Ranveer Singh Diamond Necklace Cost : భారీ డైమండ్ నెక్లెస్ ధరించిన రణ్‌వీర్ పై ట్రోలింగ్… దాని ధర తెలిస్తే గుండె జారిపోవాల్సిందే

Ranveer Singh Diamond Necklace Cost : బాలీవుడ్ స్టార్ నటుడు రణ్‌వీర్ సింగ్ తరచుగా వింత వింత ఫ్యాషన్ పోకడలతో వార్తల్లో నిలుస్తూ ఉంటారు. తాజాగా ఆయన ఓ భారీ డైమండ్ నెక్లెస్ ధరించి కన్పించారు. ఈ విషయం ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారగా, ఆ నెక్లెస్ ధరించినందుకు రణ్‌వీర్ ను ట్రోల్ చేస్తున్నారు. ఇక మరికొంత మంది మాత్రం దాని ధర ఎంత ఉంటుందో అని ఆరా తీయడం మొదలు పెట్టారు. అయితే రణ్‌వీర్ ధరించిన డైమండ్ నెక్లెస్ ధర తెలిస్తే గుండె జారిపోవడం ఖాయం.

హైహీల్స్, భారీ డైమండ్ నెక్లెస్ తో రణ్‌వీర్..

ముంబైలో జరిగిన ఓ క్లాసీ గాలాలో రణ్‌వీర్ తాజాగా పాల్గొన్నాడు. కొంతకాలం గ్యాప్ తర్వాత ఆయన బుధవారం ముంబైలో దర్శనం ఇచ్చాడు. దీపికా పదుకొణె భర్త, హీరో రణవీర్ సింగ్ ఆ గాలాలో హైహీల్స్, భారీ డైమండ్ నెక్లెస్ ధరించి కనిపించాడు. వెళ్తూ వెళ్తూ ఆయన ఫోటోగ్రాఫర్లను పలకరించారు. అయితే రణవీర్ సింగ్ నెక్లెస్ ధరించి వెళ్లడంతో అందరి దృష్టి అతని వైపే మళ్లింది. అయితే ఆయన ధరించిన నెక్లెస్ ధర తెలిస్తే బుర్ర తిరగడం మాత్రం పక్కా.

రణవీర్ తెల్లటి శాటిన్ షర్ట్, మ్యాచింగ్ ప్యాంట్‌లో హ్యాండ్సమ్ గా కనిపించాడు. ఆయన ఉబెర్-స్టైలిష్ వైట్ బెల్ట్‌తో తన లుక్ ను పూర్తి చేశాడు. అలాగే బ్లూ సన్ గ్లాసెస్ కూడా ధరించాడు. ఇది ఆయన తెల్లటి దుస్తులకు సరిగ్గా సెట్ అయ్యింది. అయితే నెటిజన్ల దృష్టిని ఆకర్షించింది రణ్‌వీర్ డ్రెస్ లేదా సన్ గ్లాసెస్ కాదు అతను ధరించిన నెక్లెస్.

- Advertisement -

అక్షరాలా 2 కోట్లు..

రణ్‌వీర్‌కి ఆభరణాల కలెక్షన్స్ అంటే చాలా ఇష్టం. తాజాగా ఆయన 2 కోట్ల విలువైన బెస్పోక్ టిఫనీ నెక్లెస్ ధరించి కనిపించారు. ఈ విషయం తెలిసిన నెటిజన్లు ఆ డైమండ్ నెక్లెస్ ధరతో ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ హ్యాపీగా జీవితాంతం బతకొచ్చు అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

ఫ్యాషన్ రూల్స్ బ్రేక్..

ఇక రణవీర్ వేసుకున్న ఆ భారీ నెక్లెస్ తన లుక్‌కి అదనపు గ్లాంను జోడించింది. పురుషులు మందపాటి నెక్లెస్ లు, హై హీల్స్ చాలా తక్కువగా వేసుకుంటారు. కానీ తాజాగా రణ్‌వీర్ వాటినే ధరించి ఫోటోగ్రాఫర్లకు పోజులిచ్చి ఫ్యాషన్ మూస పద్ధతులను బద్దలు కొట్టారు.

రణ్‌వీర్ పై ట్రోలింగ్

కానీ మరికొంత మందికి మాత్రం రణ్‌వీర్ అంతటి భారీ డైమండ్ నెక్లెస్ ధరించడం నచ్చలేదు. అందుకే అలాంటివి అబ్బాయిలు కాదు అమ్మాయిలు వేసుకోవాలని, ముందు గర్భవతిగా ఉన్న నీ భార్యను సరిగ్గా చూసుకో అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

దీపికా పదుకొణె, రణ్‌వీర్ దంపతులు తమ మొదటి బిడ్డ కోసం ఎదురు చూస్తున్న సంగతి తెలిసిందే. రణవీర్, దీపికా తాజాగా సుదీర్ఘమైన, రిలాక్సింగ్ బేబీమూన్ బ్రేక్ తీసుకున్నారు. ఈ జంట బుధవారం ముంబైకి తిరిగి వచ్చారు. ప్రెగ్నెన్సీని ప్రకటించిన తర్వాత, ఈ జంట తల్లి, బిడ్డ ఆరోగ్యంపై దృష్టి పెట్టారు. ఈ ఏడాది సెప్టెంబర్‌లో వారు తమ మొదటి బిడ్డను స్వాగతించనున్నారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు