Lifestyle : గంటల తరబడి కూర్చుని పని చేసేవాళ్ల కోసమే మాలాసనం

Lifestyle : శరీరం దృఢంగా, ఆరోగ్యవంతంగా మారడానికి యోగా ఆసనాలు బాగా ఉపయోగపడతాయి అన్న విషయం అందరికీ తెలిసిందే. ప్రస్తుత మోడ్రన్ యోగాలో మాలాసనం శరీరాన్ని ఫిట్ గా మార్చడానికి హెల్ప్ చేస్తుంది. యోగ అనేది ఒక శాస్త్రబద్ధమైన జీవన విధానం అని చెప్పొచ్చు. క్రీస్తుపూర్వం 200 సంవత్సరాల క్రితమే పతంజలి రచించిన యోగా ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఆచరణీయంగా మారింది. యోగా నిపుణుల ప్రకారం మాలాసనం వల్ల ఎన్నో అద్భుతమైన ప్రయోజనాలు ఉన్నాయి.

ప్రస్తుతం ఉన్న ఈ డిజిటల్ యుగంలో జనాలు గంటల తరబడి ఒకే చోట కూర్చుని పని చేయాల్సి వస్తోంది. దీంతో బరువు పెరగడం, చిరాగ్గా అన్పించడం వంటి సమస్యలు ఎదురవుతాయి అలాంటి వారు శారీరకంగా చురుకుగా ఉండాలంటే ఈ యోగ హెల్ప్ అవుతుంది. కాబట్టి బిజీ షెడ్యూల్ నుంచి కొంత సమయాన్ని యోగ కోసం కేటాయిస్తే ఆరోగ్యానికి ఆరోగ్యం, అలాగే ఫిట్ గా, చురుగ్గా ఉంటారు. మరి రోజంతా ఒకే చోట కూర్చుని పని చేసే వారికి ఎంతో మేలు చేకూర్చే ఈ మాలాసనం గురించి ఈరోజు తెలుసుకుందాం. మాలాసనం వేయడం వల్ల పిరుదులు, మోకాళ్ళు, చీలమండలు బలంగా మారుతాయి. కండరాల బలం కూడా పెరుగుతుంది.

మాలాసనాన్ని ఎలా వేయాలంటే…

ముందుగా చేతులు కట్టుకుని నిలబడాలి. ఆ తర్వాత కాళ్ళను వెడల్పు చేసి చీల మండలపై బరువు వేస్తూ కూర్చోవాలి. కూర్చున్నాక ఏ విధంగాను చీలమండలను కదల్చకూడదు. వీలైనంత వరకు మోకాళ్లపై బరువు పడేలా చూసుకోవాలి. వెన్నెముకను స్ట్రైట్ గా ఉంచి, చేతులతో రెండు తొడలను పక్కకు నెడుతూ ఉండాలి. అలాగే భుజాలను చెవులకు దూరంగా ఉంచాలి. లోతైన శ్వాస తీసుకోవాలి. అలా రెండు మూడు నిమిషాలు ఈ ఆసనం వేసిన తర్వాత మళ్లీ నార్మల్ పొజిషన్ కు వచ్చేయొచ్చు. ప్రతిరోజు కేవలం ఐదు నిమిషాల పాటు ఈ మాలాసనం యోగాను పాటిస్తే ఎన్నో రకాలుగా ఆరోగ్యానికి ప్రయోజనం చేకూరుతుంది.

- Advertisement -

మాలాసనం వల్ల ప్రయోజనాలు…
1. నడుము నొప్పి మయం

ఎక్కువ సేపు కూర్చుని పని చేస్తున్నప్పుడు వెన్నుముక, నడుము కండరాలు, తుంటి భాగంపై ప్రభావం పడుతుంది. దీనివల్ల నొప్పులు మొదలవుతాయి. అయితే మాలాసనం యోగాను పాటించడం వల్ల తుంటి, నడుము నొప్పి తగ్గి కండరాలు బలంగా తయారవుతాయి.

2. కండరాల బలం పెరుగుతుంది

ఈ ఆసనం వల్ల తొడలు, తుంటి భాగాల్లోని కండరాలు బలంగా మారి శరీరం ఫ్లెక్సిబుల్ గా మారుతుంది.

3. జీర్ణశక్తిని మెరుగు పరుస్తుంది

మాలాసనం వేయడం వల్ల శరీరంలో రక్త ప్రసరణ సాఫీగా సాగుతుంది. అలాగే జీర్ణ క్రియ కూడా మెరుగుపడుతుంది. ముఖ్యంగా మహిళలకు ఈ మాలాసనం యోగా చాలా మంచిది. ఇది పెల్విక్ కండరాలను బలోపేతం చేస్తుంది. నార్మల్ డెలివరీ జరగాలని కోరుకునే మహిళలు ఈ యోగా ఆసనాన్ని ప్రాక్టీస్ చేస్తే మంచిది. మరి ఇంకెందుకు ఆలస్యం ఈ మలాసనాన్ని రెగ్యులర్ గా వేసి శారీరకంగా ఫిట్ గా తయారవ్వండి. అలాగే పలు అనారోగ్యాలకు చెక్ పెట్టండి.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు