6 years for Mahanati : సినిమాను కాదు జీవితాన్ని ఆవిష్కరించాడు

6 years for Mahanati: వైజయంతి మూవీస్ ఈ బ్యానర్ కి ఉన్న ప్రత్యేకత గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. జగదేకవీరుడు అతిలోకసుందరి వంటి సూపర్ హిట్ సినిమా ఈ బ్యానర్ నుంచి వచ్చింది. ఈ బ్యానర్లో ఇలాంటి సినిమాలు ఎన్నో వచ్చాయి. అయితే కొందరికి కొంతకాలం ఒక బ్యాడ్ ఫేజ్ నడుస్తుంది అని చెప్పొచ్చు. అలా వైజయంతి మూవీ బ్యానర్ కూడా కొంతకాలం పాటు బ్యాడ్ ఫేజ్ నడిచింది. ఒక టైం లో ఈ బ్యానర్ లో వచ్చిన సినిమాలేవి వర్కౌట్ అయ్యేవికావు. మెహర్ రమేష్ దర్శకత్వంలో ఎన్టీఆర్ హీరోగా చేసిన శక్తి సినిమా అయితే అశ్వని దత్ ను కోలుకోలేని లోతులోకి తోసేసింది. ఆ బ్యానర్ లో సినిమాలు తీయడం ఆపేద్దామని దాదాపు ఫిక్స్ అయ్యారు నిర్మాత అశ్వని దత్.

అదే టైంలో వాళ్ల పిల్లలు ప్రియాంక దత్, స్వప్న దత్ ఒక సినిమా డాడీ కథ మాకు బాగా నచ్చింది ఈ సినిమా తీసి ఆపేద్దాం అని అశ్విని దత్ ను రిక్వెస్ట్ చేశారు. సరే ఇన్ని కోట్లు పోయాయి కదా ఇంకో మూడు నాలుగు కోట్లు పోతే ఏముంది అనుకొని అశ్వని దత్ కూడా సరే అని ఆ సినిమాని చేయమన్నారు. అయితే అదే సినిమా స్వప్న సినిమాస్ బ్యానర్ లో నిర్మితమైంది. ఆ సినిమా పేరు ఎవడే సుబ్రహ్మణ్యం. ఈ సినిమా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. వైజయంతి బ్యానర్ ముగిసిపోయింది కోలుకోవడానికి చాలా టైం పడుతుంది అనుకునే టైంలో ఒక అద్భుతమైన సినిమాను తెరకెక్కించారు దత్ సిస్టర్స్.

ఎవడే సుబ్రహ్మణ్యం తర్వాత మళ్లీ వాళ్ళు వెనక్కి తిరిగి చూసుకోవలసిన అవసరం రాలేదు. కేవలం ఈ ఒక్క సినిమాతో చాలామంది జీవితాలు వెలుగులోకి వచ్చాయని చెప్పొచ్చు. ఈ సినిమాతోనే తెలుగు సినిమా ఇండస్ట్రీకి ఒక అద్భుతమైన దర్శకుడు దొరికాడు. అతనే నాగ్ అశ్విన్. నాగ్ అశ్విన్ గురించి కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు తను తీసిన మహానటి సినిమా ఎంత పెద్ద హిట్ అయిందో మనకు తెలియంది కాదు. దాదాపు తెలుగు ప్రేక్షకులంతా సినిమాలు చూడటం మానేశారు అనుకున్న తరుణంలో ఒక గొప్ప సినిమా తీస్తే ఆడియన్స్ థియేటర్ కి పరుగులు పెడతారు అని నిరూపించిన సినిమా మహానటి.

- Advertisement -

మొదట మహానటి సావిత్రి గారి పాత్రలో కీర్తి సురేష్ కనిపిస్తున్నారని చెప్పినప్పుడు చాలామంది విమర్శించారు. ఒక తెలుగు నటి బయోపిక్ చేయడం కోసం మలయాళం హీరోయిన్ తీసుకోవటం ఏంటి అని విమర్శలు కూడా చేశారు. అయితే వీటన్నిటికీ కేవలం ఫస్ట్ లుక్ తోనే సమాధానం చెప్పాడు నాగ్ అశ్విన్. ఆ తర్వాత ఈ సినిమా నుంచి రిలీజ్ అయిన టీజర్ ట్రైలర్ అన్ని కూడా పర్ఫెక్ట్ ఛాయిస్ అని అనిపించాయి. కీర్తి సురేష్ ఈ సినిమాలో నటించలేదు ఏకంగా సావిత్రమ్మ కీర్తి సురేష్ లోకి పూనారు అని చాలా ప్రశంసలు కూడా వచ్చాయి.

స్త్రీ కి ప్రాముఖ్యత ఉన్న సినిమాలు రావడం ఆగిపోయిన ఈ తరుణంలో ఒక స్త్రీ కథను బయోపిక్ గా తీసి థియేటర్ వద్ద అద్భుతమైన కలెక్షన్స్ సాధించాడు నాగ్ అశ్విన్. ప్రస్తుతం నాగ్ అశ్విన్ నుంచి వచ్చే సినిమా కోసం ప్రపంచవ్యాప్తంగా ఆడియన్స్ ఎదురుచూస్తున్నారంటే దానికి కారణం దీనికంటే ముందు నాగ్ అశ్విన్ చేసిన రెండు సినిమాలని చెప్పొచ్చు. ఈ రెండు సినిమాలు కూడా వేటికవి ప్రత్యేకమని చెప్పొచ్చు. మహానటి సాధించిన విజయం మామూలుది కాదు. ఈ సినిమాలో ముఖ్యంగా సాయి మాధవ్ బుర్ర రాసిన డైలాగ్స్ అలానే ఈ కథను చూపించిన విధానం చాలామందికి కళ్ళల్లో నీళ్లు తెప్పించింది. నేటికీ ఈ సినిమా రిలీజై ఆరేళ్లు పూర్తిచేసుకుంది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు