Jr NTR : కన్నడ దిగ్దర్శకులతో తారక్.. ఫ్యాన్స్ లెక్కలు…

నందమూరి నట వారసుడు యంగ్ టైగర్ ఎన్టీఆర్ దేవర తో ఫుల్ బిజీ గా ఉన్నాడన్న విషయం తెలిసిందే. ఏడాదిన్నర గా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా ఈ ఏడాది దసరా కానుకగా రిలీజ్ చేయడానికి మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. ఇక రెండు భాగాలుగా తెరకెక్కబోయే దేవర కోసం ఎన్టీఆర్ చాలా మేకోవర్ చేసాడని తెలిసిందే. దానికి తోడు రిలీజ్ చేసిన ఫస్ట్ లుక్ పోస్టర్స్, ఇంకా టీజర్స్ తో ఓ రేంజ్ హైప్ తీసుకొచ్చారు. అయితే పాన్ ఇండియా మూవీ గా తెరకెక్కుతున్న ఈ సినిమాకు అప్పుడప్పుడు షూటింగ్ కి బ్రేక్ వస్తూనే ఉంది. ఆ మధ్య సైఫ్ అలీ ఖాన్ గాయం కారణంగా పలు ఆక్షన్ సన్నివేశాల చిత్రీకరణకు బ్రేక్ రాగా, రీసెంట్ గా జాన్వీ కపూర్ వల్ల కొన్ని రోజులు గ్యాప్ వచ్చిందని సమాచారం. ముఖ్యంగా మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ టైం కి సరైన ట్యూన్స్ ఇవ్వడం లేదని టాక్ నడుస్తుంది. అయితే ఎన్టీఆర్ కొరటాల శివ మాత్రం వాళ్ళకి సంబంధించిన షూట్స్ పూర్తి చేస్తూనే ఉన్నారు.

ప్రైవేట్ పార్టీ లో ప్రశాంత్ నీల్, రిషబ్ శెట్టి తో తారక్..

ఇదిలా ఉండగా దేవర షూట్ కి తారక్ కొంచెం బ్రేక్ ఇవ్వగా, వైఫ్ ప్రణవి తో కలిసి బెంగుళూరు లో తాజాగా ఓ ప్రైవేట్ పార్టీ కి అటెండ్ అయ్యాడు జూనియర్ ఎన్టీఆర్. అయితే ఈ పార్టీ లో కన్నడ స్టార్ డైరెక్టర్స్ ప్రశాంత్ నీల్, రిషబ్ శెట్టి ఫ్యామిలీస్ తో కలిసి పాల్గొనడం జరిగింది. ఈ సందర్బంగా తారక్ ఈ ఇద్దరు డైరెక్టర్లతో కలిసిన ఫోటో మూమెంట్ సోషల్ మీడియా లో తెగ వైరల్ అవుతుంది. ఇక ఫ్యాన్స్ అయితే ఓ రేంజ్ లో లెక్కలు వేసుకుంటున్నారు. ఆల్రెడీ ప్రశాంత్ నీల్ తో ఓ సినిమా బాకీ ఉందని తెలిసిందే. ఇప్పుడు రిషబ్ శెట్టి తోనూ సినిమా తీస్తాడని లెక్కలు వేస్తున్నారు అభిమానులు.

- Advertisement -

ప్రశాంత్ నీల్, రిషబ్ ఎవరు ముందు?

కొరటాల శివ తర్వాత ఎన్టీఆర్ ఎవరితో సినిమా చేస్తున్నాడన్న సందిగ్దత ఫాన్స్ లో ఉంది. అయితే ముందుగా దేవర ఫినిష్ అయిన తర్వాత మాటలే అయినా, తారక్ తో చాలా మంది దర్శకుల సినిమాలు పెండింగ్ లో ఉన్నాయన్న విషయం వాస్తవం. ముందుగా దేవర ఫస్ట్ పార్ట్ పూర్తవగానే ప్రశాంత్ నీల్ తో ఎన్టీఆర్ సినిమా చేయాల్సి ఉంది. అయితే ప్రశాంత్ నీల్ ఒకవేళ ప్రభాస్ తో సలార్ శౌర్యంగ పర్వం మొదలుపెడితే, తారక్ తో త్రివిక్రమ్ చేయడానికి రెడీ గా ఉన్నాడు. ఇక బుచ్చిబాబు తో కూడా ఎన్టీఆర్ ఓ సినిమా చేయాల్సి ఉన్నా, ఆల్రెడీ రామ్ చరణ్ తో చేస్తున్నాడు కాబట్టి మళ్ళీ ఏడాదిన్నర తర్వాతే వీరి కాంబోలో ఉండే ఛాన్స్ ఉంది.

ఇక కాంతార దర్శకుడు నటుడు అయిన రిషబ్ శెట్టి అప్పట్లో కాంతార ప్రమోషన్స్ టైం లో తెలుగులో ఈ సినిమా చేయాల్సి వస్తే తారక్ తో చేసేవాడినని ఓ ఇంటర్వ్యూ లో చెప్పుకొచ్చాడు. అప్పటినుండి రిషబ్ శెట్టి తో కూడా సినిమా ఉంటుందని ఫ్యాన్స్ లెక్కలు వేస్తున్నారు. ఏది ఏమైనా ఇప్పుడు అందరు స్టార్ హీరోలు దర్శకులు పాన్ ఇండియా సినిమాలపై దృష్టి పెడుతున్నారు కాబట్టి, టైం కి పూర్తై సినిమా రిలీజ్ అయ్యాక, దర్శకుడు హీరో ఖాళీగా ఉండే పరిస్థితిని బట్టి ఎవరితో చేయాలి అని ఒక అంచనా వేసుకుంటున్నారు. పైగా ఈ రోజుల్లో హీరో కోసం ఏడాది పాటు వెయిట్ చేసే తీరికా ఎవరికీ లేదు.

Check out Filmify for the latest Bollywood Movie updates, New Movie Reviews, Ratings, and all the Entertainment News in Bollywood, Hollywood, Tollywood, Mollywood, and all other Film Industries.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు