Rakshasa Raju : రానా తన గురించి ఎప్పుడు ఆలోచించేది?

Rakshasa Raju : టాలీవుడ్ హల్క్ దగ్గుపాటి రానా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. దగ్గుపాటి వారసుడిగా ఇండస్ట్రీ కి ఎంట్రీ ఇచ్చిన ఈ హీరో తన విలక్షణ నటనతో మెప్పిస్తూ పాన్ ఇండియా రేంజ్ లో పాపులారిటీ సంపాదించుకున్నారు. ఒకవైపు హీరోగా నటిస్తూనే, మరోవైపు ఇతర స్టార్ హీరోల సినిమాల్లో కూడా విలన్ గా, ప్రత్యేక పాత్రల్లో నటిస్తూ బిజీగా ఉన్నాడు. అయితే ఏడాదిన్నర పాటు సినిమాలకు కాస్త గ్యాప్ ఇచ్చిన రానా ఇప్పుడు కల్కి ప్రమోషన్ లో బిజీ గా ఉన్నాడు. స్వతహాగా గ్రాఫిక్స్ డిజైనర్ అయిన రానా, కల్కి2898AD సినిమాను ఇంటెర్నేషల్ రేంజ్ లో బాగా ప్రమోట్ చేస్తున్నాడు. ఇక అప్పట్లో బాలీవుడ్ లో బాహుబలి ని కూడా రానా నే ప్రత్యేకంగా ప్రమోట్ చేసాడు. ఇక ఇప్పుడు తాను కూడా వరుస సినిమాల్లో నటిస్తూ బిజీ అవుతున్నాడు. ఇదిలా ఉండగా ఒకప్పుడు చిత్రం, జయం లాంటి బ్లాక్ బస్టర్లు ఇచ్చిన తేజ గత కొన్నేళ్లుగా పూర్తిగా అవుట్ అఫ్ ఫామ్ లో ఉండటం చూస్తూనే ఉన్నాం. “నేనే రాజు నేనే మంత్రి” ఒక్కటే సక్సెస్ కొట్టింది. రీసెంట్ గా దగ్గుబాటి అభిరాంని పరిచయం చేసిన అహింసని జనాలు మేము తట్టుకోలేమంటూ ఫ్లాప్ చేశారు. అయినా సరే సురేష్ బాబుకి తేజ మీద బోలెడు నమ్మకం. అందుకే రానాతో “రాక్షస రాజు” చేసే ఛాన్స్ ఇచ్చారు.

తేజా తో రాక్షస రాజు..

అయితే గత ఏడాదే తేజ తో రానా సినిమా రాక్షస రాజు (Rakshasa Raju) అంటూ ఘనంగా ప్రకటించారు. కానీ ఆ సినిమా రెగ్యులర్ షూటింగ్ కి ఇంకా వెళ్ళలేదు. అయితే ఇంత గ్యాప్ రావడంతో సోషల్ మీడియా లో ఇంతకీ ప్రాజెక్టు ఉంటుందా లేదా అన్న అనుమానాలు కూడా వస్తున్నాయి. కొన్నేళ్ల క్రితం వెంకటేష్ తో ‘ఆటా నాదే వేటా నాదే’ అనే టైటిల్ తో ఓ సినిమాని తేజతో ప్లాన్ చేసుకున్నారు. దీనికోసం రామానాయుడు స్టూడియోస్ లో క్యాస్టింగ్ కోసం ఆడిషన్లు కూడా జరిగాయి. తీరా కొన్ని సీన్లు తీశాక ఆపేశారు. అలాగే ఇప్పుడు రానా రాక్షస రాజు తాలూకు అప్డేట్స్ జాడే లేకపోవడంతో రకరకాల ఊహాగానాలు మొదలైపోయాయి. అయితే తాజాగా వస్తున్న కథనాల ప్రకారం రానా వల్లే షూటింగ్ కి ఆలస్యమవుతుందని నెటిజన్లు అంటున్నారు.

తన సినిమా గురించి ఆలోచించేదెప్పుడు?

అయితే సోలో హీరోగా రానాకు బ్రేక్ ఇచ్చిన తేజ రాక్షస రాజుని మంచి డెప్త్ కూడిన కథగా రాసుకున్నారనే టాక్ వచ్చింది. ఫ్యాన్స్ కూడా ఎదురు చూడటం మొదలుపెట్టారు. కానీ రానా చూస్తేనేమో రజనీకాంత్ వెట్టయన్ షూటింగ్ లో బిజీగా ఉన్నాడు. అలాగే కల్కి2898AD ప్రమోషన్ లో ఉన్నాడు, కానీ తేజ మూవీకి సంబంధించిన కబుర్లు ఏమి చెప్పడం లేదు. షూటింగ్ ఉన్నా లేకపోయినా క్రమం తప్పకుండా ఒక కాంబో గురించిన వార్తలు, విశేషాలు ఎప్పటికప్పుడు ఏదో ఒక రూపంలో బయటికి వస్తుండాలి. అప్పుడే ఆడియన్స్ దాని గురించి మాట్లాడుకుంటారు. కానీ రాక్షస రాజు గురించి ఎలాంటి సౌండ్ లేకపోవడం వల్ల సినిమా ఆగిపోయిందా అన్న అనుమానం వ్యక్తం అవుతుంది. ఏది ఏమైనా ఎంతో టాలెంట్ ఉన్న రానా తన సినిమాలని కూడా పట్టించుకోవాలని దగ్గుపాటి అభిమానులు కోరుకుంటున్నారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు