5 years for Maharshi : మహేష్ 25వ చిత్రం… ఇండస్ట్రీ హిట్ అయిన ఈ మూవీకి ఎన్ని కోట్ల లాభం వచ్చిందంటే…?

5 years for Maharshi.. టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు, డైరెక్టర్ వంశీ పైడిపల్లి డైరెక్షన్లో వచ్చిన చిత్రం మహర్షి.. ఈ చిత్రం మహేష్ బాబు 25వ చిత్రంగా మంచి విజయాన్ని అందుకుంది. మహేష్ బాబు కెరీర్ ని మరొకసారి మలుపు తిప్పింది మహర్షి చిత్రం.. నిర్మాతగా దిల్ రాజు , అశ్వనీ దత్ నిర్మించారు. ఈ సినిమా షూటింగ్ మొదలైనప్పటి నుంచి కాస్త ఎక్కువ సమయం తీసుకున్నారు. ఈ సినిమా షూటింగ్ మొదలవ్వగానే చిత్ర బృందం ఎలాంటి రిస్క్ తీసుకోకుండానే కంటిన్యూ గా షూటింగ్ కంప్లీట్ చేయడానికి చాలా కష్టపడ్డారు. ఇందులో అల్లరి నరేష్, పూజా హెగ్డే కీలక పాత్ర పోషించిన విషయం తెలిసిందే.దేవిశ్రీప్రసాద్ ఈ సినిమాకి సంగీతాన్ని అందించారు. ఇకపోతే ఈ సినిమాకి రూ.100 కోట్ల బడ్జెట్ పెట్టగా బాక్సాఫీస్ వద్ద రూ.206 కోట్ల కలెక్షన్స్ వచ్చినట్లు సమాచారం. నేటితో ఈ సినిమా విడుదలై ఐదు సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా.. మొత్తంగా ఏరియా వైస్ సినిమా ముగిసే సరికి ఎన్ని కోట్లు రాబట్టింది అనే విషయం ఇప్పుడు చూద్దాం..

5 years for Maharshi : Mahesh's 25th film... How many crores of profit did the industry hit?
5 years for Maharshi : Mahesh’s 25th film… How many crores of profit did the industry hit?

ఏరియా వైస్ మహర్షి మూవీ ఎంత కలెక్షన్ రాబట్టింది అంటే..

నైజాం: రూ.30.45కోట్లు
సీడెడ్: రూ .10.26కోట్లు
ఉత్తరాంధ్ర : రూ.12.11కోట్లు
తూర్పు: రూ.7.31కోట్లు
వెస్ట్: రూ.5.80కోట్లు
కృష్ణా: రూ .5.61కోట్లు
గుంటూరు: రూ .7.70కోట్లు
నెల్లూరు: రూ.2.75 కోట్లు
ఆంధ్ర ప్లస్ తెలంగాణ రూ.81.99 కోట్లు కాగా
USA: రూ. 7.62కోట్లు సాధించింది. ఇక మొత్తంగా అన్ని ఏరియాలలో కలుపుకొని రూ .206 కోట్లు కలెక్షన్స్ వసూలు చేసినట్లు సమాచారం.

- Advertisement -

మహర్షి అందుకున్న అవార్డ్స్..

2021లో హైదరాబాద్లో జరిగిన సైమా అవార్డుల ప్రధాన ఉత్సవంలో 2019 సంవత్సరానికి గాను మహర్షి సినిమా ఏకంగా 10 విభాగాలలో నామినేట్ అవ్వగా అందులో ఐదు అవార్డులను సొంతం చేసుకుంది..

ఉత్తమ నటుడు కేటగిరీ లో మహేష్ బాబు ఉత్తమ సహాయ నటుడు కేటగిరీలో అల్లరి నరేష్ , ఉత్తమ దర్శకుడు కేటగిరీలో వంశీ పైడిపల్లి ఉత్తమ సంగీత దర్శకుడు కేటగిరీలో దేవిశ్రీప్రసాద్ ఉత్తమ గేయ రచయిత “ఇదే కదా” అనే పాటకు శ్రీమణి ఈ ఫిలింఫేర్ అవార్డులను సొంతం చేసుకున్నారు.

అలాగే 2021లో 67వ భారత జాతీయ చలనచిత్ర పురస్కారాలలో భాగంగా ఉత్తమ వినోదం అందించిన ప్రజాదారణ పొందిన చిత్రంగా జాతీయ ఉత్తమ నృత్య దర్శకుడు (రాజు సుందరం మాస్టర్ ), ఉత్తమ నిర్మాణ సంస్థ ( శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ )విభాగాలలో పురస్కారాలు లభించాయి.

స్టార్ కాస్ట్..

ఇక ఇందులో నటించిన భారీ తారాగణం విషయానికొస్తే.. జగపతిబాబు, ప్రకాష్ రాజ్, రావు రమేష్ ,జయసుధ, వెన్నెల కిషోర్, అనన్య , విద్యుల్లేఖ రామన్ , నాజర్ , కమల్ కామరాజు , తనికెళ్ల భరణి, సాయికుమార్ , పోసాని కృష్ణ మురళి , శ్రీనివాస్ రెడ్డి, రాజీవ్ కనకాల, కోట శ్రీనివాసరావు, అన్నపూర్ణ , కైకాల సత్యనారాయణ, బ్రహ్మాజీ, గెటప్ శ్రీను తదితరులు కీలకపాత్రలు పోషించారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు