Prashanth Neel : ‘శౌర్యంగపర్వం’ ఇప్పుడు మొదలెట్టక తప్పదు.. అసలు కారణం ఇదే..!

Prashanth Neel : ప్రస్తుతం ఇండియన్ డైరెక్టర్స్ లో భారీ లెవల్ లో క్రేజ్ ఉన్న డైరెక్టర్స్ లో ప్రశాంత్ నీల్ ఒకరు. కెజిఎఫ్ తో పాన్ ఇండియా వైడ్ గా ఫేమస్ అయిన ఈ దర్శకుడు రీసెంట్ గా రెబల్ స్టార్ ప్రభాస్ తో సలార్ సీస్ఫైర్ తో పాన్ ఇండియా రేంజ్ లో రచ్చ చేసిన చేసిన సంగతి తెలిసిందే. ముందుగా ఒక పార్ట్ అనుకున్నా, రిలీజ్ టైం నాటికి రెండు పార్ట్స్ చేసేసారు. ఇక సినిమాకి మిశ్రమ స్పందన వచ్చినా, భారీ ఓపెనింగ్స్ తో దుమ్ములేపగా, దాదాపు 600 కోట్లకి పైగా కలెక్షన్లు కొల్లగొట్టి రికార్డు సృష్టించింది. ఇక సినిమా అయిపోగానే రెండో పార్ట్ “శౌర్యంగ పర్వం” (సలార్ పార్ట్2) పేరుతో త్వరలో ప్రేక్షకుల ముందుకు వస్తారు అని అనౌన్స్ చేసారు. అయితే సలార్ సినిమా రిలీజ్ అయి కూడా ఆరు నెలలు దాటింది. కానీ ప్రశాంత్ నీల్ తర్వాతి సినిమా మొదలుపెట్టలేదు. ప్రభాస్ ఏమో కల్కి2898AD, రాజా సాబ్ షూటింగ్ లతో బిజీ అయ్యాడు. కానీ ప్రశాంత్ నీల్ తర్వాతి సినిమాలపైనే అందరి ఆసక్తి నెలకొని ఉంది. అయితే ప్రశాంత్ నీల్ సలార్ సినిమా తర్వాత టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో “NTR31” సినిమా చేయాల్సి ఉంది. కానీ సలార్ సినిమానే మొదలుపెట్టాల్సిన పరిస్థితి వచ్చింది.

శౌర్యంగ పర్వం మొదలుపెట్టాక తప్పదు..?

అయితే సలార్ 2 తర్వాత ప్రశాంత్ నీల్ (Prashanth Neel) ముందు ఏ సినిమా చేస్తాడన్న ఆసక్తి రాగా, తాజాగా వచ్చిన సమాచారం ప్రకారం ప్రశాంత్ నీల్ ఎన్టీఆర్ సినిమా కన్నా ప్రభాస్ శౌర్యంగ పర్వమే మొదలు పెట్టాల్సి ఉంటుందని సమాచారం. ఇక ఎన్టీఆర్31 సినిమాను ఎప్పుడో అనౌన్స్ చేసినా కూడా, RRR డిలే వలన, ఆ తర్వాత దేవర వలన లేట్ అవుతూ రాగా, ఇక ఆ తర్వాత ఎన్టీఆర్ ఇప్పుడు వార్2 కూడా కమిట్ అవ్వడంతో ప్రాజెక్ట్ పట్టాలు ఎక్కడానికి మరింత టైం పడుతూ ఉంది. కాగా రీసెంట్ గా ప్రశాంత్ నీల్ ఎన్టీఆర్31 సినిమాను పోస్ట్ పోన్ చేసి సలార్2 ను పట్టాలు ఎక్కించడానికి ఎక్కువ ఆసక్తి చూపిస్తున్నట్లు వార్తలు చక్కర్లు కొడుతూ ఉండగా దీని గురించి అసలు నిజాలు ఇవేనని యూనిట్ వర్గాల నుండి సమాచారం అందుతుంది. ఆ న్యూస్ ప్రకారం ఎన్టీఆర్31 కన్నా ముందు సలార్ 2 (శౌర్యంగ పర్వం) మొదలు అవ్వడం ఖాయంగా కనిపిస్తుంది.

సలార్ 2 ముందు తీయడానికి ఇదే కారణం?

అయితే ప్రశాంత్ నీల్ సలార్ 2 పైనే ఎక్కువ ఇంట్రస్ట్ చూపించడానికి ఇదే కారణం అని వార్తలు వస్తున్నాయి. ప్రభాస్ సలార్2 లో హీరోలిద్దరి చిన్నప్పటి సీన్లు కొన్ని కీలక సన్నివేశాలు తీయాల్సి ఉంది. అయితే షూటింగ్ పరంగా ముందుగా సలార్ 1 లో చిన్నప్పటి ప్రభాస్, పృద్వీరాజ్ ల లాగా నటించిన చైల్డ్ ఆర్టిస్ట్ పిల్లలు పెద్ద అవుతూ ఉండటంతో సలార్2 లో వాళ్ళ మీద తీయాల్సిన సన్నివేశాలు ఉండటంతో ముందుగా వాళ్ళ పైన సీన్స్ ని తీసేసి, ఆ తర్వాత నెమ్మదిగా సలార్2 షూటింగ్ ను అఫిషియల్ గా మొదలు పెట్టె అవకాశం ఉందని లేటెస్ట్ టాక్. అందుకోసమే ఎన్టీఆర్31 కన్నా ముందు సలార్2 మొదలు అయ్యే అవకాశం ఉందని చెబుతూ ఉన్నారు. ఇక ఈ షూటింగ్ అయ్యే టైంకి ఎన్టీఆర్ దేవర, వార్2 సినిమాల షూటింగ్ లను పూర్తి చేసి తర్వాత ప్రశాంత్ నీల్ తో సినిమాను మొదలు పెడతాని, ఈ గ్యాప్ లో ప్రభాస్ బాలెన్స్ ఉన్న తన అప్ కమింగ్ మూవీస్ రాజాసాబ్, స్పిరిట్ సినిమాలను పూర్తి చేసి తర్వాత సలార్2 లో జాయిన్ అవుతారని సమాచారం. ఏది ఏమైనా 2025 లో ప్రశాంత్ నీల్ నుండి ఓ సినిమా రావడం అయితే పక్కా.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు