HBD Vijay deverakonda: విజయ్ దేవరకొండ కెరీర్ నే మలుపు తిప్పిన ఐదు చిత్రాలివే..!

HBD Vijay Deverakonda.. రౌడీ హీరో విజయ్ దేవరకొండ అనగానే అమ్మాయిలలో ఎక్కడలేని క్రష్ పుట్టుకొస్తుంది.. అమ్మాయిల కలల రాకుమారుడిగా భారీ పేరు సంపాదించుకున్న విజయ్ దేవరకొండ.. తన అద్భుతమైన నటనతో మిలియన్ల మంది హృదయాలను సొంతం చేసుకున్నారు. తన అద్భుతమైన నటనతోనే కాదు తన సినిమాల ద్వారా వచ్చిన లాభాలతో అభిమానులకు సహాయాన్ని అందిస్తూ.. మరింత పేరు ప్రఖ్యాతలు సొంతం చేసుకున్నారు. ఇంత స్టార్ డంను సుస్థిరం చేసుకుంటూ నేషనల్ క్రష్ అయిపోయారు విజయ్ దేవరకొండ.. ఈరోజు ఆయన పుట్టినరోజు సందర్భంగా పలువురు ప్రముఖులు, అభిమానులు సోషల్ మీడియా ద్వారా శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.. ఈ నేపథ్యంలోనే విజయ్ దేవరకొండకు సంబంధించిన కొన్ని విషయాలు కూడా వైరల్ అవుతూ ఉండగా.. ఈయన కెరియర్ ను మలుపు తిప్పిన 5 చిత్రాల గురించి ఇప్పుడు చూద్దాం.

HBD Vijay Deverakonda: Five films that turned the career of Vijay Deverakonda..!
HBD Vijay Deverakonda: Five films that turned the career of Vijay Deverakonda..!

అర్జున్ రెడ్డి..

విజయ్ దేవరకొండ కెరియర్ ను మార్చిన చిత్రం అంటే మొదటిగా వినిపించేది అర్జున్ రెడ్డి చిత్రమే. ఈ సినిమాతో ఒక్కసారిగా స్టార్ హీరో అయిపోయారు.. ఈ పాత్రను ఇంత పర్ఫెక్షన్ తో పోషిస్తాడని అభిమానులే కాదు డైరెక్ట్ చేసే దర్శకుడు కూడా ఊహించలేదు.. ఈ ఐకానిక్ క్యారెక్టర్ తో అర్జున్ రెడ్డి పై తన ముద్రను వేశాడు. తన ప్రేమ కోసం మద్యపానానికి వ్యసనపరుడై చివరికి ఆమె ప్రేమను పొందాడనే ఈ కథ యువతకు బాగా కనెక్ట్ అయింది. ఈ చిత్రం ప్రేక్షకుల నుండి ప్రశంసలు కూడా అందుకుంది.. అంతేకాదు అర్జున్ రెడ్డి చిత్రానికి గాను ఉత్తమ నటుడిగా తన మొదటి ఫిలింఫేర్ అవార్డును సొంతం చేసుకున్నారు విజయ్ దేవరకొండ.

- Advertisement -

గీతా గోవిందం..

రొమాంటిక్ ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ చిత్రమైన గీతాగోవిందం విజయ్ దేవరకొండ కెరియర్ గ్రాఫ్ ను అమాంతం పెంచేసింది. విజయ్ దేవరకొండ హీరోగా, రష్మిక మందన్న హీరోయిన్గా తెరకెక్కిన ఈ చిత్రం ఫ్యామిలీ ఆడియన్స్ ను విపరీతంగా ఆకట్టుకుంది.. రష్మిక తో విజయ్ కి ఎదురులేని కెమిస్ట్రీగా నిలిచింది.. అంతేకాదు స్క్రీన్ ప్లే , కథనం ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయి.

డియర్ కామ్రేడ్..

విజయ్ దేవరకొండ నుంచి వచ్చిన మరో చిత్రం డియర్ కామ్రేడ్ .. ఇందులో క్యారెక్టర్స్ సూపర్బ్.. నటుడిగా ఈ చిత్రంతో తనేంటో నిరూపించుకున్నారు. అందమైన రష్మిక మందన్నతో అతని కెమిస్ట్రీ కూడా అదిరిపోయింది.. ఇక ఈ రెండు చిత్రాలతోనే వీరిద్దరి మధ్య ఏదో ఉందనే వార్త ఇప్పటికీ వినిపిస్తూనే ఉంటుంది.

టాక్సీవాలా..

ఇందులో విజయ్ టాక్సీ డ్రైవర్ పాత్ర పోషించారు.తన పాత్రకు ఏది వర్కౌట్ కానప్పుడు జీవనోపాధి కోసం టాక్సీ డ్రైవర్ గా మారాలని నిర్ణయించుకున్నాడు.. కారు కోసం వేటలో అతను పాతకాలపు కారు సొంతం చేసుకోవడం.. ఆ కారు అతని అదృష్టాన్ని మలుపు తిప్పడం.. ఈ సన్నివేశాలు ప్రేక్షకులను ఆకట్టుకుంటాయి.. ఈ పాత్రలో చాలా అద్భుతంగా నటించారు విజయ్.

పెళ్లిచూపులు..

హీరోగా తొలి ప్రయత్నం పెళ్లిచూపులు.. విజయ్ దేవరకొండ హీరోగా.. రీతూ వర్మ జంటగా నటించిన ఈ చిత్రం ఉత్తమ తెలుగు చిత్రాలలో ఒకటిగా నిలిచిపోయింది.. ఇక ఈ సినిమా కూడా మంచి విజయాన్ని సొంతం చేసుకొని విజయ్ దేవరకొండ ను హీరోగా నిలబెట్టింది.. అంతేకాదు ఈ చిత్రానికి 64వ జాతీయ చలనచిత్ర అవార్డులలో ఉత్తమ తెలుగు చిత్రంగా, ఉత్తమ స్క్రీన్ ప్లే గా రెండు జాతీయ అవార్డులు కూడా లభించాయి.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు