Chiranjeevi : ప్రైవేట్ జెట్ లో ఢిల్లీకి మెగాస్టార్ ప్రయాణం… ఎందుకంటే?

Chiranjeevi : మెగాస్టార్ చిరంజీవి తాజాగా ఢిల్లీki పయనమయ్యారు అన్న వార్త వైరల్ గా మారింది. మరి ఆయన సినిమాలతో బిజీగా ఉన్న తరుణంలో ఈ ఢిల్లీ ప్రయాణాన్ని ఎందుకు పెట్టుకున్నారు అనే విషయంపై ఓ లుక్కేద్దాం.

భారతదేశంలోని ప్రముఖ నటులలో మెగాస్టార్ చిరంజీవి కూడా ఒకరు అన్న విషయం అందరికీ తెలిసిందే. తెలుగులో ఇప్పటిదాకా 150కి పైగా చిత్రాలలో నటించిన ఆయనకు తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా దేశవ్యాప్తంగా మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. కేవలం నటుడిగానే కాకుండా సామాజికవేత్తగా పలు సేవా కార్యక్రమాలు చేస్తూ ప్రజల మన్ననలు అందుకున్న చిరంజీవి సినిమా పరిశ్రమకు చేసిన కృషిని గుర్తించిన భారత ప్రభుత్వం దేశంలోనే రెండవ అత్యున్నత పౌర పురస్కారమైన పద్మ విభూషణ్ ను ప్రకటించింది.

జనవరి 25న పద్మవిభూషణ్ అవార్డు ప్రకటన..

ఈ ఏడాది జనవరి 25న భారత ప్రభుత్వం పద్మ అవార్డు గ్రహీతల జాబితాను విడుదల చేసింది. ఇందులో మెగాస్టార్ చిరంజీవి పేరు కూడా ఉంది. భారతదేశపు రెండవ అత్యున్నత పౌర పురస్కారమైన పద్మవిభూషణ్ అవార్డుకు చిరుని ఎంపిక చేశారు. ఇది నిజంగా సినిమా పరిశ్రమకు, ముఖ్యంగా తెలుగు రాష్ట్రాలు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు గర్వకారణం అని చెప్పవచ్చు. అలాగే మెగా కుటుంబంతో పాటు మెగా ఫ్యాన్స్ కు సంతోషకరమైన క్షణం. ఈ అరుదైన ఘనత సాధించినందుకు అదే నెలలో పలువురు ప్రముఖులు మెగాస్టార్ నివాసానికి చేరి విష్ చేశారు. ఇప్పుడు ఎట్టకేలకు పద్మ అవార్డుల వేడుకకు చిరంజీవి న్యూఢిల్లీకి బయలు దేరారు.

- Advertisement -

పద్మ అవార్డు అందుకోవడానికి ఢిల్లీకి..

ఇది మెగాస్టార్ చిరంజీవి కెరీర్ లోనే ఒక ల్యాండ్‌మార్క్ అచీవ్‌మెంట్ అని చెప్పొచ్చు. మెగా అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న పద్మ అవార్డు వేడుకకు ఎట్టకేలకు సమయం ఆసన్నమైంది. ఈరోజు జరగనున్న పద్మ అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమంలో పాల్గొనేందుకు మెగాస్టార్ చిరంజీవి తాజాగా హైదరాబాద్ నుంచి ఢిల్లీకి బయలుదేరారు.
పద్మవిభూషణ్ అవార్డును అందుకోవడానికి ఆయన ఢిల్లీకి తన ప్రైవేట్ జెట్‌లో ప్రయణమయ్యారు. ఈ రోజు మే 9న చిరుకు ఈ అవార్డును అందజేయనున్నారు.

అవార్డుల వేడుకకు మెగా ఫ్యామిలీ..

ఈ కార్యక్రమంలో చిరంజీవితో పాటు ఆయన భార్య సురేఖ, ఆయన కుమారుడు రామ్ చరణ్ , కోడలు ఉపాసన కొణిదెల కూడా పాల్గొంటున్నారు.

చిరుతో పాటు అవార్డు అందుకునే ప్రముఖులు

మెగాస్టార్ చిరంజీవితో పాటు నటి వైజయంతిమాల కూడా పద్మవిభూషణ్ అందుకోవడం విశేషం. దివంగత నటుడు విజయకాంత్‌కు మరణానంతరం పురస్కారం అందజేయనున్నారు. అంతేకాదు మాజీ రాష్ట్రపతి ఎం. వెంకయ్య నాయుడు, పద్మా సుబ్రహ్మణ్యం, బిందేశ్వర్ పాఠక్‌లు కూడా పద్మవిభూషణ్‌ అవార్డును అందుకోనున్నారు.

చిరు సినిమాల విషయానికొస్తే.. చిరంజీవి ప్రస్తుతం మల్లిడి వశిష్ట దర్శకత్వం వహిస్తున్న ‘విశ్వంభర ‘ చిత్రం షూటింగ్‌లో ఉన్నారు. ఈ చిత్రంలో త్రిష కథానాయికగా నటిస్తుండగా, పవన్ కళ్యాణ్ కూడా కీలక పాత్ర పోషిస్తున్నట్లు సమాచారం. ఈ సోషియో-ఫాంటసీ మూవీ చిరు కెరీర్ లో 156వ చిత్రం కావడం విశేషం. అలాగే ఈ మూవీకి ఆస్కార్ విన్నర్ ఎంఎం  కీరవాణి సంగీతం అందిస్తున్నారు. విశ్వంభర మూవీని 2025 జనవరి 10న విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు