RRR: ‘ఆర్.ఆర్.ఆర్’ ఒరిజినల్లో హీరోయిన్ చచ్చిపోతుంది రాజమౌళి షాకింగ్ కామెంట్స్

తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో ఉన్న దిగ్గజ దర్శకులలో ఎస్ఎస్ రాజమౌళి ఒకరు. ఇప్పటివరకు రాజమౌళి తీసిన సినిమాలలో ఒకటి కూడా బాక్స్ ఆఫీస్ వద్ద ఫెయిల్ కాలేదు. స్టూడెంట్ నెంబర్ వన్ సినిమా దగ్గర దర్శకుడుగా కెరియర్ మొదలు పెట్టిన ఎస్.ఎస్ రాజమౌళి ఇప్పటివరకు తను తీసిన సినిమాలతో స్థాయిని పెంచుకుంటూ వచ్చాడు. రాజమౌళి సినిమాలు ఒకదానికి మించి ఒకటి ఉంటుందని చెప్పొచ్చు.

అయితే తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో మల్టీ స్టారర్ సినిమాలకు సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమాతో మరోసారి తెర తీశాడు శ్రీకాంత్ అడ్డాల. ఆ సినిమా తర్వాత చాలా మల్టీ స్టార్ సినిమాలు తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో వచ్చాయి. అయితే వాటిలో కొన్ని సినిమాలు అద్భుతమైన విజయాన్ని సాధించాయి. ఇంకొన్ని సినిమాలు ఫెయిల్ అయ్యాయి. అయితే ఆ మల్టీస్టారర్ వలన వెంకటేష్ లాంటి హీరో పవన్ కళ్యాణ్ మహేష్ బాబు లాంటి స్టార్ హీరోలతో వర్క్ చేయడానికి కలిసి వచ్చింది.

ఇకపోతే బాహుబలి సినిమాతో ఎస్ఎస్ రాజమౌళి కూడా మల్టీస్టారర్ సినిమాను తెరకెక్కించాడు. రెండు పార్ట్ లుగా తెరకెక్కిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద అద్భుతమైన ఘనవిజయం సాధించింది. ఈ సినిమాతోనే పాన్ ఇండియా సినిమాకు తెలుగు సినిమా స్థాయి ఏంటో తెలిసి వచ్చింది.
దీనిలో బాహుబలి పాత్రలు ప్రభాస్ బల్లాలదేవ పాత్రలో రానా నటించిన విధానం అద్భుతంగా ప్రేక్షకులను ఆకట్టుకుంది.

- Advertisement -

ఈ సినిమా తర్వాత రాజమౌళి తెరకెక్కించిన సినిమా ట్రిపుల్ ఆర్. ఈ సినిమా భారతీయ సినిమా స్థాయిని ప్రపంచ స్థాయికి తీసుకెళ్లింది. ఇండియన్ సినిమా స్థాయి ఏంటి అనేది ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమాతోనే పరిచయం అయింది. అయితే మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద అద్భుతమైన ఘనవిజయాన్ని సాధించింది.

ఇకపోతే ఒక మల్టీ స్టారర్ సినిమాను డీల్ చేసినప్పుడు, ఇద్దరి హీరోల అభిమానులను సాటిస్ఫై చేయాల్సి వస్తుంది. అయితే త్రిబుల్ ఆర్ సినిమాలు సంబంధించి ఒకవైపు రాంచరణ్ మరోవైపు ఎన్టీఆర్ ని అద్భుతంగా చూపించాడు ఎస్ఎస్ రాజమౌళి. అయితే వీటిలో ఎక్కువ వేరియేషన్స్ మాత్రం రామ్ చరణ్ పాత్రకు ఉన్నాయని చెప్పొచ్చు. ఇదే విషయాన్ని కథ రచయిత విజయేంద్ర ప్రసాద్ కూడా ఒక సందర్భంలో చెప్పుకొచ్చారు.

ఇకపోతే రామ్ చరణ్ కి, ఎన్టీఆర్ కి ఎటువంటి ఫ్యాన్ బేస్ ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆర్ ఆర్ ఆర్ సినిమాకు సంబంధించి ఎన్టీఆర్ ది కేవలం ఒక గెస్ట్ రోల్ మాత్రమే అంటూ చరణ్ అభిమానులు ఇదివరకే కామెంట్ చేయడం మొదలుపెట్టారు. ఇక రీసెంట్ గా ఆ వివాదం తగ్గింది అనగానే ఇప్పుడు రాజమౌళి రివీల్ చేసిన ఒక విషయంతో మళ్లీ ఆర్గ్యుమెంట్స్ మొదలయ్యాయి.

అయితే ట్రిపుల్ ఆర్ సినిమాలో జెన్నీ క్యారెక్టర్ ను ముందుగా చనిపోయే విధంగా డిజైన్ చేశారని చెప్పుకొచ్చారు రాజమౌళి. అయితే సినిమా క్లైమాక్స్ కి వస్తున్న సందర్భంలో సినిమాని సాడ్ గా ఎండ చేయడం కరెక్ట్ కాదని చెప్పి మళ్లీ కొన్ని సీన్స్ మార్చమంటూ చెప్పాడు రాజమౌళి. ఇకపోతే ఇదే విషయంపై సోషల్ మీడియాలో రకరకాలుగా చర్చలు జరుగుతున్నాయి. కొంతమంది ఎన్టీఆర్ అభిమానులు అలా జెన్ని చనిపోయి ఉంటే ఎన్టీఆర్ పాత్రకు ఎక్కువ స్కోప్ ఉండేదేమో అనుకుంటున్నారు. దీనికి చరణ్ అభిమానులు స్పందిస్తూ ఏదేమైనా కూడా గెస్ట్ రోలే కదా అంటూ మళ్ళీ కామెంట్ చేయడం మొదలుపెట్టారు.

Check out Filmify for the latest Tollywood news in Telugu, and all the Entertainment News, current news in Bollywood and Celebrity News & Gossip, from all Film Industires.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు