Rajinikanth: సూసైడ్ చేసుకోవాలనుకున్న సూపర్ స్టార్.. కారణం?

Rajinikanth.. కోలీవుడ్లో సూపర్ స్టార్ గా పేరుపొందిన రజనీకాంత్.. ప్రపంచవ్యాప్తంగా ఈయనకున్న ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.. బస్ డ్రైవర్ నుంచి హీరోగా ఎదిగిన తీరు ఎంతోమందికి ఇన్స్పైర్ ను ఇచ్చింది.. రజనీకాంత్ కు చిన్న వయసు నుంచే చాలా కోరికలు ఉండేవి.. అలా బస్సు డ్రైవర్ తో సాధ్యం కాని కలలను ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి తీర్చుకున్నారు.. ముఖ్యంగా తన చిన్నతనంలోనే ధనవంతులుగా పేరుపొందాలని కల కనేవారట.. ఆ కల నెరవేరడానికి ఇప్పుడు ఇంత సమయం పట్టిందని వెల్లడించారు.

Rajinikanth: The superstar who wanted to commit suicide... the reason?
Rajinikanth: The superstar who wanted to commit suicide… the reason?

మాట్లాడడం తెలిస్తే చాలు మీరే రాజు..

ఒక్కో చిత్రానికి దాదాపుగా రూ.100 కోట్లకు పైగా రెమ్యూనరేషన్ అందుకుంటున్న రజనీకాంత్ ఒకానొక సమయంలో ఆత్మహత్య చేసుకోవాలనుకున్నారట. మరి రజనీకాంత్ అలా సూసైడ్ చేసుకోవాలనుకోవడానికి గల ముఖ్య కారణం ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. గతంలో రజనీకాంత్ మాట్లాడుతూ.. ఎవరికైనా మాట్లాడే టాలెంట్ ఉంటే చాలు మిమ్మల్ని రాజకీయ నాయకుడిని చేస్తారని .. ముఖ్యంగా రాజకీయాలకు రావాలంటే ఎలాంటి అర్హత ప్రతిభ ఉండనవసరం లేదని తెలియజేశారు. అందుకే తను తెలిసిన విషయాలపైనే ఎక్కువగా కాన్ఫిడెంట్ గా మాట్లాడుతానంటూ వెల్లడించారు రజినీకాంత్.

బస్ డ్రైవర్ మాత్రమే కాదు ఆఫీస్ బాయ్ కూడా..

అయితే అందరికీ తాను బస్సు డ్రైవర్ గా మాత్రమే తెలుసు కానీ అంతకంటే ముందు ఒక ఆఫీస్ బాయ్గా కూలి పని కూడా పనిచేశానని.. ఆ తర్వాతే తాను కండక్టర్ అయ్యానని తెలియజేశారు.. ఒక నిరుపేద కుటుంబంలో పుట్టడం వల్లే ఇదంతా తాను కష్టపడాల్సి వచ్చిందని కూడా తెలిపారు.. ధనవంతుడు అవ్వడం కోసం ఎలాంటి పనైనా.. ఎంతైనా కష్టపడతానని తెలియజేశారు..

- Advertisement -

ఆత్మహత్య చేసుకోవాలనుకున్నాను..

అలాంటి సమయంలో ఒకసారి తను ఆత్మహత్య చేసుకోవాలనుకున్నానని ఆ రోజే తను దేవుడిని పూజిస్తూ ఒక ఫోటోను చూశానని ఆ నిర్ణయంతోనే తన కెరీరే మారిపోయింది అని తెలిపారు రజనీకాంత్..

రాఘవేంద్ర స్వామి దయ వల్లే ఇదంతా..

ముఖ్యంగా తనకు ఆరోజు నిద్రిస్తున్న సమయంలో ఒక కల వచ్చిందని.. తెల్లటి గడ్డంతో ఉన్న వ్యక్తి అటు సైడ్ గా కూర్చున్నారు.. అతను నన్ను దగ్గరికి పిలిచారు.. దాంతో నేను ఉలిక్కిపడి నిద్రలో లేచాను.. అయితే ఆ మరుసటి రోజు ఆ దేవుడు ఎవరా అని అడగగా. అతను శ్రీ రాఘవేంద్ర స్వామి అని చెప్పారట.. అక్కడికి వెళ్లి తాను ధనవంతుడిని అవ్వాలని వేడుకున్నాను… ప్రతి గురువారం కూడా అందుకోసం ఉపవాసం ఉంటున్నానని తెలిపారు రజనీకాంత్.. ఆ తరువాతే తను కండక్టర్గా మారి మళ్ళీ సినీ ఇండస్ట్రీలోకి వచ్చి సక్సెస్ అయ్యానని.. తాను సక్సెస్ కావడానికి ముఖ్య కారణం బాలచందర్ సారే అంటూ వెల్లడించారు. ప్రస్తుతం రజనీకాంత్ చేసిన ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.

రజినీకాంత్ సినిమాలు..

రజినీకాంత్ ప్రస్తుతం లోకేష్ కనకరాజు దర్శకత్వంలో వెట్టయాన్ అనే చిత్రంలో నటిస్తున్నారు. ఈ సినిమాతో మరో విజయాన్ని తన ఖాతాలో వేసుకునే ప్రయత్నం చేస్తున్నారో రజినీకాంత్ అలాగే అవకాశం వచ్చిన ప్రతి చోట గెస్ట్ అప్పియరెన్స్ ఇస్తూ ప్రేక్షకులకు మరింత దగ్గరవుతున్నారు. ఏది ఏమైనా ఏడు పదుల వయసులో కూడా వరుస సినిమాలు చేస్తూ ప్రేక్షకులను అలరిస్తున్నారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు