Deepika Padukone : ఏకైక భారతీయ నటి… ఆ గౌరవం చిరస్మరణీయం..!

Deepika Padukone : అకాడమీ ఆఫ్ మోషన్ పిక్చర్ ఆర్ట్స్ అండ్ సైన్సెస్ 2023 లో.. ఆస్కార్ కమిటీలో భాగంగా భారతీయ ప్రతిభావంతుల పేర్లు చేర్చడానికి 398 మంది ప్రముఖ కళాకారులకు, ఎగ్జిక్యూటివ్ లకు పంపగా.. అందులో టాలీవుడ్ సంగీత దర్శకుడు ఎమ్. ఎమ్. కీరవాణి , పాటల రచయిత చంద్రబోస్ తో పాటు సినిమాటోగ్రాఫర్ సెంథిల్ కుమార్ తో సహా… ఆర్టిస్టుల కేటగిరీ నుంచి రాంచరణ్, ఎన్టీఆర్ లకి కూడా ఈ జాబితాలో చోటు లభించింది.. ముఖ్యంగా సాంకేతిక నిపుణుల్లో కీరవాణి , చంద్రబోస్ , సెంథిల్ పేర్లు చేరగా.. ఇప్పుడు అకాడమీ అధికారిక ఇంస్టాగ్రామ్ హ్యాండిల్ లో దీపికా పదుకొనే ప్రత్యక్షం అవడంతో అభిమానుల ఆనందానికి అవధులు లేవని చెప్పవచ్చు..

ఆస్కార్ ఇన్ స్టా హ్యాండిల్ లో దీపికా..

బాజీరావు మస్తానీ లో “దీవానీ మస్తానీ” పాటలో దీపికా పదుకొనే ( Deepika Padukone ) ఐకానిక్ పెర్ఫార్మెన్స్ ని ప్రేక్షకులు అంత సులభంగా మరిచిపోలేరు.. అయితే ఇప్పుడు ఆ పర్ఫామెన్స్ ఆస్కార్ ఇన్స్టా పేజ్ లో చేరింది.. దీనికి రణవీర్ సింగ్ స్పందన కూడా అద్భుతం.. తమ అభిమాన నటిని చూసినప్పుడు దీపిక పదుకొనే అభిమానులు చాలా ఎక్సైట్ అయ్యారు. దీపికకు ఇది నిజంగా ఒక గొప్ప గౌరవంగా భావిస్తున్నారు. అంతేకాదు ఈ గౌరవం అందుకున్న మొదటి ఏకైక భారతీయ నటి కూడా ఈమె కావడం గమనార్హం. ఇక ఈమె పేరు ఈ జాబితాలో చిరస్మరణీయంగా మిగిలిపోతుంది అనడంలో సందేహం లేదు.. ఈ పాటను శ్రేయ ఘోషల్ పాడగా.. దీపిక ఐకానిక్ పెర్ఫార్మెన్స్ కి అకాడమీ బుధవారం నివాళులర్పించింది… అకాడమీ అధికారిక ఇన్స్టా హ్యాండిల్ లో దీపిక డాన్స్ చేసిన వీడియో క్లిప్ ను షేర్ చేసింది.

బాజీరావు మస్తానీ..

బాలీవుడ్ డైరెక్టర్ భన్సాలీ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాలో రణవీర్ సింగ్ హీరోగా ప్రియాంక చోప్రా కూడా కీలకపాత్ర పోషించింది.. ఇక ఇందులో దీపిక ,రణధీర్ జంట రొమాన్స్ కి యువత ఫిదా అయిపోయారు..

- Advertisement -

దీపికా భర్త స్పందన..

ఇక ఈ వీడియోను షేర్ చేసిన వెంటనే దీపికా భర్త రణవీర్ సింగ్ కూడా స్పందించారు.. అతడు మెస్మరిక్ అంటూ ఆనందం వ్యక్తం చేశారు.. అభిమానులు కూడా ప్రశంసించారు. ఈ పాటలో దీపిక అందం వావ్.. తనలాగ మరే ఇతర నటి ఇలా చేయగలరు? ఇది హిందీ చిత్రసీమలో ఆల్ టైం గ్రేట్ హిట్ గా నిలిచిపోతుంది అని ఒక అభిమాని వ్యాఖ్యానించారు. ఇక ఇప్పుడు అకాడమీ ఎట్టకేలకు బాలీవుడ్ కి తగిన గుర్తింపు ఇస్తోంది అని మరి కొంతమంది కామెంట్లు చేస్తున్నారు.. ఇప్పటికైనా అత్యంత అందంగా చిత్రీకరించిన పాటను గుర్తించినందుకు ధన్యవాదాలు అంటూ ఇంకొక అభిమాని పోస్ట్ చేశారు..

ఆస్కార్ 2023లో దీపిక..

గత సంవత్సరం మార్చిలో లాస్ ఏంజిల్స్ లో జరిగిన 95 వ ఆస్కార్ అకాడమీ అవార్డ్స్ లో దీపిక ఆస్కార్ విజేత ఆర్ఆర్ఆర్ మూవీలోని పాట నాటు నాటు ప్రదర్శనను ప్రకటించింది. ఆస్కార్ అవార్డు గెలుచుకున్న మొదటి తెలుగు పాటగా చారిత్రాత్మక మైలురాయిని అందుకుంది.

 

View this post on Instagram

 

A post shared by The Academy (@theacademy)

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు