HBD Rashmika Mandanna : రష్మిక మందన్నా కెరీర్ లో బెస్ట్ 7 సాంగ్స్ ఇవే

HBD Rashmika Mandanna : నేషనల్ క్రష్ రష్మిక మందన్న పుట్టినరోజు నేడు. ఈ సందర్భంగా ఆమె హీరోయిన్ గా నటిస్తున్న కొత్త సినిమాల అప్డేట్స్ ను రిలీజ్ చేసి నేషనల్ క్రష్ ఫ్యాన్స్ దిల్ ఖుష్ చేస్తున్నారు మేకర్స్. రష్మిక బర్త్ డే ( HBD Rashmika Mandanna ) సందర్భంగా ఇప్పటిదాకా ఆమె నటించిన సినిమాల నుంచి రష్మిక కెరీర్ లోనే 7 బెస్ట్ సాంగ్స్ పై ఓ లుక్కేద్దాం.

1. సామీ సామీ

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, రష్మిక మందన్న హీరో హీరోయిన్లుగా నటించిన బ్లాక్ బస్టర్ పాన్ ఇండియా మూవీ పుష్ప. సుకుమార్ దర్శకత్వంలో రూపొందిన ఈ మూవీలో రష్మిక శ్రీవల్లి పాత్రను పోషించింది. డి గ్లామర్ లుక్ లో కనిపించి తన యాక్టింగ్ స్కిల్స్ తో ప్రపంచవ్యాప్తంగా ఎంతో మంది అభిమానులను ఈ సినిమా ద్వారా సంపాదించుకుంది రష్మిక. ఇందులో “సామీ సామీ” అనే పాట పుష్ప మూవీ రిలీజ్ అయినప్పుడు ఓ రేంజ్ లో సినీ ప్రియులను ఊపేసింది.

2. శ్రీవల్లి

ఈ సాంగ్ కూడా రష్మిక మందన్న కెరీర్ లోనే టాప్ బెస్ట్ సాంగ్ అని చెప్పొచ్చు. పుష్పలో రష్మిక మందన్న పాత్ర శ్రీవల్లిపై సాగే ఈ పాట ఆమె అభిమానుల ఆల్ టైం ఫేవరెట్ సాంగ్స్ లిస్ట్ లో ఖచ్చితంగా ఉంటుంది. సిద్ శ్రీరామ్ పాడిన ఈ పాట అప్పట్లో అదరగొట్టింది.

- Advertisement -

3. చూసి చూడంగానే…

రష్మిక మందన్న టాలీవుడ్ లోకి చలో మూవీతో ఎంట్రీ ఇచ్చింది. వెంకీ కుడుముల దర్శకత్వంలో రూపొందిన ఈ మూవీలో నాగశౌర్య హీరోగా నటించారు. ఇందులోని చూసి చూడంగానే సాంగ్ రష్మికను మరింత క్యూట్ గా చూపించింది. మహతి స్వర సాగర్ అందించిన సంగీతం, అనురాగ్ కులకర్ణి ఆలపించిన తీరు, రష్మిక మందన్న క్యూట్ లుక్స్, నాగశౌర్య ఎక్స్ప్రెషన్స్ ఈ పాటలో హైలెట్ అని చెప్పొచ్చు. రష్మిక టాలీవుడ్ ఆడియన్స్ దృష్టిని ఆకట్టుకోవడంలో ఈ పాట పాత్ర కీలకమైనది.

4. హే చూసా…

డైరెక్టర్ వెంకీ కుడుముల, రష్మిక మందన్న కాంబో మరోసారి రిపీట్ అయింది భీష్మ మూవీతో. నితిన్ కెరీర్ లోనే ఈ మూవీ బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది. ఈ మూవీకి కూడా మహతి సరసాగర్ సంగీతం అందించగా, ఇందులోని హే చూసా, వాటే వాటే బ్యూటీ సాంగ్స్ సంగీత ప్రియులను విశేషంగా ఆకట్టుకున్నాయి.

5. ఇంకేం ఇంకేం కావాలే…

విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న కలిసి నటించిన ఫస్ట్ మూవీ గీత గోవిందం. పరశురాం ఈ మూవీకి దర్శకత్వం వహించగా, ఇందులో రష్మిక, విజయ్ జోడి ఆన్ స్క్రీన్ రొమాన్స్ కు మంచి మార్కులు పడ్డాయి. పైగా ఈ సినిమాలోని ఇంకేం ఇంకేం కావాలే, వచ్చిందమ్మా, ఏంటి ఏంటి అనే పాటలు హిట్ అయ్యాయి.

6. హి ఈజ్ సో క్యూట్

రష్మిక మందన్న కెరీర్ లో బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచిన మరొక మూవీ సరిలేరు నీకెవ్వరు. ఈ సినిమాలోని హి ఈజ్ సో క్యూట్ సాంగ్ కు మంచి ఆదరణ లభించింది.

7. వారసుడు

రష్మిక కెరీర్ లో మరో బ్లాక్ బస్టర్ మూవీ గా నిలిచింది వారసుడు. ఈ సినిమాలో ఆమె విజయ్ సరసన హీరోయిన్ గా నటించింది. ఇందులోని చెమికి కన్ను, రంజితమే పాటల్లో డాన్స్ తో అదరగొట్టింది నేషనల్ క్రష్.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు