Jabardast : తల్లి కాబోతున్న జబర్దస్త్ లేడీ కమెడియన్.. ఫొటోస్ వైరల్..!

Jabardast : తెలుగు బుల్లితెరపై గత 14 సంవత్సరాలుగా నిర్విరామంగా ప్రేక్షకులను కడుపుబ్బా నవ్విస్తున్న ఏకైక కామెడీ షో జబర్దస్త్.. ఇప్పటికే ఈ షో ద్వారా సామాన్యులు కూడా సెలబ్రిటీ హోదాను దక్కించుకున్నారు. ఇదిలా ఉండగా ఈ షోలో లేడీ కమెడియన్ గా అడుగుపెట్టి.. ఇప్పుడు స్టార్ సెలబ్రిటీ అయిపోయింది లేడీ కమెడియన్ జోర్దార్ సుజాత.. అయితే తాజాగా ఈమె గర్భం దాల్చినట్లు.. అందుకు సంబంధించిన ఫోటోలు కూడా ఇంస్టాగ్రామ్ పేజ్ లో వైరల్ గా మారాయి.. మరి అసలు విషయం ఏమిటో ఇప్పుడు చూద్దాం..

తల్లి కాబోతున్న జోర్దార్ సుజాత..

2020లో ప్రసారమైన బిగ్ బాస్ సీజన్ 4 లో కంటెస్టెంట్ గా పాల్గొన్న సుజాత హోస్ట్ నాగార్జునను బిట్టు అని పిలిచేది. మనం సినిమాలో నాగార్జున పాత్ర పేరు అది.. అయితే సుజాత పెద్దగా హౌస్ లో రాణించలేక 5 వారాలకే ఎలిమినేట్ అయ్యింది.. ఆ తర్వాత జబర్దస్త్ లేడీ కమెడియన్ గా మారి రాకింగ్ రాకేష్ టీమ్ లో స్కిట్స్ చేసేది.. ఈ క్రమంలోనే రాకేష్ తో పరిచయం ఏర్పడి..ఆ పరిచయం కాస్త ప్రేమగా మారి.. జబర్దస్త్ వేదికపైనే తమ ప్రేమను ప్రకటించారు.. గత ఏడాది తిరుపతిలో రోజా దంపతుల సమక్షంలో చాలా సింపుల్ గా వీరి వివాహం జరిగింది.. సుజాత కోడలిగా రావడం పై రాకేష్ తల్లి కూడా సంతోషం వ్యక్తం చేసింది.. ఇక ప్రస్తుతం సుజాత గర్భం దాల్చారట.. ఈ మేరకు సోషల్ మీడియాలో ఒక వార్త వైరల్ అవుతోంది. అంతేకాదు అందుకు సంబంధించిన ఫోటోలు కూడా నెట్టింట వైరల్ గా మారుతున్నాయి.. ఇక వీటిని చూసిన అభిమానులు, మిత్రులు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. త్వరలోనే రాకింగ్ రాకేష్ తండ్రి కాబోతున్నారు అంటూ సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.

సుజాత కెరియర్..

జబర్థస్త్ లో లేడీ కమెడియన్ గా కొనసాగుతూనే.. జోర్దార్ సుజాత నటిగా కూడా రాణిస్తోంది.. ఇటీవల హాట్ స్టార్ లో స్ట్రీమ్ అవుతున్న సేవ్ ద టైగర్స్ వెబ్ సిరీస్ లో సుజాత కీలక పాత్ర పోషించింది..ప్రముఖ నటులు ప్రియదర్శి భార్య పాత్రలో నవ్వులు పూయించింది.. సేవ్ ద టైగర్స్ సీజన్ వన్ అత్యంత ఆదరణ దక్కించుకోవడం తో ఆ బాటలోనే సీజన్ 2 కూడా అందుబాటులోకి తీసుకొచ్చారు..అయితే సుజాత ప్రియదర్శి భార్యగా మరొకసారి ప్రేక్షకులను అలరించింది.. ఈ సీజన్ 2 కూడా సూపర్ హిట్ అయింది..

- Advertisement -

ఫోటోలు వైరల్..

ఇకపోతే తాజాగా సుజాతకు శ్రీమంతం వేడుకలు జరిగినట్లు ఫోటోలు చూస్తే అర్థమవుతుంది.. ఆ ఫోటోలలో గెటప్ శ్రీను భార్య కూడా వున్నారు.. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారగా.. పలువురు సెలబ్రిటీలు, అభిమానులు, జబర్దస్త్ కమెడియన్స్ ఈమెకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.. మొత్తానికి అయితే రాకేష్, సుజాత తల్లిదండ్రులు కాబోతున్నారు..

రాకేష్ కెరియర్..

జబర్దస్త్ ( Jabardast ) లో రాకింగ్ రాకేష్ అనే పేరుతో టీం లీడర్ గా కొనసాగుతూ… మొదట్లో చిన్న పిల్లలతో స్కిట్స్ చేసి పాపులర్ అయిన రాకేష్.. ఇప్పుడు పెద్ద వాళ్లతో స్కిట్స్ చేస్తూ పర్వాలేదు అనిపించుకుంటున్నారు.. అలాగే అడపా దడపా సినిమాలలో కూడా కమెడియన్ గా నటిస్తూ వస్తున్నారు.. ఇక ఇప్పుడు తండ్రిగా ప్రమోట్ కూడా కాబోతున్నారు.

 

View this post on Instagram

 

A post shared by @insta_celebritycouple

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు