Anushka – Krish Movie : అనుష్క, క్రిష్ మూవీ టైటిల్ లీక్

అనుష్క శెట్టి బరువు సమస్యలతో సతమతమవుతూ గత మూడు నాలుగేళ్లుగా మీడియా ముందుకు రావడమే మానేసింది. ఆమె గత చిత్రం “మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి” సినిమా ప్రమోషన్ల కోసం కూడా ఫోన్ ఇంటర్వ్యూలు మాత్రమే ఇచ్చింది. కేవలం కొన్ని వీడియో ఇంటర్వ్యూలకు మాత్రమే గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇక ఇప్పటిదాకా బరువు, ఆరోగ్య సమస్యలతో సినిమాలకు దూరంగా ఉన్న అనుష్క ఎట్టకేలకు క్రిష్ దర్శకత్వంలో ఒక కొత్త సినిమాను మొదలు పెట్టింది. అనుష్క చేస్తున్న ఈ లేటెస్ట్ మూవీ టైటిల్ తాజాగా లీక్ అయ్యింది. ఇంతకీ ఆ టైటిల్ ఏంటి? అనే వివరాల్లోకి వెళ్తే…

వరుస ఆఫర్లు వస్తున్నప్పటికీ అనుష్క పలు కారణాలతో సినిమాలకు దూరంగా ఉంటూ వస్తోంది. రీసెంట్ గా ఆమె క్రిష్ దర్శకత్వంలో ఒక ఉమెన్ సెంట్రిక్ మూవీ చేయడానికి అంగీకరించింది. అయితే ఈ ప్రాజెక్టుపై ఇంకా అధికారిక ప్రకటన అయితే రాలేదు. కానీ షూటింగ్ కోసం హైదరాబాదులో భారీ సెట్స్ నిర్మిస్తున్నారు. డైరెక్టర్ క్రిష్ ఈ సినిమా షూటింగ్ ను శరవేగంగా పూర్తి చేయడానికి ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే ఈ ప్రాజెక్టుకు సంబంధించి అనుష్క వీడియోలు, ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయిన విషయం తెలిసిందే.

అనుష్క, క్రిష్ కాంబోలో రూపొందుతున్న ఈ మూవీని యూవి క్రియేషన్స్, ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్టైన్మెంట్ నిర్మాతలు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. అయితే ఈ నేపథ్యంలోనే అనుష్క కొత్త సినిమా టైటిల్ ఇదేనంటూ సోషల్ మీడియాలో రూమర్ మొదలైంది. ఈ లేడీ ఓరియంటెడ్ మూవీకి “శీలవతి” అనే టైటిల్ ను మేకర్స్ ఖరారు చేసినట్టు ప్రచారం జరుగుతోంది. అసలు అనుష్క నటిస్తున్న ఈ సినిమా గురించే ఇంకా అఫీషియల్ అనౌన్స్మెంట్ రాలేదు, కానీ అంతలోనే టైటిల్ ఇదేనంటూ పుకార్లు షికార్లు చేస్తున్నాయి. ఇక ఈ సినిమా ఈ ఏడాదిలోనే రిలీజ్ కానుందని తెలుస్తోంది.

- Advertisement -

నిజానికి అనుష్క గతంలో లాగా వరుసగా సినిమాలు చేయాలని ఆమె అభిమానులు కోరుకుంటున్నారు. కానీ స్వీటీ మాత్రం సినిమాలు చేయడానికి పెద్దగా ఆసక్తిని కనబరచట్లేదు. చాలా గ్యాప్ తీసుకున్న తర్వాత రీసెంట్ గా “మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి” అనే సినిమాతో ప్రేక్షకులను అలరించింది. గతేడాది సెప్టెంబర్ లో ఈ సినిమా రిలీజ్ కాగా, దాదాపు 5 నెలల గ్యాప్ తీసుకుని మరో సినిమా మొదలు పెట్టింది. డిజిటల్ ఎంట్రీ ఇవ్వబోతున్నట్టుగా ఇప్పటికే ప్రకటించింది అనుష్క. మరి దేవసేన తన కోరిక మేరకు వరుసగా సినిమాలు చేయడానికి ఇంకెంత టైం తీసుకుంటుందో చూడాలి.

Checkout Filmify for the latest Movie news in Telugu, New Movie Reviews & Ratings, and all the Entertainment News. Also provides new movie release dates & updates, Telugu cinema gossip, and other film industries Movies updates, etc

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు