Vijayashanti: మళ్లీ పెళ్లి.. ఆగిపోవడానికి కారణం..?

Vijayashanti.. లేడీ అమితాబ్ గా తెలుగు చలనచిత్ర పరిశ్రమలో పేరు దక్కించుకున్న నటి విజయశాంతి గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు. ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో ఎంతోమంది హీరోలకు పోటీ ఇస్తూ.. ఆ హీరోలతో సమానంగా పారితోషకం తీసుకొని మరింత క్రేజ్ సొంతం చేసుకుంది. ముఖ్యంగా లేడీ ఓరియంటెడ్ చిత్రాలతో.. స్టార్ హీరోల సినిమాలతో సమానంగా బాక్సాఫీస్ వద్ద కలెక్షన్లు సాధించి రికార్డు నెలకొంది ఈ ముద్దుగుమ్మ.. అందుకే విజయశాంతి సినిమాలంటే బాక్సాఫీస్ వద్ద కలెక్షన్లను సొంతం చేసుకోవడమే కాదు హీరో రేంజ్ లో గుర్తింపును కూడా అందిస్తూ ఉంటాయి. ఇదిలా ఉండగా విజయశాంతి వ్యక్తిగత జీవిత విషయానికి సంబంధించి.. అప్పుడప్పుడు వార్తల్లో నిలుస్తూ ఉంటుంది. ఎం.వి. శ్రీనివాస్ ప్రసాద్ అనే వ్యక్తిని వివాహం చేసుకున్న విషయం తెలిసిందే.

Vijayashanti: Remarriage.. Reason for stopping..?
Vijayashanti: Remarriage.. Reason for stopping..?

రీ ఎంట్రీ ఇచ్చింది కానీ..

ఇక పెళ్లయ్యాక కూడా సినిమాలలో కొనసాగింది. అయితే ప్రస్తుతం రాజకీయాల్లో బిజీగా ఉన్న ఈమె కాంగ్రెస్లో కొనసాగుతోంది. ఒకప్పుడు లేడీ ఓరియంటెడ్ చిత్రాలతో పాటు స్టార్ హీరోల చిత్రాలలో కూడా నటించి భారీ క్రేజ్ సొంతం చేసుకున్న విజయశాంతి.. ఆ తర్వాత ఉన్నట్టుండి సినిమాలకు దూరమయింది.. అలా మహేష్ బాబుతో సరిలేరు నీకెవ్వరు సినిమా ద్వారా రీ ఎంట్రీ ఇచ్చింది.. కానీ మరే సినిమాలో కూడా నటించలేదు.. ఇటీవలే చిరంజీవి సినిమాలో మళ్లీ అవకాశాన్ని దక్కించుకుంది అంటూ వార్తలు వినిపించాయి.. కానీ అందులో నిజం లేకపోయింది. ఇదంతా ఇలా అండగా ఈమె వ్యక్తిగత జీవితానికి సంబంధించిన ఒక వార్త ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారుతోంది. అదేమిటంటే గతంలో ఈమె నందమూరి కుటుంబానికి అత్యంత దగ్గర బంధువైన శ్రీనివాస ప్రసాద్ ను వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. అయితే ఆయనకు విడాకులు ఇచ్చి ఆమె మరొక హీరోని వివాహం చేసుకోబోతోంది అంటూ అప్పట్లో ఒక వార్త చక్కర్లు కొట్టింది.

మళ్లీ పెళ్లి..

ఆ హీరో ఎవరో కాదు బాలకృష్ణ.. నిజానికి బాలకృష్ణ, విజయశాంతి ఎన్నో సినిమాలు చేశారు. వీరిద్దరి కాంబినేషన్ కూడా తెరపై అద్భుతంగా పండింది. ఇక వీరిద్దరి మధ్య ఉన్న కెమిస్ట్రీ చూసి అందరూ వీరు వివాహం చేసుకుంటారని అనుకున్నారు. అయితే సడన్గా బాలకృష్ణ దగ్గరుండి విజయశాంతి వివాహం జరిపించడంతో ఆ వార్తలు కాస్త సద్దుమణిగాయి.. అయితే కొన్నాళ్లకు మళ్ళీ బాలకృష్ణతో ఆమె కనిపించడం చూసి బాలకృష్ణ పైన ప్రేమను ఆమె చంపుకోలేకపోతుందని.. అందుకే తన భర్తను విడిచి బాలకృష్ణని వివాహం చేసుకోబోతుందంటూ వార్తలు వినిపించాయి..

- Advertisement -

రూమర్స్ పై క్లారిటీ..

కానీ ఇందులో ఏమాత్రం నిజం లేదని ప్రముఖ సీనియర్ జర్నలిస్టు ఇమంది రామారావు ఒక ఇంటర్వ్యూలో వెల్లడించారు.. ఇమంది రామారావు మాట్లాడుతూ.. బాలకృష్ణ, విజయశాంతి కేవలం స్క్రీన్ వరకు మాత్రమే సన్నిహితంగా ఉండేవాళ్ళు.. నిజజీవితంలో వారిద్దరి మధ్య ఎలాంటి రిలేషన్ లేదు అంటూ క్లారిటీ ఇచ్చారు. మొత్తానికైతే మళ్లీ పెళ్లి అన్న వార్తలకు ఇమంది రామారావు చెక్ పెట్టారని చెప్పవచ్చు. ప్రస్తుతం రాజకీయాల్లో బిజీగా ఉన్న విజయశాంతి.. మళ్ళీ సినీ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టాలని అభిమానులు కోరుకుంటున్నారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు