Kamal Hassan: కమల్ హాసన్ థగ్ లైఫ్ లో జయం రవి స్థానాన్ని కొట్టేసిన నటుడు ..!

Kamal Hassan: యూనివర్సల్ స్టార్ హీరో కమల్ హాసన్ మరియు మణిరత్నం మూవీలో దుల్కర్ సల్మాన్ కీలక పాత్ర పోషిస్తున్న సంగతి తెలిసిందే. అయితే తమిళ్ నటుడి స్థానంలో శింబును తీసుకున్నారు అంటూ ప్రచారం జరుగుతుంది. షెడ్యూల్ వివాదం కారణంగా దుల్కర్ ఈ ప్రాజెక్టులో భాగం అయ్యే గోల్డెన్ ఛాన్స్ ను కోల్పోయినట్లు తెలుస్తుంది.

డేట్స్ అడ్జెస్ట్ కాకపోవడంతో ఈ గ్యాంగ్ స్టార్ యాక్షన్ డ్రామా ఛాన్స్ ను జయం రవి మిస్ చేసుకున్నాడు. కోలీవుడ్ ఫిలిం సర్కిల్ లో తాజా సమాచారం ఈ యాక్షన్ డ్రామాలో జయం రవి స్థానంలో అశోక్ సెల్వన్ నటించనున్నట్లు తెలుస్తుంది. అధికారిక ప్రకటన రాకపోయినప్పటికీ పుకార్లు, షికారు చేస్తున్నాయి. అశోక్ గతంలో ఓ మై కడవులే మరియు పోర్ తోజిల్ వంటి హిట్ చిత్రాలను చేశారు.

the actor who replaced Jayam Ravi in Kamal Hassan's Thug Life
the actor who replaced Jayam Ravi in Kamal Hassan’s Thug Life

ఇక అతను థగ్ లైఫ్‌ మూవీలో జాయిన్ అయితే, ఈ యంగ్ హీరో కెరీర్ మరింత ముందుకు వెళ్తుందని చెప్పొచ్చు. ఇక ఈ చిత్రంలో త్రిష కృష్ణన్, ఐశ్వర్య లక్ష్మి, గౌతమ్ కార్తీక్ మరియు నాజర్ కూడా కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఇక ఈ మూవీపై కమల్ హాసన్ అభిమానులతో పాటు ఆడియన్స్ లో కూడా మంచి అంచనాలు నెలకొన్నాయి. లాంగ్ గ్యాప్ తరువాత కమల్ హాసన్ నుంచి వస్తున్న సినిమా కావడంతో ఈ మూవీపై భారీ హైప్స్ ఏర్పడ్డాయి. ఇక ఈ మూవీ నుంచి విడుదలైన పోస్టర్స్ ఇప్పటికే ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి..!

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు