Rashmika Mandanna New Movie : మురుగదాస్ దర్శకత్వంలో రష్మిక…. హీరో ఎవరంటే?

Rashmika Mandanna New Movie : నేషనల్ క్రష్ రష్మిక మందన్న కెరీర్ జెట్ స్పీడ్ తో  దూసుకుపోతోంది. కన్నడ చిత్రసీమలో హీరోయిన్ గా పరిచయం అయిన ఆమె ఇప్పుడు తెలుగు, తమిళ, హిందీ భాషల్లో పాపులర్ నటి. మోస్ట్ వాంటెడ్ పాన్ ఇండియా హీరోయిన్. అందుకే ప్రస్తుతం హిందీలో పెద్ద పెద్ద స్టార్స్ తో నటించే అవకాశం రష్మిక మందన్నకు అందుతోంది. బాలీవుడ్ స్టార్ నటుడు రణబీర్ కపూర్ నటించిన ‘యానిమల్’ సినిమా సూపర్ డూపర్ హిట్. ఇప్పుడు మరో బాలీవుడ్ సూపర్‌ స్టార్‌తో నటించే అవకాశం దక్కించుకుంది రష్మిక మందన్న.

సల్మాన్ తో రష్మిక రొమాన్స్..

బాలీవుడ్ ఖాన్ త్రయంలో ఒకరైన సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ నెక్స్ట్ మూవీలో రష్మిక మందన్న కథానాయికగా సెలెక్ట్ అయ్యిందన్న వార్త వైరల్ అవుతోంది. సల్మాన్ ఖాన్‌తో సినిమా చేయడానికి పలువురు స్టార్ హీరోయిన్లు వరుసలో ఉన్నారు. కానీ సల్మాన్ ఖాన్ మాత్రం ఫ్రెష్ జోడీ కావాలనే ఉద్దేశంతో రష్మిక మందన్నతో స్క్రీన్ షేర్ చేసుకోవాలని అనుకుంటున్నట్టు సమాచారం.

సికందర్ లో ఫ్రెష్ జోడీ..

సల్మాన్ ఖాన్ ‘సికందర్’ అనే యాక్షన్ థ్రిల్లర్ చిత్రంలో నటించనున్న విషయం తెలిసిందే. ఈ చిత్రాన్ని సల్మాన్ ఖాన్ సన్నిహితుడు సాజిద్ నదియావాలా నిర్మిస్తున్నారు. తమిళ స్టార్ డైరెక్టర్ మురుగదాస్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించనున్నారు. భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో రష్మిక మందన్న కథానాయికగా నటిస్తోంది. మురుగదాస్ అనుభవము, ప్రతిభ ఉన్న దర్శకుడు. ప్రస్తుతం వరుస డిజాస్టర్లతో సతమతం అవుతున్న సల్మాన్ ఖాన్‌కు ఎలాగైనా హిట్ సినిమా ఇవ్వాలనే పట్టుదలతో ఉన్నారు.

- Advertisement -

కాగా ఈ సినిమాలో హీరోయిన్ పాత్రకు మంచి ప్రాధాన్యత ఉంటుందని సమాచారం. కథ మేరకు రష్మిక అయితే సెట్ అవుతుందని భావించిన దర్శకుడు ఏఆర్‌ మురుగదాస్‌ ఆమెనే హీరోయిన్ గా సెలెక్ట్ చేసుకున్నాడని తెలుస్తోంది. అంతేకాకుండా ఈసారి సల్మాన్‌ ఖాన్‌ సరసన కొత్త హీరోయిన్‌ని ప్రయత్నించాలని నిర్ణయించుకున్న తర్వాత రష్మిక మందన్నను ఎంపిక చేశారు. రష్మిక మందన్నకు కూడా కథ బాగా నచ్చిందని సమాచారం. గ్రేట్ ఫుల్ అండ్ హానర్డ్ అంటూ ఈ మూవీ సెట్స్ లో జాయిన్ అవ్వడానికి ఉత్సాహాన్ని వ్యక్తం చేసింది రష్మిక.

రష్మిక లైనప్..

ప్రస్తుతం రష్మిక మందన్న ‘పుష్ప 2’ సినిమాలో నటిస్తోంది. అంతే కాకుండా తెలుగులో ‘గర్ల్‌ఫ్రెండ్’ సినిమాలో కూడా నటిస్తున్నాడు. మరోవైపు విజయ్ దేవరకొండతో కొత్త సినిమాలో నటిస్తోంది. ఇంకో తమిళ సినిమాకు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. బాలీవుడ్ స్టార్ టైగర్ ష్రాఫ్ కొత్త సినిమాలో రష్మికనే హీరోయిన్. ఇప్పుడు సల్మాన్ ఖాన్ సినిమాలో కూడా రష్మికనే హీరోయిన్.

పదేళ్ళ తరువాత సల్మాన్, సాజిద్ కాంబో రిపీట్

2014లో కిక్ బ్లాక్‌బస్టర్ విజయం సాధించిన తర్వాత సల్మాన్ ఖాన్, సాజిద్ నడియాడ్‌ వాలా కాంబో రిపీట్ కావడానికి ఏకంగా పదేళ్ళు పట్టింది. ఎన్నో ప్రాజెక్ట్ ల కోసం చర్చలు జరగ్గా, చివరికి సికందర్ వీళ్లిద్దరిని మళ్ళీ కలిపింది. ఈ చిత్రం జూన్‌లో లో సెట్స్‌పైకి వెళ్తుంది. ప్రీ-ప్రొడక్షన్ వర్క్ ఇప్పటికే ప్రారంభమైంది. లొకేషన్ల వేట మొదలైంది. సికందర్ కు ప్రీతమ్ సంగీతం అందిస్తున్నారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు