Maayaone Teaser Talk : కామన్ మ్యాన్ వర్సెస్ సూపర్ విలన్.. టీజర్ తోనే విధ్వంసం..!

Maayaone.. ఈ మధ్యకాలంలో సూపర్ హీరో కాన్సెప్ట్ తో ఎన్నో సినిమాలు ప్రేక్షకులను అలరిస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఎక్కువగా యంగ్ హీరోలు ఈ సూపర్ హీరో కాన్సెప్ట్ తో సినిమాలను తెరకెక్కిస్తున్నారు.. మొన్నటికి మొన్న తేజా సజ్జ ఈ కాన్సెప్ట్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చి భారీ విజయాన్ని సొంతం చేసుకున్న విషయం తెలిసిందే.. ఇప్పుడు యంగ్ అండ్ టాలెంటెడ్ యాక్టర్ సందీప్ కిషన్ కూడా సూపర్ హీరో కాకుండా సూపర్ విలన్ కాన్సెప్ట్ తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. చివరిసారిగా ఊరి పేరు భైరవకోన అనే చిత్రంలో కనిపించారు.. ఈ చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద మంచి వసూళ్లను రాబట్టింది.. ఇక సందీప్ కిషన్ ప్రధాన పాత్రలో డైరెక్టర్ సివి కుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న తాజా చిత్రం మాయావన్ .. అడ్వెంచర్స్ ఇంటర్నేషనల్ ప్రైవేట్ లిమిటెడ్ మరియు ఏకే ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్లపై ఈ సినిమాని నిర్మిస్తున్నారు.

Maayaone: Common Man Vs Super Villain.. Destruction with the teaser..!
Maayaone: Common Man Vs Super Villain.. Destruction with the teaser..!

ఇకపోతే ఈ చిత్రం ఫస్ట్ లుక్ ను సందీప్ కిషన్ పుట్టిన రోజున రిలీజ్ చేయగా.. అభిమానుల నుంచి మంచి రెస్పాన్స్ లభించింది.. అంతేకాదు ఈ చిత్రం నుంచి టీజర్ కి సంబంధించిన పోస్టర్ ని రిలీజ్ చేస్తూ గురువారం రోజున ఉదయం 11:07 గంటలకు రిలీజ్ చేయబోతున్నట్లు పోస్టర్ రూపంలో వెల్లడించారు. నీల్ నితిన్ ముఖేష్ కీలక పాత్రలో నటిస్తున్న ఈ సినిమాలో ఆకాంక్ష రంజన్ కపూర్ హీరోయిన్ గా నటిస్తోంది. ఇకపోతే తాజాగా ప్రకటించినట్టుగానే 11:07 గంటలకు సినిమా టీజర్ ను రిలీజ్ చేశారు.. కామన్ మ్యాన్ వర్సెస్ సూపర్ విలన్ కాన్సెప్ట్ తో ఈ టీజర్ చాలా అద్భుతంగా కనిపిస్తోంది.. టీజర్ చూస్తున్నంత సేపు అద్భుతమైన వీఎఫ్ఎక్స్ తో వేరే ప్రపంచంలోకి మనల్ని ఈ సినిమా తీసుకెళ్తుంది అనడంలో సందేహం లేదు. పోస్టర్ తోనే టీజర్ పై హైప్ పెంచేసిన చిత్రబృందం.. ఈ టీజర్ చూస్తుంటే సినిమాపై మరింత హైప్ పెరుగుతోందని చెప్పవచ్చు.

టీజర్ విషయానికి వస్తే..

టీజర్ విషయానికి వస్తే.. ఒకసారి పురాణాలను దాటి వచ్చి చూస్తే.. తనను తాను దేవుడిగా భావించిన ప్రతి మనిషి మారేది రాక్షసుడిగా మాత్రమే.. సర్వం నేనే.. సమస్తము నేనే.. సైన్స్ నేనే.. అంటూ మురళీ శర్మ వాయిస్ ఓవర్ తో స్టార్ట్ అయ్యే ఈ టీజర్ ప్రేక్షకులను ఆద్యంతం ఆకట్టుకుంటోంది. ముఖ్యంగా యాక్షన్ అడ్వెంచర్ మూవీగా రాబోతున్న ఈ సినిమా ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకోబోతోందని టీజర్ చూస్తే అర్థమవుతోంది. మొత్తానికి అయితే ఈ టీజర్ ప్రేక్షకులను ఆకట్టుకోవడమే కాదు సినిమాపై మరింత హైప్ పెయిన్ చేస్తోందని చెప్పవచ్చు. సందీప్ కిషన్ ఇంట్రో కూడా టీజర్ కి హైలెట్ గా నిలిచింది.

- Advertisement -

చివరిగా ఊరి పేరు భైరవకోన సినిమాతో భారీ విజయాన్ని సొంతం చేసుకున్న సందీప్ కిషన్ మరొకవైపు వైబ్ అనే చిత్రంలో కూడా నటిస్తున్నారు. ఇక ఈ సినిమా షూటింగ్ జరుగుతుండగానే.. మరోవైపు తన 30వ చిత్రం గా మాయావన్ చిత్రాన్ని ప్రకటించారు మరి ఈ సినిమాతో సందీప్ కిషన్ ఎలాంటి విజయాన్ని అందుకుంటారో చూడాలి.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు