Sridevi: అతిలోక సుందరిని ప్రేమించి.. తన చెల్లిని వివాహం చేసుకోవాలనుకున్న స్టార్ హీరో ఎవరో తెలుసా..!

Sridevi: అందాల అతిలోక సుందరి అనగానే మనందరికీ ముందుగా గుర్తుకొచ్చే పేరు శ్రీదేవి. ఆమె అందం గురించి వర్ణించడానికి సరైన పదాలు దొరకవని చెప్పుకోవచ్చు. మత్తెక్కించే కళ్ళతో.. తళుక్కుమనే అందంతో ఈ బ్యూటీ ఆ తరానినే కాకుండా నేటి జనరేషన్ ని కూడా ఆకట్టుకుంటుంది. ప్రస్తుతం ఈమె మన మధ్య లేకపోయినప్పటికీ ఈమె ఫొటోస్ కి, ఈమె సినిమాస్ కి ఎంతోమంది అభిమానులు ఏర్పడ్డారు. కానీ ఇటువంటి నటి ప్రస్తుతం మన మధ్య లేదని చాలామంది అనేక సందర్భాలలో బాధపడుతూ ఉంటారు అభిమానులు.

అయితే ఈ నటికి సంబంధించిన ఓ న్యూస్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఆ రోజుల్లో శ్రీదేవి అంటే చాలామంది హీరోలతో పాటు ఫ్యాన్స్‌కు చాలా ఇష్టం. కానీ ఆమెను పెళ్లి చేసుకోవడానికి ఎవరు అంతగా ఇంట్రెస్ట్ చూపించేవారు కాదు. అయితే ఓ స్టార్ హీరో మాత్రం శ్రీదేవిని ప్రేమించి అనంతరం ఆమె చెల్లిని పెళ్లి చేసుకోవాలనుకున్నాడట. ఇంతకీ ఆ స్టార్ హీరో ఎవరు? ఆ విషయాలు ఏంటో? ఇప్పుడు తెలుసుకుందాం. ఆ సూపర్ స్టార్ హీరో మరెవరో కాదు రజినీకాంత్. రజనీకాంత్ కు శ్రీదేవికి మధ్య మంచి స్నేహం ఉండేది. వీరు ఉండే విధానం చూస్తే చాలా మంది వీరు ప్రేమలో ఉన్నారు అని అనుకునే వారట. ఇక త్వరలోనే పెళ్లి చేసుకుంటారు ఏమో అని గుసగుసలు కూడా వినిపించేయట.

the star hero who fell in love with the heavenly beauty and wanted to marry his sister
the star hero who fell in love with the heavenly beauty and wanted to marry his sister

కానీ అలాంటి వారికి ఊహించని ట్విస్ట్ ఇచ్చాడు రజినీకాంత్. ఆయన శ్రీదేవిని కాకుండా తన చెల్లిని పెళ్లి చేసుకోవాలనుకున్నాడు అంటూ ప్రస్తుతం ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ప్రముఖ జర్నలిస్ట్ ఓ ఇంటర్వ్యూలో పాల్గొని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.‌” నేను కొన్ని రోజులు శ్రీదేవి ఇంట్లో పని చేశాను. వారింటికి అప్పుడప్పుడు రజనీకాంత్ వస్తు ఉండేవాడు. దీంతో వారందరూ సూపర్ స్టార్ శ్రీదేవిని పెళ్లి చేసుకుంటాడు అనుకునేవారు. కానీ వీరి పెళ్లి జరగలేదు. అయినా తన చెల్లిని పెళ్లి చేసుకోవాలి అనుకున్నాడు. ఈ విషయం తెలియడంతో శ్రీదేవి ఫ్యామిలీ రజినీకాంత్ కు దూరంగా ఉండటం ప్రారంభించింది” అంటూ చెప్పుకొచ్చారు. ప్రస్తుతం ఈయన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు