Devara : విజయ కాంక్షతో “విజయదశమి” కి వస్తున్నాడు..

జూనియర్ ఎన్టీఆర్ కొరటాల శివ కాంబినేషన్ లో వస్తున్న “దేవర” సినిమాకోసం నందమూరి అభిమానులు ఏ రేంజ్ లో ఎదురుచూస్తున్నారో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. రెండేళ్ల కింద స్టార్ట్ అయిన ఈ సినిమా ఇప్పటికీ షూటింగ్ జరుపుకుంటూనే ఉంది. 2024 లో సమ్మర్ లో వస్తుందని ఎప్పుడో అనౌన్స్ చేసిన ఈ మూవీ మేకర్స్ సినిమా షూటింగ్ లో ఆలస్యం చేస్తుండే సరికి వాయిదా పడుతుందని ట్రేడ్ విశ్లేషకులు అంచనా వేశారు. అనుకున్నట్టుగానే సమ్మర్ బరి నుండి తప్పుకున్నారు. ఈ వార్త ముందుగా అఫిషియల్ గా చెప్పుకున్నా, దేవర డేట్ కి ఇతర సినిమాల అనౌన్స్ మెంట్స్ రావడంతో తేలిపోయింది.

అయితే కొత్త రిలీజ్ డేట్ మాత్రం మేకర్స్ ప్రకటించకపోయే సరికి అభిమానులు చాలా సీరియస్ అయ్యారు. కనీసం ఎదో ఒక క్లారిటీ ఇవ్వమని సోషల్ మీడియాలో మేకర్స్ కి సంబంధించిన ప్రతి పేజీలో కామెంట్స్ పెడుతూ ట్రోల్ కూడా చేసారు. ఇక ఎట్టకేలకు దేవర రిలీజ్ డేట్ అనౌన్స్ మెంట్ వచ్చేసింది.

- Advertisement -

హై వోల్టేజ్ ఆక్షన్ డ్రామాగా తెరకెక్కుతున్న దేవర పార్ట్ 1 ను విజయదశమి కానుకగా అక్టోబర్ 10న రిలీజ్ చేస్తున్నట్టు మేకర్స్ ప్రకటించడం జరిగింది. ఇక ఈ సూపర్ న్యూస్ ని ఎన్టీఆర్ తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేసాడు. ఇక జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో సైఫ్ అలీ ఖాన్ విలన్ గా నటిస్తున్నాడని తెలిసిందే. నందమూరి తారక రామారావు ఆర్ట్స్ బ్యానర్ పై కళ్యాణ్ రామ్ ఈ సినిమాని 200 కోట్లకి పైగా భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నాడు. ఇక దేవర రెండో భాగం 2025 సమ్మర్ లో రానుంది.

Check out Filmify for the latest Tollywood news in Telugu, and all the Entertainment News, current news in Bollywood and Celebrity News & Gossip, from all Film Industires.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు