Best Crime Thriller series on OTT : ఓటిటిలో ఉన్న బెస్ట్ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్ లు ఇవే… ఇంకా చూడలేదా?

Best Crime Thriller series on OTT : ఓటీటీల పట్ల ప్రజలకు ఉన్న క్రేజ్ రోజురోజుకూ పెరుగుతోంది. మూవీ లవర్స్ ప్రతి రోజూ కొత్త, విభిన్నమైన వెబ్ సిరీస్‌లను చూడటానికి ఇష్టపడుతున్నారు. అయితే ప్రస్తుతం ఓటీటీలో కుప్పలుతెప్పలుగా వెబ్ సిరీస్‌ లు, సినిమాలు ఉన్నాయి. వాటిలో బెస్ట్ సిరీస్ లు ఏంటి? ఏం చూడాలి? అనే విషయంలో గందరగోళానికి గురవుతారు. అన్నీ ఓటీటీ సంస్థలను చెక్ చేసుకుంటూ కూర్చుంటే టైమ్ వేస్ట్ తప్ప ఉపయోగం ఉండదు. అందుకే మూవీ లవర్స్ కు ఆల్ టైమ్ ఫేవరేట్‌గా ఉన్న కొన్ని వెబ్ సిరీస్ ల లిస్ట్ మీ కోసమే తీసుకొస్తున్నాము. మ‌ళ్లీ మ‌ళ్లీ చూసినా విసుగు రాని కొన్ని వెబ్ సిరీస్‌లపై ఓ లుక్కేద్దాం.

అందులోనూ మోస్ట్ వాంటెడ్ జానర్ క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ ల గురించి తెలుసుకుందాం. ప్రస్తుతం ఓటీటీలో ఎన్నో జానర్లు ఉన్నప్పటికీ సెపరేట్ గా క్రైమ్ థ్రిల్లర్ జానర్ సిరీస్ లు, సినిమాలను ఇష్టపడే వారి సంఖ్య కూడా భారీగానే ఉంది. ఇక ఆ ఇంట్రెస్టింగ్ క్రైమ్ థ్రిల్లర్ జానర్ సిరీస్ ల లిస్ట్ విషయంలోకి వెళ్తే..

పంచాయత్

ఈ వెబ్ సిరీస్ ఓటీటీ లవర్స్ అత్యధికంగా వీక్షించిన వెబ్ సిరీస్‌లలో ఒకటి. అమెజాన్ ప్రైమ్‌లో అందుబాటులో ఉన్న ఈ వెబ్ సిరీస్ ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. ఈ సిరీస్‌లోని మొదటి, రెండవ భాగాలు జనాలను పిచ్చెక్కించాయి. తాజాగా ఈ సిరీస్ లో మూడవ భాగం ప్రీమియర్ తేదీని ప్రకటించారు. మే 28న విడుదల కానున్న పంచాయత్ 3ని చూడాలంటే అంతకంటే ముందే ఈ వెబ్ సిరీస్ లోని ఫస్ట్ పార్ట్ ను చూసేయండి.

- Advertisement -

ఫ్యామిలీ మ్యాన్

మనోజ్ బాజ్‌పేయి, ప్రియమణి ప్రధాన పాత్రల్లో నటించిన వెబ్ సిరీస్ ‘ఫ్యామిలీ మ్యాన్’. ఓ సామాన్యుడి కథ ఆధారంగా తెరకెక్కిన ఈ స్టోరీ కూడా ఆడియన్స్ కు పిచ్చి పిచ్చిగా నచ్చేసింది. ఈ వెబ్ సిరీస్ మూడో భాగం కోసం జనాలు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇటీవలే దీనికి సంబంధించిన షూటింగ్ స్టార్ట్ అయ్యింది.

క్రిమినల్ జస్టిస్

ఓటీటీలో అందుబాటులో ఉన్న ఈ వెబ్ సిరీస్ కూడా అత్యధికంగా వీక్షించిన సిరీస్‌లలో ఒకటి. డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో అందుబాటులో ఉన్న ఈ సిరీస్‌లో సస్పెన్స్, కోర్ట్‌ రూమ్ డ్రామా ఆసక్తికరంగా ఉన్నాయి. ఈ సిరీస్‌లో మూడు సీజన్‌లు వచ్చాయి. మూడు పార్ట్స్ కూడా సూపర్ హిట్ గా నిలిచాయి.

మీర్జాపూర్

అత్యంత విజయవంతమైన, ప్రజాదరణ పొందిన వెబ్ సిరీస్‌లలో మీర్జాపూర్ ఫస్ట్ ప్లేస్ లో ఉంటుంది. ఈ వెబ్ షోలో అధికార సింహాసనం కోసం రెండు ముఠాల మధ్య జరిగే యుద్ధాన్ని కన్ను ఆర్పకుండా చూసేంత ఇంట్రెస్టింగ్ గా చూపించారు. ఈ సిరీస్‌లో ఇప్పటిదాకా వచ్చిన రెండు భాగాలు కూడా హిట్టే. ఈ వెబ్ సిరీస్ మూడో భాగం కోసం జనాలు ఎదురు చూస్తున్నారు. IPL 2024 తర్వాత మీర్జాపూర్ మూడవ సీజన్ స్ట్రీమింగ్ తేదీని ప్రకటించవచ్చని టాక్.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు