Rashmika Mandanna : బర్త్ డే కి కూడా జిమ్ లో కసరత్తులు..

Rashmika Mandanna : టాలీవుడ్ స్టార్ హీరోయిన్ రష్మిక మందన్న గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇప్పుడు టాలీవుడ్ కోలీవుడ్ లో మాత్రమే కాదు ఏకంగా బాలీవుడ్ లో కూడా స్టార్ హీరోయిన్ గా సినిమాలు చేస్తుంది. ఏడేళ్ల కిందట చలో అనే చిన్న సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన ఈ భామ ఇంత పెద్ద స్టార్ హీరోయిన్ అవుతుందని ఊహించి ఉండరు. కానీ వరుస హిట్లతో ఈ అమ్మాయి తన రేంజ్ పెంచుకుంటూ వచ్చింది. రష్మిక ఫేడౌట్ అవుతుందని అనుకున్న ప్రతిసారి ఒక బ్లాక్ బస్టర్ హిట్ తో సక్సెస్ కొడుతూ ఆ వెంటనే వరుస సినిమాలని లైన్లో పెట్టేస్తుంది. ఇక రష్మిక కెరీర్ చెప్పాలంటే పుష్ప కి ముందు ఆ తర్వాత అని చెప్పాలి. అయితే పుష్ప కి ముందే రష్మిక గీతా గోవిందం, సరిలేరు నీకెవ్వరూ లాంటి బ్లాక్ బస్టర్ హిట్లతో స్టార్ హీరోయిన్ అయినప్పటికీ నేషనల్ లెవెల్ లో క్రేజ్ ని తెచ్చిపెట్టింది మాత్రం పుష్ప సినిమానే అని చెప్పొచ్చు. ఈ సినిమాలో శ్రీ వల్లిగా రష్మిక తన గ్లామర్ షో తో పాటు నటనతో కూడా మెప్పించి, ప్రేక్షకులని అలరించింది. ఇప్పుడు పుష్ప 2 తో అంతకు మించిన పెర్ఫార్మన్స్ తో మెప్పించడానికి వస్తుంది.

బర్త్ డే రోజు జిమ్ లో రచ్చ..

ఇదిలా ఉండగా ఏప్రిల్ 5న రష్మిక (Rashmika Mandanna) బర్త్ డే అని తెలిసిందే. అయితే బర్త్ డే రోజు రష్మిక మందన్న యూఏఈ లో సెలెబ్రేట్ చేసుకుంటుందని అందరూ అనుకున్నారు. అనుకున్నట్టే అక్కడే ఉంది కూడా. కానీ అనూహ్యంగా రష్మిక బర్త్ డే రోజున జిమ్ లో లిల్ వర్కౌట్‌లో ఉన్నాను అంటూ ఇంస్టాగ్రామ్ లో వీడియో అప్లోడ్ చేసింది. ఇక అంతే కాదు రష్మిక మందన్న ఆ స్టేటస్ లో ఫ్యాన్స్ అందరి ప్రేమ మరియు విషెస్ చూసిన తర్వాత సంతోషకరమైన లిల్ డ్యాన్స్ చేయాలి అనిపించింది అంటూ పోస్ట్ చేసింది. అయితే రష్మిక జిమ్ లో ప్రతి రోజు వర్కౌట్ చేస్తుందని తెలిసిందే. సినిమా షూటింగ్ లకి గ్యాప్ ఇచ్చినా జిమ్ లకి మాత్రం క్రమం తప్పకుండా వర్కౌట్ చేస్తూ ఉంటుంది. పైగా రష్మిక తన ప్రతి విషయాన్నీ సోషల్ మీడియా లో రెగ్యులర్ గా ఫ్యాన్స్ తో పంచుకుంటుంది. ఎప్పటికప్పుడు స్టేటస్ లు పెడుతూ ఉంటుంది. అందుకే ఇంస్టాగ్రామ్ లో సౌత్ లోనే అత్యధిక ఫాలోవర్లతో టాప్ లో ఉంది.

ఇక రష్మిక సినిమాల విషయానికి వస్తే..

ప్రస్తుతం పుష్ప ది రూల్ సినిమాలో బిజీగా ఉన్న ఈమె, తెలుగులో రాహుల్ రవీంద్రన్ దర్శకత్వం వహిస్తున్న ది గర్ల్ ఫ్రెండ్ లో కూడా నటిస్తుంది. అలాగే రెయిన్ బో అనే ద్విభాషా చిత్రంలో నటిస్తుంది. ఇక రీసెంట్ గా బాలీవుడ్ లో అనిమల్ సినిమాతో బ్లాక్ బస్టర్ సక్సెస్ కొట్టిన ఈ భామ, ప్రస్తుతం ఒక హిందీ సినిమాలో కూడా నటిస్తుంది. అయితే కొత్త ప్రాజెక్టులలో ఎన్నో ఆఫర్లు వస్తున్నా, చాలా సినిమాలు హోల్డ్ లో పెట్టిందని సమాచారం. సెట్స్ పై ఉన్న సినిమాలు ముందు ఫినిష్ చేసి ఆ తర్వాత మిగతా కొత్త సినిమాలపై ఫోకస్ పెట్టాలని చూస్తున్నట్టు తెలుస్తుంది.

- Advertisement -

https://www.instagram.com/reel/C5Ygr5jN34k/?utm_source=ig_web_copy_link&igsh=MzRlODBiNWFlZA==

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు