Ajay Ghosh: ఆ అబ్బాయి కోసం మాత్రమే నేను ఈ ప్రోగ్రాం కి హాజరయ్యాను.. పుష్ప విలన్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!

Ajay Ghosh: తెలుగు ఇండస్ట్రీలో అనేక సినిమాలో పవర్ఫుల్ క్యారెక్టర్స్ చేస్తూ తనదైన రీతిలో ప్రేక్షకులను సంపాదించుకున్నాడు అజయ్ ఘోష్. అల్లు అర్జున్ పుష్ప సినిమాలో విలన్ గా నటించి మంచి ప్రశంసలు దక్కించుకున్నారు. అదేవిధంగా గుంటూరు కారం , మంగళవారం, బెదురులంక 2012 వంటి చిత్రాల్లో కూడా నటించి ఆకట్టుకున్నారు.

అయితే ఇటీవల వృషభ అనే సినిమా ట్రైలర్, లిరికల్ సాంగ్ లాంచ్ కార్యక్రమంలో పాల్గొని ఆసక్తికర కామెంట్స్ చేశారు. ఇక ఇదే క్రమంలో అజయ్ ఘోష్ మాట్లాడుతూ..” జేపీ(జయప్రకాశ్ రెడ్డి) గారి కుమార్తె మల్లికా రెడ్డి గారి కోసం మాత్రమే నేను ఈ ప్రోగ్రాం కి వచ్చాను. మట్టి వాసనతో కూడిన కథ ఇది.

Pushpa villain interesting comments
Pushpa villain interesting comments

ట్రైలర్.. నాచురల్ గా చాలా బాగుంది. ఇలాంటి కథలతో సినిమాలు మార్కెట్లో చేయాలని కోరుకుంటూ ఈ టీం అందరికీ నా శుభాకాంక్షలు ” అంటూ తెలిపారు. ప్రస్తుతం ఈయన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇక దీనిని వీకే మూవీస్ అండ్ శ్రీ జేపీ ప్రొడక్షన్స్ పతాకంపై జీవన్ రెడ్డి, అలేఖ్య జంటగా ఉమా శంకర్ రెడ్డి నిర్మిస్తుండగా.. మల్లికా రెడ్డి కో ప్రొడ్యూసర్ గా రూపొందిస్తున్న మూవీ ఇది. ఇక ఈ మూవీకి అశ్విన్ కామరాజ్ దర్శకత్వం వహించారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు