Krishnamma : వీళ్లకు ‘కృష్ణమ్మ’ ఒడ్డుకు చేరడం కష్టమే..!

Krishnamma : టాలీవుడ్ టాలెంటెడ్ హీరోల్లో ఒకరైన సత్యదేవ్ హీరోగా నటించిన తాజా చిత్రం “కృష్ణమ్మ”. విలేజ్ బ్యాక్ డ్రాప్ లో యాక్షన్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన కృష్ణమ్మ సినిమా టీజర్, ట్రైలర్ మంచి రెస్పాన్స్ తెచ్చుకోగా, ఈ సినిమా శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమాను వీవీ గోపాలకృష్ణ దర్శకత్వం వహించగా, అరుణాచల క్రియేషన్స్ బ్యానర్ పై కృష్ణ కొమ్మాలపాటి నిర్మించారు. స్టార్ డైరెక్టర్ కొరటాల శివ సమర్పిస్తున్న ఈ మూవీకి కాలభైరవ సంగీతం అందించారు. అయితే రెండేళ్ళ గ్యాప్ తర్వాత ఆడియన్స్ ముందుకు తన కొత్త సినిమాతో వచ్చేశాడు సత్యదేవ్. తన లేటెస్ట్ మూవీ కృష్ణమ్మ (Krishnamma) తో ఆడియన్స్ ముందుకు రీసెంట్ గా రిలీజ్ చేయగా, సినిమా ఎప్పుడో రిలీజ్ అవ్వాల్సింది కానీ ఎప్పటి కప్పుడు పోస్ట్ పోన్ అవుతూ రాగా ఎట్టకేలకు ఈ వీకెండ్ లో రిలీజ్ అయిన సినిమా బీలో యావరేజ్ టాక్ తెచ్చుకుంది. ఇక టాలీవుడ్ లో రివేంజ్ డ్రామా మూవీస్ ఇష్టపడే ఒకరకమైన ఆడియన్స్ ని మాత్రం కాస్త మెప్పించే అవకాశం ఉంది. ఇక ఈ సినిమా ఓపెనింగ్స్ కలెక్షన్స్ మాత్రం దారుణంగా వచ్చాయి.

భారీ ప్రమోషన్ చేసినా డిజాస్టర్ ఓపెనింగ్స్..

అయితే శుక్రవారం రిలీజ్ అయిన కృష్ణమ్మ థియేటర్ రిలీజ్ పరంగా రివ్యూస్ కూడా అంతగా తెచ్చుకోలేకపోగా, క్రిటిక్స్ నుండి నటీనటుల పెర్ఫార్మన్స్ పరంగా బెటర్ టాక్ తెచుకుంది. ఇక కూడా ఓపెనింగ్స్ పరంగా మాత్రం చాలా నిరాశ పరిచింది. సమ్మర్ లో అందరూ ఎలక్షన్స్ మూడ్ లోనే ఉండగా ఏమాత్రం జనాలు థియేటర్స్ కి వచ్చే మూడ్ లో కనిపించడం లేదు. ఈ క్రమంలో టాక్ కూడా బాగాలేకపోగా, బుకింగ్స్ పరంగా కూడా పెద్దగా జోరు చూపించ లేక పోయిన ఈ సినిమా, ఆఫ్ లైన్ లో కొన్ని మాస్ సెంటర్స్ లో పర్వాలేదు అనిపించినా కూడా మొత్తం మీద ట్రాక్ చేసిన సెంటర్స్ ను బట్టి తెలుగు రాష్ట్రాల్లో 50 లక్షల రేంజ్ లో గ్రాస్ ఓపెనింగ్స్ ను సినిమా సొంతం చేసుకోగా, వరల్డ్ వైడ్ గా 70 లక్షల రేంజ్ లో గ్రాస్ ఓపెనింగ్స్ ను సినిమా సొంతం చేసుకుంది. మొదటి రోజు వర్త్ షేర్ 40 లక్షలకు అటూ ఇటూగా ఉండే అవకాశం ఉంది.

ఇక బాక్స్ ఆఫీస్ ఒడ్డుకు చేరడం కష్టమే..

ఇక సత్యదేవ్ కృష్ణమ్మ (Krishnamma) సినిమాకు రాజమౌళి లాంటి దర్శకులు కూడా వచ్చి భారీ ప్రమోషన్లు చేసినా ప్రయోజనం లేకపోయింది. ఇక పూర్తిగా నిరాశ ఓపెనింగ్స్ తెచ్చుకున్న ఈ సినిమా వాల్యూ బ్రేక్ ఈవెన్ టార్గెట్ 3 కోట్ల రేంజ్ లో ఉండగా క్లీన్ హిట్ కోసం చాలా కష్టపడాల్సిన అవసరం చాలా ఉంది. కానీ సినిమాకి ఈ వీకెండ్ లో రిలీజ్ అయిన మూవీస్ లో కొంచం పర్వాలేదు అనిపించే టాక్ ఉండటంతో వీకెండ్ లో ఎంతో కొంత బాక్స్ ఆఫీస్ దగ్గర జోరు చూపించే అవకాశం అయితే ఉందని చెప్పాలి. కానీ బ్రేక్ ఈవెన్ అయ్యే అవకాశం లేదనే చెప్పాలి. అంటే సత్యదేవ్ కి ఈ సినిమాతో ఒరిగేదేమి లేదని చెప్పల్సి ఉంటుంది. ఏదేమైనా బాక్స్ ఆఫీస్ వద్ద ప్లాపుల పరంపర కంటిన్యూ అయ్యేలా ఉంది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు