Toxic Update : యష్ సినిమా కోసం షాకింగ్ రెమ్యూనరేషన్ డిమాండ్ చేస్తున్న నయన్?

Toxic Update : రాకింగ్ స్టార్ యష్ హీరోగా నటిస్తున్న పాన్ ఇండియా మూవీ టాక్సిక్ విషయంలో ఊహించని ట్విస్ట్ లో చోటు చేసుకుంటున్నాయి. మూవీని అనౌన్స్ చేసి చాలా రోజులే అవుతున్నా ఒక్క అప్డేట్ కూడా లేదు. కానీ ఈ మూవీ గురించి రోజుకో వార్త చక్కర్లు కొడుతోంది. తాజాగా ఈ సినిమాలో నటించడానికి నయనతార షాకింగ్ రెమ్యూనరేషన్ డిమాండ్ చేస్తోంది అనే వార్తలు బయటకు వచ్చాయి.

యష్ కు సోదరిగా..

ఈ నేపథ్యంలోనే ఆమె ఓ కన్నడ సినిమాలో కూడా నటించబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. కెజిఎఫ్‌ స్టార్ యష్ ప్రధాన పాత్రలో నటిస్తున్న టాక్సిక్ మూవీలో నయనతార నటించే ఛాన్స్ ఉందనే రుమార్లు వైరల్ అవుతున్నాయి. ఈ క్రమంలోనే ఆమె టాక్సిక్ సినిమాలో స్టార్ హీరో యష్ కు అక్కగా నటించబోతున్నట్లు వార్తలు వచ్చాయి.

కరీనా కపూర్ ఎస్కేప్

మాధవన్ నటించిన నలదమయంతి చిత్రంలో హీరోయిన్‌గా నటించిన గీతా మోహన్‌ దాస్ దర్శకత్వంలో టాక్సిక్‌ మూవీ రూపొందుతోంది. యష్ హీరోగా నటిస్తున్న ఈ సినిమాలో ముందుగా బాలీవుడ్ నటి కరీనా కపూర్ ఈ చిత్రంలో అతని అక్కగా నటించడానికి సైన్ చేసింది. అయితే కాల్‌షీట్‌ సమస్య కారణంగా ఆమె ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి.

- Advertisement -

కరీనా స్థానంలో నయనతార

కరీనా కపూర్ స్థానంలో లేడి సూపర్ స్టార్ నయనతారను యష్ సోదరిగా నటింపజేసేందుకు చర్చలు జరిగాయని సమాచారం. అయితే ప్రస్తుతం నయన్ కెరీర్ స్టార్ హీరోయిన్ గా పీక్స్ లో ఉన్న విషయం తెలిసిందే. అందుకే ఈ సినిమాలో హీరోయిన్ గా కాకుండా హీరో సోదరి పాత్రలో నటించేందుకు ఆమె రెట్టింపు పారితోషికాన్ని డిమాండ్ చేసిందని తెలుస్తోంది.

20 కోట్ల రెమ్యూనరేషన్..

నయనతార ప్రస్తుతం తన కొత్త సినిమాల కోసం 10 కోట్లు పారితోషికంగా వసూలు చేస్తోంది. కేజీఎఫ్ హీరో యష్ అక్క పాత్రలో నటించేందుకు ఆమె 20 కోట్లు డిమాండ్ చేసినట్లు సమాచారం. నయనతారది ఈ సినిమాకి కీలకమైన పాత్ర కావడం, అలాగే నయన్ కు ఉన్న క్రేజ్ ను దృష్టిలో పెట్టుకుని ఆమె అడిగినంత పారితోషికాన్ని ఇవ్వడానికి నిర్మాతలు వెనకాడరని భావిస్తున్నారు. మరేం జరుగుతుందో చూడాలి.

చిరంజీవికి కూడా చెల్లెలుగా..

మలయాళ మూవీ లూసిఫర్‌లో మోహన్‌ లాల్ చెల్లెలుగా మంజు వారియర్ నటించింది. ఇదే చిత్రం తెలుగులో చిరంజీవి హీరోగా విడుదల కాగా, ఆ పాత్రలో నయనతార నటించింది.

పాన్ ఇండియా హిట్ తరువాత కూడా అదే పరిస్థితి…

షారుఖ్‌ ఖాన్‌తో జోడీగా జవాన్‌లో హీరోయిన్‌గా నటించినప్పటికి లేడి సూపర్ స్టార్ నయన్ కు ప్రస్తుతం పెద్ద సినిమాల ఆఫర్స్ ఏమీ లేవు. నిజానికి జవాన్ మూవీ పాన్ ఇండియా హిట్. కానీ ఇప్పుడు నయన్ పరిస్థితి చూస్తుంటే అది ఆమెకు ఏమాత్రం కలిసి వచ్చినట్టు కన్పించడం లేదు. నయనతార చేతిలో ప్రస్తుతం టెస్ట్, మన్నగట్టి అనే రెండు తమిళ సినిమాలు మాత్రమే ఉన్నాయి. ఆ రెండు సినిమాల షూటింగ్ తర్వాత నయనతార మలయాళంలో నివిన్ పౌలీ సరసన నటిస్తోంది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు