Directer Teja : గురువుని ఫాలో అవుతున్న తేజ..! చూస్తుంటే పరిస్థితి అలాగే ఉంది?

Directer Teja : టాలీవుడ్ లో టాలెంటెడ్ దర్శకుల్లో తేజ ఒకరు. ఉదయ్ కిరణ్, నితిన్, సదా, నవదీప్, కాజల్ అగర్వాల్ లాంటి ఎంతో మంది టాలెంటెడ్ నటీనటులను పరిచయం చేసిన ఘనత ఆయనది. రామ్ గోపాల్ వర్మ శిష్యుడిగా ఇండస్ట్రీ కి పరిచయమైనా దర్శకుడు తేజ తనదైన శైలి లో తీస్తూ దూసుకుపోయాడు. అసలు దర్శకుడు తేజ పేరు చెప్పగానే ఆయన దర్శకత్వంలో వచ్చిన ట్రెండ్‌ సెట్టర్‌ లవ్‌ స్టోరీ సినిమాలు నువ్వు నేను, జయం, జై లాంటి సినిమాలు గుర్తుకు వస్తాయి. అయితే అలాంటి సినిమాలు వచ్చి రెండు దశాబ్దాలు గడుస్తున్నా కూడా డైరెక్టర్ తేజ పేరు చెబితే ఆ సినిమాల పేర్లు గుర్తుకు వస్తున్నాయి తప్ప, కొత్తగా రీసెంట్ గా తేజ చేసిన సినిమాలు ఏవో కూడా జనాలు చెప్పలేని పరిస్థితి. మధ్యలో కొన్నేళ్ల కింద రానాతో తీసిన నేనే రాజు నేనే మంత్రి సినిమా ఒక్కటే మెప్పించింది. ఇక అహింస సినిమా తర్వాత తేజ ఏం చేసినా ప్రేక్షకులు చూసే పరిస్థితి లేదు అంటూ తెలుగు రివ్యూవర్స్ తేల్చి పారేశారు. అది కూడా పెద్ద బ్లాక్ బస్టర్ ఏమి కాదు. ఇక ఆ తర్వాత అయినా కూడా తాను సినిమాలు చేయడం మానేది లేదు. తన నుంచి వరుసగా సినిమాలు వస్తాయి అంటూ ప్రకటించాడు.

గురువుని ఫాలో అవుతున్న తేజ..

ఇక తేజ సోషల్ మీడియా లో కొన్నేళ్లలో పలు స్టార్లతో సినిమాలు అంటూ ప్రకటించాడు. ఆ మధ్య రానా తో చేసిన నేను రాజు నేనే మంత్రి సినిమా సీక్వెల్‌ ‘రాక్షస రాజు’ అంటూ ప్రకటించాడు. మళ్ళీ ఆ వార్తే లేదు. కానీ అందులో మొదలు పెట్టి పూర్తి చేసింది మాత్రం లేదు. ఈ విషయంలో గురువు రామ్ గోపాల్ వర్మ ని ఫాలో అవుతున్నాడు తేజ. ఆ మధ్య వర్మ ఏడాదికి పది సినిమాలను ప్రకటించే వాడు. అందులో ఒకటి రెండు కూడా పూర్తి చేసేవాడు కాదు. పైగా గత పదిహేనేళ్లలో వర్మ అన్ని వివాదాల నేపథ్యంలోనే సినిమాలు చేసిన విషయం తెలిసిందే. ఇక ఇప్పుడు తేజ కూడా అలాగే చేస్తున్నాడు అంటూ విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. ఆ మధ్య ఒకే సారి రెండు సినిమాలు చేస్తాను అంటూ ప్రకటించాడు. అందులో ఒకటి అలిమేలుమంగ వెంకటరమణ, రాక్షస రాజు రావణాసురుడు, చిత్రం 2, వెంకటేష్ తో ఆటా నాదే వేటా నాదే ఇలా చాలా సినిమాలను తేజ ప్రకటించాడు. కానీ అందులో ఇప్పటి వరకు ఏ ఒక్కటి కూడా సెట్స్ లోకి వెళ్లలేదు. ఇక ముందు ఇంకా ఎన్ని ప్రకటిస్తాడో అంటూ కొందరు కామెంట్స్ చేస్తున్నారు.

కంటెంట్ ఉన్న సినిమా తీయకపోతే గురువు లాగే?

అయితే దర్శకుడు తేజ (Directer Teja) నుండి ఈ మధ్య కాలంలో నేనే రాజు నేనే మంత్రి సినిమా మినహా కంటెంట్ ఉన్న సినిమా రాలేదని తెలిసిందే. లాస్ట్ టైం వచ్చిన అహింస ప్రేక్షకులను ఎంత హింసించిందో తెలిసిందే. ఇక స్టార్స్ తో సినిమాలు మాత్రం పట్టాలెక్కడం లేదు.ఇక ఆ మధ్య గోపీచంద్‌ తో ఈయన అలిమేలు మంగ వెంకటరమణ సినిమాను మొదలు పెట్టినట్లుగానే హడావుడి చేశాడు, కానీ అది సాధ్యం కాలేదు. చిత్రం 2 స్క్రీప్ట్‌ వర్క్ జరుగుతుందని వార్తలు వచ్చాయి. కానీ అది వర్కౌట్‌ అవ్వదని పక్కకు పెట్టేశాడు. రానాతో చేస్తానంటూ చెబుతున్న రాక్షస రాజు సినిమా ఉందా లేదా అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. అయితే ఒకప్పుడు ట్రెండ్ సెట్ చేసిన సినిమాలు తీసి ఇప్పుడు చెత్త సినిమాలు తీస్తూ విమర్శల పాలు అవుతున్న, రామ్ గోపాల్ వర్మ లాగే, తేజ కూడా ఫామ్ కోల్పోతాడేమో అని నెటిజన్లు అంటున్నారు. అలా కాకూడదంటే వెంటనే రానా తోనో ఇంకెవరితోనో సినిమా స్టార్ట్ చేసి స్ట్రాంగ్ కం బ్యాక్ ఇస్తేగాని, అందరి నోళ్లు మూతబడవు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు