Ram Charan: ‘గేమ్ ఛేంజర్’ సినిమా విడుదలకు బ్రేక్‌?

Ram Charan: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇండస్ట్రీలో మెగా వారసుడిగా, టాప్ మోస్ట్ హీరోగా కొనసాగుతున్నారు రామ్ చరణ్. ప్రస్తుతం మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గేమ్ చేంజర్ సినిమాతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ఈ సినిమా విజనరీ దర్శకుడు శంకర్ దర్శకత్వంలో రూపొందుతోంది. ఈ సినిమాలో రామ్ చరణ్ డ్యూయల్ రోల్ చేస్తున్నారని మొదటి నుంచి ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే.

అలాగే హీరో రామ్ చరణ్ సరసన బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ హీరోయిన్గా నటిస్తోంది. అంతేకాకుండా శ్రీకాంత్, అంజలి, సునీల్ లాంటి కీలక నటులు ఇందులో నటిస్తున్నారు. దిల్ రాజు ఈ భారీ బడ్జెట్ సినిమాను నిర్మిస్తున్నారు. తమన్ సంగీతం అందిస్తున్న సంగతి మనందరికీ తెలిసిందే. పాన్ ఇండియా లెవెల్లో ఈ సినిమా రిలీజ్ అవుతున్న నేపథ్యంలో… ఫ్యాన్స్ అందరూ ఎంతో ఆత్రుతగా ఈ సినిమా కోసం చూస్తున్నారు.

చాలా రోజులుగా ఈ సినిమా షూటింగ్ జరుగుతోంది. రకరకాల కారణాల వల్ల మధ్యలో షూటింగ్ ఆగిపోయిన సంగతి తెలిసిందే. అయితే రామ్ చరణ్ నటిస్తున్న ఈ గేమ్ చేంజర్ సినిమా గురించి సోషల్ మీడియాలో ఒక వార్త వైరల్ గా మారింది. గేమ్ చేంజర్ సినిమా విడుదల మరింత ఆలస్యం కానున్నట్లు ఈ వార్త సారాంశం. శంకర్ దర్శకత్వంలో రామ్ చరణ్ నటిస్తున్న గేమ్ చేజర్ సినిమా విడుదల మరింత ఆలస్యం కానున్నట్లు సమాచారం అందుతుంది.

- Advertisement -

సెప్టెంబర్ మాసంలో విడుదల కావాల్సిన ఈ సినిమాను డిసెంబర్ మాసానికి వాయిదా వేయనున్నారట. దర్శకుడు శంకర్ భారతీయుడు 2 సినిమా పనుల్లో బిజీగా ఉండటం, ఇతర కారణాల వల్ల గేమ్ చేంజర్ సినిమాను వాయిదా వేయాలని అనుకుంటున్నారట. అయితే దీనిపై చిత్ర బృందం స్పష్టత ఇవ్వాల్సి ఉంది. త్వరలోనే దీనిపై క్లారిటీ ఇచ్చే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయని టాలీవుడ్ ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు