Gangs of Godavari: గ్యాంగ్ అఫ్ గోదావరి రిలీజ్ డేట్ లో మార్పు !

టాలీవుడ్ స్టార్ హీరోలలో విశ్వక్ సేన్ ఒకరు. ఈ టాలెంటెడ్ యంగ్ హీరో గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఫలక్నామ్ దాస్ సినిమాతో బంపర్ హిట్ అందుకున్న విశ్వక్ సేన్… ఆ తర్వాత టాలీవుడ్ ఇండస్ట్రీలో టాప్మోస్ట్ హీరోగా మారిపోయాడు. అచ్చం జూనియర్ ఎన్టీఆర్ లా కనిపించే విశ్వక్… తన కెరీర్లో ఆల్మోస్ట్ అన్ని సినిమాలను విజయవంతం చేసుకున్నాడు.

ఇక ఇప్పుడు గ్యాంగ్ సాఫ్ గోదావరి అనే వైవిద్యమైన సినిమాతో అలరించడానికి సిద్ధమయ్యాడు. ఈ సినిమాలో విశ్వక్ మాస్ యాంగిల్ చూపించేలా గ్యాంగ్ స్టార్ పాత్రలో చూపించేలా గ్యాంగ్ స్టార్ పాత్రలో కనిపించనున్నారు.

ఇక ఇటీవల గ్యాంగ్ ఆఫ్ గోదావరి సినిమా నుంచి వరుసగా అప్డేట్లు వచ్చిన సంగతి తెలిసిందే. యూట్యూబ్ లోను ఈ సినిమాకు సంబంధించిన మెలోడీ సాంగ్స్ వైరల్ గా మారుతున్నాయి. గ్యాంగ్ ఆఫ్ గోదావరి సినిమాలో అందాల భామ నేహా శెట్టి హీరోయిన్గా నటిస్తున్న సంగతి మనందరికీ తెలిసిందే. అలాగే టాలెంటెడ్ హీరోయిన్ అంజలి ఓ కీలక పాత్ర చేస్తున్నారట. సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ పథకాలపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమాను తెరకెక్కిస్తున్నారు.

- Advertisement -

అయితే ఈ సినిమాను మే 17వ తేదీన అంటే మరో వారం రోజుల్లోనే ఈ సినిమాను రిలీజ్ చేయాలని అనుకున్నారు. అయితే తాజాగా ఈ సినిమా రిలీజ్ డేట్ పై చిత్ర బృందం వెనక్కి తగ్గింది. రిలీజ్ డేట్ మార్చుతూ కీలక ప్రకటన చేసింది చిత్ర బృందం. మే 31వ తేదీన గ్యాంగ్ ఆఫ్ గోదావరి సినిమాను రిలీజ్ చేసేందుకు సిద్ధమైందట. ఈ మేరకు అధికారిక ప్రకటన చేసింది చిత్ర బృందం.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు