Game Changer : ‘అప్పన్న’, ‘సేనాపతి’ కలిస్తే.. కోలీవుడ్ నెట్టింట యూనివర్స్ రచ్చ..

Game Changer : కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ శంకర్ షణ్ముగం గత నాలుగేళ్లుగా ఇండియన్ 2, గేమ్ ఛేంజర్ సినిమాలను చిక్కుతునే ఉన్నాడని తెలిసిందే. ఈ సినిమాలు 2024 లోనే రిలీజ్ కానున్నాయి. ఇక ఇండియన్ 2 లో కమల్ హాసన్ హీరోగా నటిస్తుండగా, గేమ్ ఛేంజర్ లో రామ్ చరణ్ హీరోగా నటిస్తున్న విషయం తెలిసిందే. అయితే శంకర్ వీరిని కలపనున్నాడట. ఈ విషయంపైనే ఈ సినిమాల గురించి ఒక ఇంట్రస్టింగ్ విషయం కోలీవుడ్ నెట్టింట తెగ వైరల్ అవుతుంది. మాములుగా హాలీవుడ్ లో ఎప్పటి నుంచో ఉన్న సినిమాటిక్ యునివర్స్ కాన్సెప్ట్ ని ఈ మధ్యన మన ఇండియన్ దర్శకులు బాగా పుణికి పుచ్చుకుంటున్నారు. ముఖ్యంగా సౌత్ లో బాగా ఫేమస్ అయింది. ఖైదీతో మొదలుపెట్టి విక్రమ్ దాకా దర్శకుడు లోకేష్ కనగరాజ్ అందరినీ ముడిపెడతానని గతంలోనే చెప్పాడు. ఇక టాలీవుడ్ లో శైలేష్ కొలను తన హిట్ సిరీస్ లో హీరోలందరిని ఒకేసారి కలిపిస్తానని పలు ఇంటర్వ్యూలలో అనడం తెలిసిందే. రీసెంట్ గా ప్రశాంత్ వర్మ హనుమాన్, అధీరలతో స్టార్ట్ చేసి వీలైనంత పెద్ద స్థాయిలో టాలీవుడ్ అవెంజర్స్ ని చూపిస్తానని తెగ ఊరించడం చూస్తునే ఉన్నాం. అయితే వీళ్లంతా యంగ్ డైరెక్టర్లు. ఇక ఇప్పుడీ లీగ్ లోకి కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ శంకర్ చేరే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. ఈ విషయం చిత్ర యూనిట్ నుండి లీక్ అయిందట.

అప్పన్న సేనాపతి కలుస్తారా?

అయితే తాజా సమాచారం ప్రకారం శంకర్ ప్రస్తుతం చేస్తున్న సినిమాల కథలను కలిపే ఆలోచనలో ఉన్నారని తెలుస్తుంది. అదెలాగంటే భారతీయుడు 2, గేమ్ ఛేంజర్ రెండు సినిమాల్లోనూ స్వాతంత్ర పూర్వ నేపథ్యం ఫ్లాష్ బ్యాక్ రూపంలో ఉంటుంది. అప్పన్నగా రామ్ చరణ్, సేనాపతిగా కమల్ హాసన్ పవర్ ఫుల్ గతాలను చూస్తాం. బ్యాక్ డ్రాప్ పరంగా ఇంచు మించు ఒకే కాలం కాబట్టి ఇద్దరినీ ఎక్కడో ఒక చోట ముడిపెట్టి ఒక ఎపిసోడ్ డిజైన్ చేస్తే ఎలా ఉంటుందనే ఆలోచనతో శంకర్ కొన్ని సీన్లు షూట్ చేశాడని కోలీవుడ్ వర్గాలు చర్చిస్తున్నాయి. ఇక రీసెంట్ గా చరణ్ తరచుగా చెన్నై వెళ్ళినప్పుడు ఈ చిత్రీకరణ జరిగి ఉండొచ్చని కోలీవుడ్ వర్గాలు అంటున్నారు. అదే నిజమైతే మాత్రం తెరమీద పాత గెటప్పుల్లో ఇద్దరినీ ఒకేసారి తెరమీద చూడటం కన్నా కనువిందు ఇంకేముంటుంది. ఇక ఈ సీన్ ని ఇండియన్ 2 లో పెట్టబోతున్నారని సమాచారం. బహుశా అప్పన్న కి గురువుగా సేనాపతిని చూపించొచ్చని తెలుస్తుంది.

రెండూ ఒకే ఏడాది..

అయితే కోలీవుడ్ లో తెగ వైరల్ అవుతున్న ఈ వార్త గురించి డిసైడ్ చేయలేము కానీ, అభిమానులు కూడా ఇది నిజం కావాలని కోరుకుంటున్నారు. కానీ రామ్ చరణ్ చెన్నై వెళ్లి వచ్చినప్పటినుండి తమిళ మీడియా వర్గాల్లో ఈ వార్త గట్టిగానే తిరుగుతోంది. పైగా భారతీయుడు 2 విడుదల మళ్ళీ వాయిదా పడిన నేపథ్యంలో గేమ్ ఛేంజర్ (Game Changer) అక్టోబర్ లో రావడం మీద అప్పుడే అనుమానాలు మొదలయ్యాయి. పోనీ డిసెంబర్ కైనా వస్తుందా అంటే అదీ ఖచ్చితంగా చెప్పలేని పరిస్థితి నెలకొంది. సంక్రాంతికి చిరంజీవి విశ్వంభర ఉంది కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ క్లాష్ అయ్యే ఛాన్స్ ఉండదు. సో ఏదో క్రైమ్ థ్రిల్లర్ సస్పెన్స్ లా విడుదల తేదీల వ్యవహారాన్ని శంకర్ ఎంతకీ తేల్చకపోవడం ఫ్యాన్స్ లో అసహనాన్ని పెంచుతోంది. అయితే వీటి వల్ల రామ్ చరణ్ తదుపరి సినిమాలపై మరింత ఆలస్యం అవుతుందని చరణ్ ఫ్యాన్స్ కూడా నిరాశలో ఉన్నారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు