Jyothika: ఎన్నికలవేళ చిక్కుల్లో పడ్డ స్టార్ హీరోయిన్ జ్యోతిక.. పాపం అంటున్న నెటిజన్స్..!

Jyothika: కోలీవుడ్ స్టార్ హీరో సూర్య భార్య, స్టార్ హీరోయిన్ అయిన జ్యోతిక మనందరికీ సుపరిచితమే. ఈ జంట తమిళ్ ఇండస్ట్రీకి చెందిన ది అయినప్పటికీ తెలుగులో కూడా మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించుకుంది. టాలీవుడ్ ఇండస్ట్రీలో కూడా పలు సినిమాల్లో నటించి మంచి పాపులారిటీ దక్కించుకున్నారు. అదేవిధంగా ఎంతోమంది నూతన దంపతులకి ఆదర్శంగా నిలిచారు. సూర్య ప్రస్తుతం కంగువా అనే సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఇక జ్యోతిక విషయానికి వస్తే.. ఈ బ్యూటీ ఇటీవల సైతాన్ మూవీ తో ప్రేక్షకుల ముందుకి వచ్చింది. ఈ మూవీ బాక్స్ ఆఫీస్ వద్ద సూపర్ హిట్గా నిలిచింది.

కొన్ని సంవత్సరాల తరువాత సైతాన్ మూవీతో రీ ఎంట్రీ ఇచ్చిన జ్యోతికాకి పాపులారిటీ దక్కింది. దీంతో వరుస పెట్టి అవకాశాలు చేసేందుకు రెడీ అయింది జ్యోతిక. ఇక ఇదిలా ఉంటే తాజాగా జ్యోతిక – సూర్య విడాకులు తీసుకోబోతున్నారు అంటూ వార్తలు వినిపిస్తున్న సంగతి తెలిసిందే. ఇక వీటిపై ఈ జంట స్పందించినప్పటికీ ఈ వార్తలకి మాత్రం అడ్డు కట్ట పడడం లేదు. ఇక ఇదిలా ఉంటే తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న జ్యోతిక కొన్ని వ్యాఖ్యలు చేశారు. ఇందులో భాగంగా ఓటు గురించి మాట్లాడి చిక్కుల్లో పడింది.

Star heroine Jyothika got into trouble during the election
Star heroine Jyothika got into trouble during the election

ఇటీవల తమిళనాడులో జరిగిన ఎన్నికల లో ఓటు వేశారా? అని ఆ ‘షో యాంకర్ జ్యోతికా ని ప్రశ్నించగా.. దానికి ఈమె సమాధానం ఇస్తూ.. కొన్నిసార్లు ఆన్లైన్లో ఓట్లు వేశాను. అదేవిధంగా ప్రతి ఏడాది నేను ఓట్లు వేస్తూనే ఉంటున్నాం… అంటూ సమాధానం ఇచ్చింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో.. తాజాగా నటి కస్తూరి ట్విట్టర్ వేదికగా స్పందించింది. ” మాలాంటి వారు మొత్తం ఎండల్లో రోజంతా నిలబడి ఓట్లు వేశాము. అదేవిధంగా అమెరికా ప్రయాణాలు ఉంటే ఫ్లైట్ కూడా క్యాన్సిల్ చేసుకున్నాము. అలా వేరే డేట్స్ కి మార్చుకుని మరి మేము ఓటును వినియోగించుకున్నాము. కానీ జ్యోతిక గారు మాత్రం ఫోన్లో చాలా ఈజీగా ఇంట్లో కూర్చుని వేసేస్తున్నారు. అందరికీ ఒకేలాగా న్యాయం జరగాలి” అంటూ ఫైర్ అయ్యింది కస్తూరి.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు