Deepika Padukone and Ranveer Singh Divorce : డివోర్స్ రూమర్లకు చెక్ పెట్టిన రణ్వీర్… అసలేం జరిగిందంటే?

Deepika Padukone and Ranveer Singh Divorce : గత రెండు రోజుల నుంచి పాపులర్ బాలీవుడ్ కపుల్ దీపికా పదుకొనే, రణ్వీర్ సింగ్ విడాకులు తీసుకోబోతున్నారు అనే వార్తలు సోషల్ మీడియాలో సంచలనంగా మారాయి. తాజాగా ఆ వార్తలకు ఫుల్ స్టాప్ పెట్టారు రణ్వీర్ సింగ్.

దీపికా పదుకొనే, రణవీర్ సింగ్ దంపతులు త్వరలోనే తమ మొదటి బిడ్డకు తల్లిదండ్రులు కాబోతున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం గర్భవతిగా ఉన్న దీపికా పదుకొనే సినిమాల నుంచి బ్రేక్ తీసుకొని రెస్ట్ మోడ్ లో ఉంది. బేబీ మూన్ కోసం ఆమె ఏకంగా ఈసారి మెట్ గాలా 2024ని స్కిప్ చేసి తన భర్తతో సరదాగా గడుపుతోంది. దానికి సంబంధించిన ఓ ఫోటో బయటకు రాగా వైరల్ అయింది. అయితే ఆ తర్వాత మరికొన్ని గంటల్లోనే రణవీర్ సింగ్ సోషల్ మీడియా ఖాతాలో వాళ్ళ పెళ్లికి సంబంధించిన ఫోటోలు మాయమవ్వడంతో ఒక్కసారిగా దీపిక రణవీర్ జంట విడాకులు తీసుకోబోతున్నారనే రూమర్లు గుప్పుమన్నాయి.

తాజాగా తన డివోర్స్ వార్తలపై స్పందించిన రణవీర్ అలాంటిదేమీ లేదంటూ క్లారిటీ ఇచ్చారు. రణ్వీర్ తామిద్దరం సంతోషంగా ఉన్నామని చెబుతూ డివోర్స్ రూమర్లకు ఫుల్ స్టాప్ పెట్టారు. అయితే దీపికతో ఉన్న ఫోటోలే కాకుండా 2022- 23 మధ్య పోస్ట్ చేసిన ఫోటోలు అన్ని డిలీట్ అయ్యాయని ఆయన వెల్లడించారనే వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. కానీ నిజం ఏమిటంటే రణవీర్ సింగ్ తన మ్యారేజ్ ఫోటోలతో పాటు 2023 కు ముందు ఉన్న మొత్తం కంటెంట్ ను డిలీట్ చేయకుండా ఆర్కైవ్ చేశారని ఆయన టీమ్ స్పష్టం చేసింది.

- Advertisement -

తాజాగా మరోసారి రణ్వీర్ సింగ్ ముంబైలో జరిగిన లగ్జరీ జ్యువెలరీ బ్రాండ్ లాంచ్ సందర్భంగా తన పెళ్లి, నిశ్చితార్థపు ఉంగరాలను చూపిస్తూ డివోర్స్ రూమర్లపై క్లారిటీ ఇచ్చారు. కెమెరాల ముందు తన ఎడమ చేతిని ఎత్తి చూపిస్తూ నాకు ఇష్టమైన ఉంగరాలలో ఇది కూడా ఒకటి. అందులో ఒకటి నా మ్యారేజ్ రింగ్. నా భార్య నాకు బహుమతిగా ఇచ్చింది. మరొకటి ప్లాటినం ఎంగేజ్మెంట్ రింగ్. ఆ తర్వాత మా అమ్మ డైమండ్ చెవి పోగులు, మా అమ్మమ్మ ముత్యాలు అంటే కూడా ఇష్టం అంటూ రణవీర్ సింగ్ ఫుల్ క్లారిటీ ఇచ్చేశారు.

మొత్తానికి ఒక్కసారిగా వైరల్ అయిన రణవీర్, దీపిక డివోర్స్ వార్తలు కేవలం రూమర్లే అని తెలియడంతో వాళ్ల అభిమానులు ఇప్పుడు హాయిగా ఊపిరి పీల్చుకుంటున్నారు. కాగా ఈ ఏడాది సెప్టెంబర్ లో దీపికా పదుకొనే, రణవీర్ సింగ్ తమ ఫస్ట్ బేబీని స్వాగతించే అవకాశం ఉంది. ప్రస్తుతం రణవీర్ సింగ్ డాన్ సీక్వెల్ లో నటిస్తుండగా, మరోవైపు దీపికా పదుకొనే సింగం ఎగైన్, కల్కి సినిమాలో నటించి, ఇప్పుడు రెస్ట్ తీసుకుంటుంది. కాగా ఐదేళ్లకు పైగా డేటింగ్ చేశాక, వీరిద్దరి మ్యారేజ్ పెద్దల ఆశీర్వాదంతో 2018లో ఇటలీలోని లేక్ మోమోలో గ్రాండ్ గా జరిగిన విషయం తెలిసిందే.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు