Director Sangeeth Sivan Passes Away : ప్రముఖ మలయాళ డైరెక్టర్ సంగీత్ శివన్ కన్నుమూత.. ఆయన చివరి కోరిక ఇదే

Director Sangeeth Sivan Passes Away : ప్రముఖ మలయాళ దర్శకుడు సంగీత్ శివన్ కన్నుమూశారు. హిందీ చిత్రసీమలో కూడా పలు సినిమాలు తీసి డైరెక్టర్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్న శివన్ గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధ పడుతున్నాడు. ఈ నేపథ్యంలోనే కొన్ని రోజుల నుంచి ముంబైలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. చికిత్స ఫలించక మే 8న సాయంత్రం తుది శ్వాస విడిచారు. ఆయన వయసు 61 సంవత్సరాలు. సంగీత్ శివన్ మృతి పట్ల పలువురు ప్రముఖులు సంతాపం తెలిపారు. సోషల్ మీడియా ద్వారా అభిమానులు నివాళులు అర్పిస్తున్నారు.

శివన్ మూవీ ఎంట్రీ..

సంగీత్ శివన్ స్వస్థలం కేరళలోని తిరువనంతపురం. ఆయన 1989లో చిత్ర పరిశ్రమలోకి అడుగు పెట్టారు. అమీర్ ఖాన్ నటించిన ‘రఖ్’ సినిమాకు ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ గా పని చేసిన ఆయన తర్వాత దర్శకత్వం మీద మక్కువతో దర్శకుడిగా మారారు. 1990లో ‘వ్యూహం’ అనే మలయాళ చిత్రానికి దర్శకత్వం వహించి కొత్త అధ్యాయానికి నాంది పలికారు. మోహన్ లాల్ నటించిన ‘యోధ’ చిత్రానికి దర్శకత్వం వహించి గుర్తింపు తెచ్చుకున్నారు.

బాలీవుడ్ లో కూడా ఆయన ముద్ర..

సంగీత్ శివన్ బాలీవుడ్‌లో కూడా తనదైన ముద్ర వేశారు. ‘చురా లియా హై తుమ్ నే’, ‘క్యా కూల్ హై హమ్’, ‘అప్నా సప్నా మణి మణి’, ‘యమ్లా పగ్లా దీవానా 2’ వంటి చిత్రాలకు దర్శకత్వం వహించాడు.

- Advertisement -

తీరని కోరిక…

ఎన్నో సినిమాలకు దర్శకత్వం వహించిన డైరెక్టర్ శివన్ ఇటు మలయాళం, అటు హిందీ భాషల్లో సూపర్ స్టార్స్ తో కలిసి పని చేశారు. అయితే తన చివరి కోరిక తీరకుండానే తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయారు ఆయన. అనారోగ్యం కారణంగా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆయన ఎవ్వరూ ఊహించని విధంగా మృతి చెందడం పట్ల సినీ పరిశ్రమ తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేస్తోంది. ఇక డైరెక్టర్ సంగీత్ శివన్ చివరి కోరిక విషయానికొస్తే.. మలయాళంలో వచ్చిన ‘రొమాంచం’ సినిమాను హిందీలో రీమేక్ చేసేందుకు సిద్ధమయ్యాడు. ఆ పని పూర్తి కాకముందే సంగీత్ శివన్ మృతి చెందడం బాధాకరం.

ఆయనతో కలిసి వర్క్ చేసిన సెలబ్రిటీలు..

బాలీవుడ్ లో ఇప్పటిదాకా సంగీత్ శివన్ ఎంతోమంది ప్రముఖులతో కలిసి వర్క్ చేశారు. సునీల్ శెట్టి, రితీష్ దేశ్‌ముఖ్, జాకీ ష్రాఫ్, సెలీనా జైట్లీ, చుంకీ పాండే, రాజ్‌పాల్ యాదవ్, తుషార్ కపూర్, ఈషా కొప్పికర్, నేహా ధూపియా, అనుపమ్ ఖేర్ వంటి ప్రముఖులతో సంగీత్ శివన్ పనిచేశారు దర్శకుడు

రితేష్ దేశ్‌ముఖ్ సంతాపం

హీరోయిన్ జెనీలియా భర్త, బాలీవుడ్ స్టార్ రితేష్ దేశ్‌ ముఖ్ డైరెక్టర్ సంగీత్ శివన్ మృతి పట్ల సంతాపం వ్యక్తం చేశారు. సంగీత్‌ శివన్‌ సార్‌ ఇక లేరని తెలిసి షాక్‌కు గురయ్యారు. అతను చాలా మంచి వ్యక్తి. ఆయన కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి. నేను అతనిని, అతని చిరునవ్వును కోల్పోతాను” అని రితీష్ దేశ్‌ముఖ్ ట్వీట్ చేశాడు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు