోదరుడు ఆమె నిర్ణయాన్ని అంగీకరించి ఆమెను ఇండస్ట్రీలోకి తీసుకొచ్చారు.. అలా చదువు పూర్తయిన తర్వాత 2009లో నీలతామర అనే సినిమాలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కెరియర్ మొదలు పెట్టింది అమలాపాల్.. ఈ సినిమా విజయం సాధించినప్పటికీ కూడా ఈమెకు ఊహించిన స్థాయిలో అవకాశాలు రాలేదు. తర్వాత 2010లో వీరశేఖరన్ అనే సినిమాలో హీరోయిన్గా నటించి.. మొదటి సినిమాతోనే విమర్శకుల ప్రశంసలు కూడా అందుకుంది..

- Advertisement -

అమలాపాల్ సినిమాలు..

ఇటీవలే పృధ్వీరాజ్ సుకుమారన్ తెరకెక్కించిన ఆడు జీవితం అనే సినిమాలో సైను పాత్రలో నటించి మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. మరోవైపు ద్విజ, లెవెల్ క్రాస్ అనే రెండు మలయాళ చిత్రాలలో కూడా నటిస్తోంది ఈ ముద్దుగుమ్మ.. ప్రస్తుతం ద్విజ అనే మలయాళం మూవీ చిత్రీకరణ జరుపుకుంటుండగా.. లెవెల్ క్రాస్ అనే మరో మలయాళం చిత్రం షూటింగ్ పూర్తి చేసుకుంది.. త్వరలోనే ఈ సినిమా కూడా విడుదలకు సిద్ధం కానుంది. ఇక సినిమాలలోనే కాదు సీరియల్స్ లో కూడా నటించి మంచి పేరు దక్కించుకుంది అమలాపాల్ ( Amala Paul ).

 

View this post on Instagram

 

A post shared by Amala Paul (@amalapaul)

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు