22 Years Of Santosham : నాగార్జున “సంతోషా”నికి 22ఏళ్ళు.. ఫెయిల్యూర్స్ తర్వాత అభిమానులకి ‘ఫ్యామిలీ’ మీల్స్..

20 Years Of Santosham : టాలీవుడ్ కింగ్ నాగార్జున హీరోగా నటించిన క్లాసిక్ మూవీ “సంతోషం” గురించి తెలుగు ప్రేక్షకులకి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈ సినిమా ఇప్పటికి టివి ల్లో మంచి రేటింగ్స్ తెచ్చుకుంటుంది. వరుస ఫెయిల్యూర్స్ లో ఉన్న నాగార్జున కి మంచి బూస్టప్ ఇచ్చి బ్లాక్ బస్టర్ ఇచ్చింది ఈ సినిమా. దశరథ్ దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం 2002 మే 9న విడుదలై ఘన విజయం సాధించింది. అంటే నేటికీ 22 ఏళ్ళు పూర్తి చేసుకుంది. ఈ సందర్బంగా సంతోషం చిత్ర విశేషాలని కొన్ని గుర్తు చేసుకుందాం. టాలెంట్ ఉన్న దర్శకులకి ఛాన్స్ ఇవ్వడంలో అక్కినేని నాగార్జున ఎప్పుడు ముందే ఉంటారు. అలా “సంతోషం” సినిమా ద్వారా దశరథ్ అనే ఓ కొత్త దర్శకుడిని ఇండస్ట్రీకి పరిచయం చేశారు నాగ్. వరుస ఫెయిల్యూర్స్ తో ఉన్న నాగ్ ఏకంగా అతనికోసం ఓ ఎనిమిది నెలల పాటు మేకప్ వేసుకోకుండా ఉన్నారు నాగార్జున.

వారంలో కథ రెడీ చేసిన దశరథ్..

నాగార్జున హీరోగా దుర్గా ఆర్ట్స్ పతాకంపై డాక్టర్ కె.ఎల్.నారాయణ నిర్మించిన సంతోషం సినిమాకి, ప్రారంభం వెరైటీగా జరిగింది. కథ లేకపోయినా ముందు నాగర్జునతో ఓ సినిమా చేసేందుకు కమిట్ అయ్యారు నిర్మాతలు పి.ఎల్.నారాయణ, ఎస్ గోపాలరెడ్డి. నాగార్జున డేట్స్ కూడా ఇచ్చేశాడు. కానీ వారి వద్ద కథ లేదు.. ఈ క్రమంలో తేజ దగ్గర నువ్వు నును సినిమాకి అసోసియేట్ డైరెక్టర్ గా పనిచేస్తున్న దశరథ్ వద్ద ఓ కథ ఉండడంతో నటుడు బెనర్జీ, నిర్మాతలు పి.ఎల్. నారాయణ, ఎస్.గోపాలరెడ్డిల వద్దకి తీసుకెళ్ళి కథను వినిపించారు. అయితే ముందుగా ఆ కథను తరుణ్ తో చేయాలనీ అనుకున్నారు. కానీ తరుణ్ బిజీగా ఉడడంతో మరో యాక్షన్ కథను వినిపించారు దశరథ్. అది వారికి బాగా నచ్చి నాగార్జునకి కూడా వినిపించారు. కానీ అప్పటికే నాగ్ మరో యాక్షన్ సినిమాలో నటిస్తున్నాడు. మళ్ళీ యాక్షన్ కథ వద్దని ఏదైనా ఫ్యామిలీ, లవ్ స్టోరీ ఉంటే చేద్దామని నాగార్జున చెప్పడంతో రచయిత గోపీమోహన్ తో కలసి ఓ ఫ్యామిలీ స్టోరీ రెడీ చేసే పనిలో పడ్డారు దశరథ్. హిందీ సినిమా “హమ్ దిల్ దే చుకే సనమ్” లో కథానాయకుడు అజయ్ దేవగణ్ పాత్రలాంటి క్యారెక్టరైజేషన్ నాగార్జున పాత్రకు ఉంటే బావుంటుందని అనుకున్న దశరథ్ అలా ఓ స్టోరీ లైన్ అనుకోని మొత్తం కథని ఓ వారంలో ఫినిష్ చేశారు. లైన్ నాగార్జునకి బాగా నచ్చడంతో మిగతా స్క్రిప్ట్ అంతా ఫినిష్ చేశారు.

త్రివిక్రమ్ రెడీ చేసిన క్లైమాక్స్..

అయితే అంతా పూర్తయి సినిమా ప్రారంభమయింది. కానీ క్లైమాక్స్ విషయంలో మేకర్స్ కి ఏదో అసంతృప్తి ఉండడంతో త్రివిక్రమ్ సలహా తీసుకున్నారు. ఈ సినిమా క్లైమక్స్ సన్నివేశంలోని సంభాషణలు త్రివిక్రమ్ రాసినవే కావడం విశేషం. అయితే ముందుగా దైర్యం సరిపోని దశరథ్ ఓ ఎనమిది నెలల సమయం తీసుకొని డైరెక్షన్ లో మెలుకువలు నేర్చుకొని దర్శకత్వం వహించాడు. ఇక గ్రేసీ సింగ్, శ్రీయ హీరోయిన్స్ గా నటించారు. కాగా మరో రెండు ముఖ్యమైన పాత్రలకి ప్రభుదేవా, సీనియర్ దర్శకుడు విశ్వనాథ్ ని తీసుకున్నారు. ఈ సినిమా కి ఆర్పీ పట్నాయక్ సంగీతం అందించగా, సినిమాలో పాటలను సిరివెన్నెల సీతారామశాస్త్రి, కులశేఖర్ రాశారు. ఇక అన్ని పనులను పూర్తి చేసుకుని మే 9న విడుదలైన సంతోషం (22 Years Of Santosham) ఘన విజయం సాధించింది. ఇక ఈ సినిమాకి గాను ఉత్తమ నటునిగా నాగార్జునకి నంది అవార్డు లభించింది. చిరంజీవి (‘ఇంద్ర’ సినిమా)తో కలసి ఈ అవార్డును పంచుకున్నారు నాగార్జున. అయితే ఇద్దరు నటులకు కలిపి, ఉత్తమ నటునిగా నంది అవార్డు ఇవ్వడం ఇదే మొదటిసారి కావడం విశేషం. ఇక ఈ సినిమా ఆ తర్వాత కన్నడ లో, ఒడియా, బెంగాలీ లో కూడా రీమేక్ అయింది.

- Advertisement -

 

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు