#VD12 : విజయ్ ఫ్యాన్స్ కి హైప్ పెంచిన గౌతమ్ తిన్ననూరి

#VD12 : మళ్లీ రావా సినిమాతో తెలుగు ఫిలిం ఇండస్ట్రీకి దర్శకుడుగా ఎంట్రీ ఇచ్చాడు గౌతం తిన్ననూరి. తన మొదటి సినిమాతోనే అద్భుతమైన ఘన విజయాన్ని అందుకుని తెలుగు ఫిలిం ఇండస్ట్రీకి ఒక మంచి దర్శకుడు దొరికాడు అనిపించుకున్నాడు. అయితే ఈ సినిమా కూడా మంచి ప్రశంసలను అందుకుంది. దాదాపు సుమంత్ కెరియర్ అయిపోయింది అనుకునే టైంలో ఈ సినిమా మంచి హిట్ అయి సుమంత్ ను మళ్లీ ట్రాక్ లో పెట్టింది. సినిమా తర్వాత గౌతమ్ తిన్ననూరి కి విపరీతమైన పేరు వచ్చింది.

మళ్లీ రావా సినిమా తర్వాత గౌతమ్ చేసిన సినిమా జెర్సీ. జెర్సీ సినిమా గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. నాని లోని పరిపూర్ణమైన నటుడిని బయటికి తీసిన సినిమా జెర్సీ. ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద కమర్షియల్ కూడా అద్భుతమైన సక్సెస్ ను సాధించింది. కేవలం కమర్షియల్ గా హిట్ అందుకోవటమే కాకుండా నేషనల్ అవార్డును కూడా సినిమా సొంతం చేస్తుంది. అయితే ఈ సినిమా తర్వాత గౌతమ్ రామ్ చరణ్ తో సినిమా చేస్తాడు అని అనౌన్స్ కూడా చేశారు. వీళ్లిద్దరి కాంబినేషన్లో యూవీ క్రియేషన్స్ లో సినిమా ఉండబోతున్నట్లు అప్పట్లో వార్తలు వినిపించాయి.అఫీషియల్ అనౌన్స్మెంట్ కూడా వచ్చింది. కానీ కొన్ని అనివార్య కారణాల వలన ఈ సినిమా పట్టాలెక్కలేదు.

గౌతమ్ తిన్ననూరి విజయ్ దేవరకొండ తో సినిమాని చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాను సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై నాగవంశీ నిర్మిస్తున్నాడు. ఈ సినిమాపై అందరికీ మంచి అంచనాలు ఉన్నాయి. ఇకపోతే నేడు విజయ్ దేవరకొండ పుట్టినరోజు సందర్భంగా విజయ్ చేస్తున్న సినిమాల గురించి చాలా అప్డేట్లు వస్తున్నాయి. అయితే గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమా గురించి కూడా ఒక అప్డేట్ అందించింది. ఇప్పటివరకు వెయిట్ చేస్తున్న రౌడీ ఫ్యాన్స్ కి తెలుగు ఆడియోన్స్ యొక్క పేసెన్స్ కి అప్రీసెట్ చేస్తున్నట్లు ఒక లెటర్ ను రిలీజ్ చేసింది చిత్ర యూనిట్.

- Advertisement -

అలాగే రిలీజ్ చేసిన ఈ లెటర్ లో ప్రస్తుతం వైజాగ్ లోని ఒక కీలకమైన షెడ్యూల్ ని షూట్ చేస్తున్నట్లు తెలిపారు. అలానే ఈ సినిమా నుంచి ఒక స్నేక్ పీక్ వీడియోని త్వరలో రిలీజ్ చేయనున్నట్లు తెలిపారు. అయితే ఈ సినిమా పైన అందరికీ మంచి అంచనాలు ఉన్నాయి. అలానే గౌతమ్ కూడా ఈ సినిమా పైన తన నమ్మకాన్ని తెలియజేశాడు. విజయ్ చేస్తున్న మోస్ట్ ఎక్స్పెక్టేషన్స్ ప్రాజెక్ట్స్ లో ఇది ముందు స్థానంలో ఉంటుందని చెప్పొచ్చు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు