34 Years for Jagadeka Veerudu Athiloka Sundari: అతిలోక సుందరి భూమిపైకి వచ్చి 34 ఏళ్ళు అయింది

34 Years for Jagadeka Veerudu Athiloka Sundari: ఎదురులేని మనిషి సినిమాతో తెలుగు ఫిలిం ఇండస్ట్రీకి నిర్మాతగా ఎంట్రీ ఇచ్చారు అశ్విని దత్. అయితే ఆ తర్వాత యుగపురుషుడు, గురు శిష్యుడు, అడవి రాముడు వంటి సినిమాలను నిర్మించారు. ఈ సినిమాల కమర్షియల్ గా మంచి హిట్ సాధించాయి. అయితే ఒక పేజ్ లో ఆల్మోస్ట్ వరుసగా డిజాస్టర్ సినిమాలు పడ్డాయి అశ్వని దత్ కి, ఆ టైంలో జగదేకవీరుడు అతిలోకసుందరి అనే సినిమాను నిర్మించారు. ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద ఎంతటి సంచలనం సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.

మొదటి ఈ సినిమా థాట్ ను రచయిత శ్రీనివాస్ చక్రవర్తికి రాఘవేంద్రరావు చెప్పుకొచ్చారు. భూమిపైకి వచ్చిన ఇంద్రుడి కూతురు తన ఉంగరాన్ని పోగొట్టుకుంటే ఎలా ఉంటుంది అనే ఆలోచనను శ్రీనివాస్ చక్రవర్తి తో చెప్పడంతో ఈ కథపై యండమూరి వీరేంద్రనాథ్ జంధ్యాల, సత్యానంద్, క్రేజీ మోహన్ వంటి రైటర్లు వరుసగా చర్చించి ఒక అద్భుతమైన కథను డిజైన్ చేశారు. దీనికి ఒక మంచి డ్రామాను యాడ్ చేశారు. అయితే ఈ కథ చర్చల్లో మెగాస్టార్ చిరంజీవి కూడా దాదాపు 25 రోజులు పాటు ఈ టీం తో గడిపారు. మొత్తానికి కథ పూర్తిగా సిద్దమైన తర్వాత ఇది ఒక సోషియా ఫాంటసీ డ్రామాగా తెరకెక్కించారు.

మెగాస్టార్ చిరంజీవి శ్రీదేవి జంటగా నటించిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్ అయింది. చాలా సెంటర్లో 100 రోజుల వరకు ఆడింది అయితే ఒక సెంటర్లో 200 రోజులు కూడా ఆడింది ఈ సినిమా. ఇకపోతే ఈ సినిమా రిలీజ్ అయిన మొదటి రోజు బీభత్సంగా వర్షం కురిసింది. జనాలు బయట అడుగుపెట్టలేని పరిస్థితి. ఆ టైంలో అశ్విని దత్ గారు చాలా టెన్షన్ పడిపోయారంట. కానీ ఆ సినిమా మెల్లమెల్లగా హిట్ టాక్ రావడంతో థియేటర్ వద్ద జన సముద్రం మొదలైంది. అప్పటివరకు ఆల్టెం ఇండస్ట్రీ హిట్ గా ఉన్న సినిమాల అన్నిటి రికార్డులును ఈ సినిమా తుడిచివేసింది. ఆ రోజుల్లోనే దాదాపు 15 కోట్లు వసూలు చేసింది ఈ సినిమా.

- Advertisement -

ఈ సినిమాకి అన్ని అంశాలు కూడా అద్భుతంగా కలిసి వచ్చాయని చెప్పొచ్చు. అన్నిటిని మించి ఇళయరాజా అందించిన సంగీతం ఈ సినిమాకి ప్లస్. ఈ సినిమాలోని అన్ని పాటలు కూడా ఆడియన్స్ ను విపరీతంగా ఆకట్టుకున్నాయి. ఈ సినిమాకి సీక్వెల్ కూడా వస్తే బాగుంటుందని చాలామంది ఎదురుచూస్తున్నారు. ఈ సినిమా కోసం విజయ వాహని స్టూడియోస్ లో భారీ సెట్ ను కూడా అప్పట్లో నిర్మించారు. అక్కినేని నాగేశ్వరరావు నటించిన ప్రేమ్ నగర్ సినిమా తర్వాత అతిపెద్ద సెట్ ఈ సినిమాకి వేశారు. ఇదే సినిమాను హిందీలో ఆద్మీ ఔర్ అప్సర అనే పేరుతో హిందీలో కూడా డబ్ చేశారు. అక్కడ కూడా ఈ సినిమా అద్భుతమైన ఘనవిజయాన్ని సాధించింది.నేటికీ ఈ సినిమా రిలీజై 34 ఏళ్ళు అయింది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు