VD 14: నేడు విజయ్ దేవరకొండ పుట్టినరోజు సందర్భంగా వరుస పెట్టి తన కొత్త సినిమాల పోస్టర్స్ మరియు అనౌన్స్మెంట్ వస్తూనే ఉన్నాయి. ఈ క్రమంలోనే విజయ్ దేవరకొండ కొత్త సినిమాల పోస్టర్లు సోషల్ మీడియాలో హోరెక్కిస్తున్నాయి. నేడు ఒక జాతర లాగా కనిపిస్తుంది. రౌడీ ఫ్యాన్స్ కి ఈరోజు పండగనే చెప్పుకోవచ్చు.
వరస పెట్టి కొత్త సినిమాల పోస్టర్లను విడుదల చేస్తూ రౌడీ ఫ్యాన్స్ కి ఫుల్ మీల్స్ పెడుతున్నారు మేకర్స్. ఇక కొద్దిసేపటికితమే విజయ్ కొత్త పోస్టర్ అనౌన్స్ చేస్తూ.. కత్తి నేనే, నెత్తురు నాదే, యుద్ధం నాతోనే అనే క్యాప్షన్ ని జోడించి సోషల్ మీడియాని షేక్ చేశారు. ఇక ఇది విడుదల 24 గంటలు గడవకముందే మరో సరికొత్త పోస్టర్ని విడుదల చేశారు మేకర్.
![VD 14 poster viral](https://www.telugu.filmify.in/wp-content/uploads/2024/05/MixCollage-09-May-2024-11-4-1.gif)
” The legend of the cursed land ” అనే ట్యాగ్ జోడించి ఈ సరికొత్త మూవీ పోస్టర్ ని విజయ్ దేవరకొండ తన ఎక్స్ ఖాతాలో షేర్ చేశాడు. ప్రస్తుతం ఈ పోస్టర్ సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ అవుతుంది. ఈ పోస్టర్ను చూసిన పలువురు.. ఈరోజు ఒక పెద్ద పండగ లాగా ఉంది. ఇది విజయ్ దేవరకొండ పుట్టినరోజు కాదు? జాతర? ఈరోజు సోషల్ మీడియా మొత్తం విజయ్ అన్న ఊసే వినిపిస్తుంది.. అంటూ కామెంట్స్ చేస్తున్నారు.
‘The Legend of the Cursed Land’
Rahul Sankrityan X Vijay Deverakonda @MythriOfficial pic.twitter.com/estyTYSUrj
— Vijay Deverakonda (@TheDeverakonda) May 9, 2024